Maruti Suzuki: ఇన్నోవా కారును బీట్ చేసేలా ఎర్టిగా.. 7సీటర్ సదుపాయంతో అధిక మైలేజీ.. సూపర్ ఫీచర్స్
టోయోటా కంపెనీకి ఇన్నోవా అత్యంత ప్రజాదరణ పొందింది. కాస్త ఆర్థికంగా స్థితిమంతులు ఈ కారును కొనుగోలు చేస్తుంటారు. అదే సీటింగ్ సామర్థ్యంతో అతి తక్కువ ధరలోనే ఓ కారు మార్కెట్లో హాట్ కేక్ లా మారింది. అది మారుతి సుజుకి ఎర్టిగా. ఇది దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న 7 సీటర్ కారు. ఈ కారు అద్భుతమైన ఇంజిన్తో పాటు అధిక మైలేజీని అందిస్తుంది. కంపెనీ ఈ కారును సీఎన్జీ వేరియంట్‌లో కూడా అందిస్తోంది.
ప్రస్తుతం మార్కెట్లో ఎస్‌యూవీ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. కంఫర్ట్ గా ఉండటంతో పాటు అందులోని ప్రత్యేక ఫీచర్లు వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. అయితే వాటిల్లో చిన్న కార్లు అంటే డ్రైవర్ తో కలిపి నలుగురు మాత్రమే ప్రయాణించే కార్లను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఇది ఓ చిన్న కుటుంబానికి సరిపోతుంది. కానీ ఎవరైనా బంధువులతో కలిసి వెళ్లాలన్నా లేక, అతిథులను తీసుకెళ్లాలన్నా చిన్న కార్లు సరిపోవు. అప్పుడు సెవెన్ సీటర్ లేదా నైన్ సీటర్ అవసరం అవుతుంది. అయితే ఇంత పెద్ద కార్లు కొనాలంటే కాస్త ఖర్చు ఎక్కువ అవుతుంది. ఈ రేంజ్ లో టోయోటా కంపెనీకి ఇన్నోవా అత్యంత ప్రజాదరణ పొందింది. కాస్త ఆర్థికంగా స్థితిమంతులు ఈ కారును కొనుగోలు చేస్తుంటారు. అదే సీటింగ్ సామర్థ్యంతో అతి తక్కువ ధరలోనే ఓ కారు మార్కెట్లో హాట్ కేక్ లా మారింది. అది మారుతి సుజుకి ఎర్టిగా. ఇది దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న 7 సీటర్ కారు. ఈ కారు అద్భుతమైన ఇంజిన్తో పాటు అధిక మైలేజీని అందిస్తుంది. కంపెనీ ఈ కారును సీఎన్జీ వేరియంట్‌లో కూడా అందిస్తోంది. ఈ కారు గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
మారుతి సుజుకి ఎర్టిగా ఇంజిన్ సామర్థ్యం.. మారుతి సుజుకి ఎర్టిగా 7 సీటర్ కారులో 1.5 లీటర్ డ్యూయల్‌జెట్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీతో వస్తుంది. ఈ ఇంజన్ 103 బీహెచ్పీ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. గరిష్టంగా 136.8 ఎన్ఎమ్ టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. సీఎన్జీ వేరియంట్ చూసుకుంటే ఈ కారు 88 బీహెచ్ పీ శక్తిని, 121 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మీరు కారులో మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్ ను అందిస్తోంది. అదే సమయంలో టాటా నెక్సాన్ కారు ఇది 1.2 లీటర్ ఇంజిన్‌తో వస్తుంది.
ధర, లభ్యత.. ఎర్టిగా పెట్రోల్‌పై లీటర్‌కు 24 కిమీ, సీఎన్‌జీపై లీటర్కు 30 కిమీ మైలేజీని ఇస్తుంది. ధర కూడా అందుబాటులో ఉంటుంది. ఎర్టిగా బేస్ వేరియంట్ రూ. 8.64 లక్షల ఎక్స్-షోరూమ్ ధరకు అందుబాటులో ఉంది. అలాగే టాప్ వేరియంట్ రూ. 13.08 లక్షల ఎక్స్-షోరూమ్ ధర వద్ద అందుబాటులో ఉంది.
అద్భుతమైన ఫీచర్లు..
మారుతి సుజుకి ఎర్టిగా కారులో, మీరు 7-అంగుళాల స్మార్ట్‌ప్లే ప్రో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే సపోర్ట్, కనెక్ట్ చేయబడిన కార్ టెక్నాలజీ (టెలిమాటిక్స్), క్రూయిజ్ కంట్రోల్, ఆటో హెడ్‌ల్యాంప్‌లు, క్లైమేట్ కంట్రోల్ ఏసీ, ప్యాడిల్ షిఫ్టర్‌లు, 4 ఎయిర్‌బ్యాగ్‌లు, ఈబీడీతో కూడిన ఏబీఎస్. బ్రేక్ అసిస్ట్, వెనుక వైపు పార్కింగ్ సెన్సార్లు, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ ఎంకరేజ్, ఈఎస్పీతో హిల్ హోల్డ్ కంట్రోల్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఒక వేళ మీరు తక్కువ బడ్జెట్లో మంచి పనితీరుతో పాటు ఎక్కువ మంది ప్రయాణించేలా ఓ కారు కావాలంటే ఇది బెస్ట్ ఎంపిక. ఈ 7సీటర్ కారులో సీఎన్జీ ప్లస్ పెట్రోల్ వేరియంట్ అందుబాటులో ఉంది. ఇది ఎంతో ఉపకరిస్తుంది. అధిక మైలేజీని అందిస్తుంది. పైగా సీఎన్జీ పర్యావరణ హితంగా సాగుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..