Credit Card UPI: క్రెడిట్ కార్డులో యూపీఐ పేమెంట్స్.. ఐదు ప్రయోజనాలు
మొబైల్ ఫోన్ ఉంటే చాలు.. పేమెంట్ ఈజీగా చిటికెలో చేసేయవచ్చు. ఈ విధానం అందరికీ ఎంతో సమయాన్ని ఆదాచేయడమే కాకుండా టెన్షన్ లేకుండా చేస్తోంది. ఇప్పటి వరకూ డెబిట్ కార్డు మాత్రమే యూపీఐ పేమెంట్స్ కోసం ఉపయోగపడేది. ఇప్పుడు క్రెడిట్ కార్డు తో కూడా యూపీఐ పేమెంట్స్ చేయగలిగే పరిస్థితి వచ్చింది. ఇటీవల రూపే క్రెడిట్ కార్డ్‌ను ప్రవేశపెట్టడంతో ఇలాంటి అవకాశం వచ్చింది. ఇప్పుడు మీరు..
ఇప్పుడు పేమెంట్స్ అంటే స్కాన్ చేయడం.. లేదా ఫోన్ నెంబర్ కి డబ్బు పంపడం. అంతే. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ తో అంటే UPI తో వచ్చిన విప్లవం ఇది. గతంలోలా చెక్ ఇవ్వడం లేదా డబ్బు ఏటీఎం నుంచి డ్రా చేయడం లేదా బ్యాంకుకు వెళ్లి విత్ డ్రా చేసి తీసుకురావడం.. ఆ డబ్బును జేబులో మోస్తూ జాగ్రత్తలా చూసుకుంటూ తిరగడం ఇలాంటి ఇబ్బందులన్నిటికీ చెక్ పడిపోయింది. మొబైల్ ఫోన్ ఉంటే చాలు.. పేమెంట్ ఈజీగా చిటికెలో చేసేయవచ్చు. ఈ విధానం అందరికీ ఎంతో సమయాన్ని ఆదాచేయడమే కాకుండా టెన్షన్ లేకుండా చేస్తోంది. ఇప్పటి వరకూ డెబిట్ కార్డు మాత్రమే యూపీఐ పేమెంట్స్ కోసం ఉపయోగపడేది. ఇప్పుడు క్రెడిట్ కార్డు తో కూడా యూపీఐ పేమెంట్స్ చేయగలిగే పరిస్థితి వచ్చింది. ఇటీవల రూపే క్రెడిట్ కార్డ్‌ను ప్రవేశపెట్టడంతో ఇలాంటి అవకాశం వచ్చింది. ఇప్పుడు మీరు రూపే క్రెడిట్ కార్డ్ ద్వారా యూపీఐ ద్వారా సులభంగా చెల్లింపు చేయవచ్చు. ఇప్పుడు మనం రూపే క్రెడిట్ కార్డ్ తో యూపీఐ ద్వారా పేమెంట్స్ చేయడంలో ఉండే 5 ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
1. ఈజీ ట్రాన్సాక్షన్స్: బిల్లులు, ఆన్‌లైన్ షాపింగ్, పీర్-టు-మర్చంట్ ట్రాన్స్ఫర్ లతో సహా మీ అన్ని చెల్లింపులను ఒకే ప్లాట్‌ఫారమ్, యూపీఐ ద్వారా చేయవచ్చు. వివిధ యాప్‌లు లేదా ప్లాట్‌ఫారమ్‌ల మధ్య మారాల్సిన అవసరం లేదు.
2. రియల్ టైం ట్రాన్సాక్షన్స్: యూపీఐ లావాదేవీలు రియల్ టైమ్ లో ప్రాసెస్ అయిపోతాయి. మీరు క్రెడిట్ కార్డ్ ఫండ్స్ ఉపయోగించి ఇన్‌స్టంట్ పేమెంట్ చేయవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో ముఖ్యమైన ట్రాన్సాక్షన్స్ కోసం ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
3. రివార్డ్ పాయింట్‌లు.. ఆఫర్లు: రూపే యూపీఐ క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై రివార్డ్ పాయింట్‌లు – క్యాష్‌బ్యాక్ ఆఫర్‌లు అందుబాటులో ఉన్నాయి. ఎందుకంటే ట్రాన్సాక్షన్స్ కార్డ్ ద్వారానే జరుగుతాయి. ఇలాంటప్పుడు మీరు దీని నుంచి అదనపు ప్రయోజనం పొందుతారు.
4. ఫైనాన్షియల్ ట్రాకింగ్, మేనేజ్‌మెంట్: రూపే క్రెడిట్ కార్డ్‌తో UPI లింక్ చేసి ఉండటం వలన ట్రాన్సాక్షన్స్ సెంట్రలైజ్ అవుతాయి. మీరు మీ ఫైనాన్స్‌లను ట్రాక్ చేయడం- నిర్వహించడం ఈజీ చేస్తుంది. మీరు మీ ఖర్చు విధానాలను పర్యవేక్షించవచ్చు. ట్రాన్సాక్షన్స్ హిస్టరీ ని సమీక్షించవచ్చు అలాగే, ఎక్స్పెన్స్ లిమిట్స్ ను ఒకే ఇంటర్‌ఫేస్ ద్వారా సెట్ చేయవచ్చు.
5. ఆన్‌లైన్ షాపింగ్ సౌలభ్యం: యూపీఐని RuPay క్రెడిట్ కార్డ్‌తో లింక్ చేయడం ద్వారా, మీరు ప్రతి వెబ్‌సైట్‌లో మీ క్రెడిట్ కార్డ్ వివరాలను నమోదు చేయకుండానే యూపీఐ ద్వారా మీ క్రెడిట్ కార్డ్‌తో మీ ఆన్‌లైన్ కొనుగోళ్లకు పేమెంట్స్ చేసేయవచ్చు. మీరు దీన్ని యూపీఐ యాప్‌తో సులభంగా లింక్ చేయవచ్చు. మీకు రూపే క్రెడిట్ కార్డ్ ఉంటే, దానిని యూపీఐ యాప్‌తో ఎలా లింక్ చేయాలో ఇక్కడ మేము ప్రాసెస్‌ను తెలుసుకోండి. మీరు దీన్ని 2 నిమిషాల కంటే తక్కువ సమయంలో సులభంగా లింక్ చేయవచ్చు.
క్రెడిట్ కార్డ్‌ని యూపీఐతో లింక్ చేసే సదుపాయం సెప్టెంబర్ 21 నుంచి అందుబాటులో ఉంది.గత నెల, సెప్టెంబర్ 21న, గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్టివల్‌లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ యూపీఐ నెట్‌వర్క్‌లో రూపే క్రెడిట్ కార్డ్‌ను ప్రారంభించారు. ఇంతకుముందు, డెబిట్ కార్డ్‌లు – అకౌంట్స్‌ను మాత్రమే యూపీఐ నెట్‌వర్క్‌కి లింక్ చేసేవారు. ప్రస్తుతం పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్ అనే మూడు బ్యాంకులు క్రేడిట్గ్ కార్డులను యూపీఐ తో లింక్ చేసుకునే సదుపాయాన్ని కల్పించాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి