Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bajaj Chetak EV: బజాజ్‌ ఈవీ లవర్స్‌కు గుడ్‌ న్యూస్‌.. చేతక్‌ ఈవీపై అదిరిపోయే పండుగ బంపర్‌ ఆఫర్‌

గతంలో భారతదేశంలోని ఆటో మొబైల్‌ రంగంలో అత్యం ఆదరణ పొందిన బజాజ్‌ చేతక్‌ ఈవీ రంగంలో తన మార్క్‌ చూపించడానికి ఇటీవల చేతక్‌లో ఈవీ వెర్షన్‌ లాంచ్‌ చేసింది. అమ్మకాల పరంగా కూడా ఈ స్కూటర్‌ మెరుగైన ఫలితాలను నమోదు చేసింది. అయితే ప్రస్తుతం భారతదేశంలో పండుగ సీజన్‌ నేపథ్యంలో వినియోగదారులను ఆకట్టుకోవడానికి బజాజ్‌ చేతక్‌ సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది.  బజజ్‌ చేతక్‌ ఈవీను ప్రత్యేక పండుగ ధరల శ్రేణిలో కొనుగోలు చేయవచ్చు. 

Bajaj Chetak EV: బజాజ్‌ ఈవీ లవర్స్‌కు గుడ్‌ న్యూస్‌.. చేతక్‌ ఈవీపై అదిరిపోయే పండుగ బంపర్‌ ఆఫర్‌
Bajaj Chetak
Follow us
Srinu

| Edited By: Ravi Kiran

Updated on: Oct 26, 2023 | 10:05 PM

భారతదేశంలో ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగం పెరుగుతుంది. ముఖ్యంగా పెరుగుతున్న పెట్రోల్‌ ధరలకు ప్రత్యామ్నాయంగా అందరూ ఈవీ వాహనాలను ఎంచుకుంటున్నారు. ప్రభుత్వాలు కూడా పెరుగుతున్న కాలుష్యం నుంచి రక్షణకు ఈవీ వాహనాలపై ప్రత్యేక సబ్సిడీలను అందిస్తూ వాటిని సామాన్యులకు చేరువ చేస్తుంది. అయితే పెరుగుతున్న డిమాండ్‌ మేరకు అన్ని కంపెనీలు సరికొత్త ఫీచర్స్‌తో ఈవీ వాహనాలను లాంచ్‌ చేస్తూ వినియోగదారులను ఆకట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. గతంలో భారతదేశంలోని ఆటో మొబైల్‌ రంగంలో అత్యం ఆదరణ పొందిన బజాజ్‌ చేతక్‌ ఈవీ రంగంలో తన మార్క్‌ చూపించడానికి ఇటీవల చేతక్‌లో ఈవీ వెర్షన్‌ లాంచ్‌ చేసింది. అమ్మకాల పరంగా కూడా ఈ స్కూటర్‌ మెరుగైన ఫలితాలను నమోదు చేసింది. అయితే ప్రస్తుతం భారతదేశంలో పండుగ సీజన్‌ నేపథ్యంలో వినియోగదారులను ఆకట్టుకోవడానికి బజాజ్‌ చేతక్‌ సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది.  బజజ్‌ చేతక్‌ ఈవీను ప్రత్యేక పండుగ ధరల శ్రేణిలో కొనుగోలు చేయవచ్చు.  ఆసక్తి ఉన్న కస్టమర్లు ఇప్పుడు బ్యాటరీతో నడిచే వాహనాన్ని ప్రత్యేక ధర పరిధిలో రూ. 1.15 లక్షల (ఎక్స్-షోరూమ్) వద్ద కొనుగోలుకు సిద్ధంగా ఉంచారు. ఈ డీల్ పరిమిత కాలానికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. 

బజాజ్‌ చేతక్‌ ఫీచర్లు 

బజాజ్‌ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కస్టమర్‌కు సాఫీగా ప్రయాణించేలా రూపొందించారు. ఈ స్కూటర్‌ బలమైన ఐపీ 67 రేటెడ్ వాటర్ రెసిస్టెన్స్ క్లాసిఫికేషన్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఇది ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా పని చేస్తుంది. ఈ స్కూటర్‌ను మంచి నాణ్యమైన మెటీరియల్‌తో అభివృద్ధి చేసినట్లు కంపెనీ పేర్కొంది. ఇది సెగ్మెంట్‌లోని ఇతర ప్రత్యర్థుల నుండి ప్రత్యేకమైనదిగా చేస్తుంది.

ఇవి కూడా చదవండి

బజాజ్ చేతక్ ఈ-స్కూటర్ పవర్

పవర్ విషయానికి వస్తే 2.9 కేడబ్ల్యూహెచ్‌ బ్యాటరీ ప్యాక్ గరిష్టంగా 5.3 బీహెచ్‌పీ, 20 ఎన్‌ఎం గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేయడానికి సరిపోతుంది. అలాగే ఈ స్కూటర్‌ ఓ చార్జ్‌ 108 కి.మీ మైలేజ్‌ను అందిస్తుంది. అలాగే ఈ స్కూటర్ జీరో పాయింట్ నుంచి 100కి ఛార్జింగ్ పాయింట్‌కి చేరుకోవడానికి కేవలం ఐదు గంటలు మాత్రమే పడుతుంది. అయితే ఈ స్కూటర్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇవ్వదని గమనించాలి. మరిన్ని బిజినెస్ వార్తల కోసం..