Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India: ఇంధన రంగంలో భారత్ కీలక నిర్ణయం.. సొంతంగానే ఉత్పత్తికి రంగం సిద్ధం

ఇంధన రంగంలో భారత్ భారీ విజయాన్ని సాధించింది. ఇప్పటి వరకు, చమురు కంపెనీలు రిఫరెన్స్ ఇంధనం కోసం విదేశీ వైపు చూడాల్సి వచ్చేది. ఈ రంగంలో భారత్ తొలిసారిగా విజయం సాధించి సొంతంగా ఉత్పత్తిని ప్రారంభించిందని, ఇది చాలా చారిత్రాత్మకమైన అవకాశమని, ప్రపంచంలో దీనిని ఉత్పత్తి చేస్తున్న నాలుగో దేశంగా భారత్ అవతరించనుందని మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. భారతదేశంలోని పారాదీప్, పనాపిట్‌లలో దీని ఉత్పత్తి ప్రారంభమైంది..

India: ఇంధన రంగంలో భారత్ కీలక నిర్ణయం.. సొంతంగానే ఉత్పత్తికి రంగం సిద్ధం
India
Follow us
Subhash Goud

|

Updated on: Oct 26, 2023 | 8:45 PM

ఇంధన రంగంలో భారత్ భారీ విజయాన్ని సాధించింది. ఇప్పటి వరకు, చమురు కంపెనీలు రిఫరెన్స్ ఇంధనం కోసం విదేశీ వైపు చూడాల్సి వచ్చేది. ఈ రంగంలో భారత్ తొలిసారిగా విజయం సాధించి సొంతంగా ఉత్పత్తిని ప్రారంభించిందని, ఇది చాలా చారిత్రాత్మకమైన అవకాశమని, ప్రపంచంలో దీనిని ఉత్పత్తి చేస్తున్న నాలుగో దేశంగా భారత్ అవతరించనుందని మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. భారతదేశంలోని పారాదీప్, పనాపిట్‌లలో దీని ఉత్పత్తి ప్రారంభమైంది. ఇండియన్ ఆయిల్ భారతదేశంలో మొదటిసారిగా రిఫరెన్స్ గ్యాసోలిన్, డీజిల్ ఇంధన ఉత్పత్తిని విజయవంతంగా ప్రారంభించింది. ఇది 200 లీటర్ల ప్యాక్‌లలో అందుబాటులో ఉంటుంది.

గ్యాసోలిన్, డీజిల్ వాహనాల కోసం ఆటోమొబైల్ తయారీదారులకు ఇంజిన్‌లను అభివృద్ధి చేయడానికి, ప్రస్తుత ప్రపంచ వాతావరణ పరిస్థితులన్నింటిలో ఆపరేషన్‌ను నిర్ధారించడానికి పనితీరును అంచనా వేయడానికి మెరుగైన నాణ్యమైన ‘రిఫరెన్స్ ఇంధనాలు’ అవసరం.

వాహన పరీక్షలో..

ఇవి కూడా చదవండి

ఆటోమొబైల్ రంగంలో ఇప్పటి వరకు రిఫరెన్స్ ఇంధనం ఉపయోగించబడింది. ఉదాహరణకు.. వాహనాల ఇంజన్, ఇతర సాంకేతిక విషయాలను పరీక్షించడంలో ఇది అవసరం. ఉద్గారాల నిబంధనలు, సంబంధిత ఇంధన లక్షణాలు ప్రపంచవ్యాప్తంగా గణనీయంగా మారుతూ ఉంటాయి. అందుకే కొత్త మోడల్‌లను అభివృద్ధి చేస్తున్న ఓఈఎంలకు వివిధ రకాల రిఫరెన్స్ ఇంధనాలు అవసరమవుతాయి. ప్రస్తుతం దేశంలో దేశీయ అవసరాలను తీర్చేందుకు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ రెఫరెన్స్ ఇంధనాన్ని యూరప్, అమెరికాకు చెందిన కొన్ని ఎంపిక చేసిన కంపెనీల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఆటోమొబైల్ తయారీదారులు, ఐసీఏటీ (ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ), ఏఆర్‌ఏఐ (ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) వంటి టెస్టింగ్ ఏజెన్సీల ద్వారా వాహనాలను పరీక్షించడానికి ఈ ఇంధనాలు ముఖ్యమైనవి.

త్వరలో భారత్‌ దీన్ని తయారు చేయనుంది

దశాబ్దాలుగా, భారతదేశం ఈ ప్రత్యేక ఇంధనాల డిమాండ్‌ను తీర్చడానికి దిగుమతులపై ఆధారపడి ఉంది. దేశీయంగా అభివృద్ధి చేయబడిన ఈ ఉత్పత్తులు దిగుమతుల స్థానంలో వాహన తయారీదారులు, టెస్టింగ్ ఏజెన్సీలకు తక్కువ ధరకు సరఫరాను నిర్ధారిస్తాయి. త్వరలో భారత్ కూడా ఎగుమతి చేయనుందని హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. అయితే ఇక నుంచి భారతదేశం చమురు కోసం రష్యా, సౌదీ అరేబియా వంటి దేశాలపై ఆధారపడే అవకాశం ఉండదు. చమురును సొంతంగా తయారు చేసుకోనుంది భారత్‌. అయితే ఆటోమొబైల్ రంగంలో ఇప్పటి వరకు రిఫరెన్స్ ఇంధనం ఉపయోగించబడింది. వాహనాల ఇంజన్, ఇతర సాంకేతిక విషయాలను పరీక్షించడంలో ఇది అవసరం. ఉద్గారాల నిబంధనలు, సంబంధిత ఇంధన లక్షణాలు ప్రపంచవ్యాప్తంగా గణనీయంగా మారుతూ ఉంటాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి