AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GST: జీఎస్టీలో స్లాబ్‌లను తగ్గించే అవకాశం.. 4 నుంచి 3కు కుదింపుపై నిర్ణయం తీసుకోనున్న జీఓఎం..

జీఎస్టీ శ్లాబ్‌ల విలీనంతో పాటు ప్రస్తుత ధరల విధానంలో మార్పులకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దీనిపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని మంత్రుల బృందం జూన్ 17న సమావేశమై వస్తు, సేవల పన్ను రేటుకు సంబంధించిన హేతుబద్ధతను సమీక్షించి ఖరారు చేయనుంది...

GST: జీఎస్టీలో స్లాబ్‌లను తగ్గించే అవకాశం.. 4 నుంచి 3కు కుదింపుపై నిర్ణయం తీసుకోనున్న జీఓఎం..
Gst
Srinivas Chekkilla
|

Updated on: Jun 16, 2022 | 7:44 AM

Share

జీఎస్టీ శ్లాబ్‌ల విలీనంతో పాటు ప్రస్తుత ధరల విధానంలో మార్పులకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దీనిపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని మంత్రుల బృందం జూన్ 17న సమావేశమై వస్తు, సేవల పన్ను రేటుకు సంబంధించిన హేతుబద్ధతను సమీక్షించి ఖరారు చేయనుంది. జిఎస్‌టి శ్లాబ్‌ల విలీనంపై కూడా ప్రతిపాదన దృష్టి సారించనుంది. ద్రవ్యోల్బణం పెరుగుదల కారణంగా జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణ ఆలస్యం అయ్యే అవకాశం ఉందని గత నెల ప్రారంభంలోనే వార్తలు వచ్చాయి. GST విధానంలో వస్తువులు మరియు సేవలపై 5 శాతం, 12 శాతం, 18 శాతం మరియు 28 శాతం నాలుగు పన్ను స్లాబ్‌లలో పన్ను విధిస్తున్నారు. ఈ పన్ను శ్లాబులను 4 నుంచి 3కి తగ్గించే ఆలోచనలో ఉంది.

జీఎస్టీలో ప్రస్తుతం ఉన్న నాలుగు శ్లాబులను మూడుకు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ ప్రణాళిక ప్రకారం ప్రభుత్వం 12, 18 శాతం శ్లాబులను తొలగించడం ద్వారా 15 శాతం కొత్త స్లాబ్‌ను రూపొందించవచ్చు. దీంతో 5 శాతం ఉన్న శ్లాబ్‌ను 6 లేదా 7 శాతానికి పెంచే అవకాశం ఉంది.. అంతే కాకుండా 28 శాతం శ్లాబ్‌లో ఎలాంటి మార్పు చేసే యోచన లేదు. 6-7 శాతం, 15 శాతం, 28 శాతం స్లాబ్‌లు ఉండే అవకాశం ఉంది. ఏ సమయంలోనైనా 4 శ్లాబ్‌ల కంటే ఎక్కువ ఉండకూడదనే విధంగా జీఎస్టీని ప్లాన్ చేస్తున్నారు. మే నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.1.41 లక్షల కోట్లు. గత ఏడాదితో పోలిస్తే ఇది 44 శాతం వృద్ధిని నమోదు చేసింది. అయితే, నెల క్రితం వసూళ్ల రికార్డు కంటే మే నెల 16 శాతం తక్కువగా ఉంది. ఏప్రిల్‌లోనే జీఎస్‌టీ వసూళ్లు ఎన్నడూ లేని విధంగా రూ.1.68 లక్షల కోట్లకు చేరాయి.