Bajaj Chetak EV: బజాజ్ చేతక్ ఈవీపై అదిరిపోయే ఆఫర్.. ఏకంగా రూ.22 వేల తగ్గింపు.. క్లెయిమ్ చేయండిలా..!
ఇటీవల భారత ప్రభుత్వం ఫేమ్2 నిబంధనలు సవరించడంతో ఈవీ వాహనాల ధరలు కాస్త పెరిగాయి. ఈ నేపథ్యంలో వినియోగదారులను ఆకర్షించడానికి ఈవీ కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బజాజ్ చేతక్ ఈవీపై అద్భుతమైన ఆఫర్‌ను ప్రకటించింది. చేతక్ ఎలక్ట్రిక్ ఇప్పుడు రూ. 22,000 వరకు తగ్గింపు ధరతో వినియోగదారులకు అందుబాటులో ఉంది.

భారతదేశంలో ఈవీ వాహనాలకు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతుంది. ముఖ్యంగా అమెరికా, చైనా తర్వాత ఈవీ వాహనాలు ఎక్కువగా భారత్‌లోనే అమ్ముడవుతున్నాయి. ముఖ్యంగా పెరుగుతున్న పెట్రలోల్ ఖర్చుల నుంచి రక్షణకు చాలా మంది ఈవీ వాహనాలను ప్రత్యామ్నాయంగా పేర్కొంటున్నారు. పెరిగిన అనూహ్య డిమాండ్ నేపథ్యంలో అన్ని కంపెనీలు కొత్తకొత్త మోడల్ ఈవీలను ఎప్పటికప్పుడు లాంచ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల భారత ప్రభుత్వం ఫేమ్2 నిబంధనలు సవరించడంతో ఈవీ వాహనాల ధరలు కాస్త పెరిగాయి. ఈ నేపథ్యంలో వినియోగదారులను ఆకర్షించడానికి ఈవీ కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బజాజ్ చేతక్ ఈవీపై అద్భుతమైన ఆఫర్‌ను ప్రకటించింది. చేతక్ ఎలక్ట్రిక్ ఇప్పుడు రూ. 22,000 వరకు తగ్గింపు ధరతో వినియోగదారులకు అందుబాటులో ఉంది. భారీ తగ్గింపు తర్వాత బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర ఇప్పుడు రూ. 1.30 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ/బెంగళూరు)కు చేరింది. అయితే బజాజ్ చేతక్ ధర గతంలో రూ. 1.52 లక్షలుగా ఉండేది. ఈ తాజా తగ్గింపు గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
ఆ రెండు స్కూటర్లకు గట్టి పోటీ
ధర తగ్గింపు వల్ల ప్రస్తుతం బజాజ్ చేతక్ ఈవీ ఏథర్ 450 ఎక్స్, ఓలా ఎస్1 ప్రో జెన్2 స్కూటర్లకు గట్టి పోటీను ఇవ్వనుంది. ధర తగ్గింపు అంశాలను పరిగణలోకి తీసుకుంటే టీవీఎస్ ఐక్యూబ్ కూడా ఇప్పుడు రూ. 1.34 లక్షలతో ప్రారంభమవుతుంది. అలాగే ఇందులోని ఎస్ వేరియంట్ ధర రూ. 1.40 లక్షలుగా ఉంది. అలాగే విడా వీ1 ప్రో ధర రూ. 1.46 లక్షలుగా ఉంది. అయితే ఈ ధర తగ్గింపు పరిమిత కాలానికి అందుబాటులో ఉంటుందని బజాజ్ స్పష్టం చేసింది. కానీ ఆఫర్ గడువు ముగిసే నిర్దిష్ట తేదీని పేర్కొనలేదు. దేశవ్యాప్తంగా ఈ ఆఫర్ అందుబాటులోకి వస్తోంది. పలు నివేదికలు ప్రకారం ఈ ఆఫర్ ఆగస్టు 1 నుంచే అమల్లో ఉంది.
బజాజ్ చేతక్ ఫీచర్లు ఇలా
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ వంకర బాడీవర్క్, కొన్ని కొత్త ఆధునిక అంశాలతో పాత-పాఠశాల స్కూటర్ డిజైన్‌ను కలిగి ఉంది. ఇది ఎల్‌ఈడీ హెడ్‌లైట్, పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీని కలిగి ఉంది. బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ 3.8 కేడబ్ల్యూహెచ్ మోటార్‌తో వస్తుంది. అలాగే ఈ స్కూటర్ 3 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ నుంచి శక్తిని పొందుతుంది. దీని గరిష్ట వేగం గంటకు 63 కిలోమీటర్లు వేగంతో దూసుకుపోతుంది. అలాగే ఓ సారి చార్జ్ చ్తేఏ 107 కిలోమీటర్లు మైలేజ్ ఇస్తుంది. అలాగే ఈ స్కూటర్‌ను కేవలం నాలుగు గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చని కంపెనీ పేర్కొంది. బజాజ్ బ్యాటరీ జీవితకాలం దాదాపు ఏడేళ్లు లేదా 70,000 కి.మీల వరకు ఉంటుందని స్పష్టం చేసింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..