AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price: పసిడి ప్రియులకు స్వల్ప ఊరట.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

బంగారం కొనుగోలు దారులకు నేడు పసిడి ధరలు స్వల్ప ఊరటను కలిగించాయి. గత కొన్ని రోజులుగా వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం వెండి ధరలు ప్రస్తుతం స్థిరంగా ఉన్నాయి. నిన్నటితో పోల్చుకుంటే ఇవాళ పెద్దగా మార్పులు ఏమి కనిపించలేదు. కాబట్టి ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల సహా దేశవ్యాప్తంగా ప్రధాన నగారల్లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

Gold Price: పసిడి ప్రియులకు స్వల్ప ఊరట.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
Today Gold Rate: బంగారం, వెండి ధరలు భారీగా పడిపోయాయి. ఇండియా బులియన్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) ప్రకారం, 24 క్యారెట్ల బంగారం ధర ఈ వారం రూ. 1860 తగ్గి 10 గ్రాములకు రూ.1,54,800 కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై 1700 రూపాయల వరకు తగ్గి రూ.1,41,900 వద్ద ట్రేడవుతోంది. అలాగే 18 క్యారెట్ల 10 గ్రాములపై 1390 రూపాయలు తగ్గి ప్రస్తుతం రూ.1,16,100 వద్ద కొనసాగుతోంది.
Anand T
|

Updated on: Aug 22, 2026 | 7:15 AM

Share

బంగారం కొనే వారకి గత కొద్ది రోజులుగా పసిడి ధరలు వరుస షాక్‌లు ఇస్తున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా గత వారం రోజుల్లోనే పసిడి ధరలు భారీ పెరిగి రికార్డ్‌ స్థాయికి చేరుకున్నాయి. కేవలం ఆగస్టు 15 నుండి ఆగస్టు 22 మధ్య దేశీయ మార్కెట్లలో 10 గ్రాముల బంగారంపై సుమారు రూ. 3,500 నుండి రూ. 4,500 వరకు పెరుగుదల నమోదైంది. అంతర్జాతీయ పరిణామాలు, డాలర్ విలువ మారకం కారణంగా బంగారం ధరల్లో ఈ భారీ మార్పులు చోటుచేసుకున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.

అయితే నిన్నటితో పోల్చుకుంటే శనివారం ఉదయం 6 గంటలకు దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పెద్దగా మార్పు ఏమిలేదు.. ప్రస్తుతం 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,60,490గా ఉండగా.. నిన్న ఈ ధర రూ. 1,60,480గా ఉంది. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,47,110 ఉండగా నిన్న ఈ ధర రూ1,47, 100గా ఉంది. ఇక 18 క్యారట్ల బంగార ధర రూ.1,20,370 వద్ద కొనసాగుతుంది. ఇక వెండి సైతం బంగారం బాటలోనే నడుస్తోంది. దేశీయ మార్కెట్‌లో నిన్న కేజీ వెండి ధర రూ.2,60,000గా ఉన్న వెండి ధర రూ.100 పెరిగి ప్రస్తుతం 2,60,100 ట్రేడవుతుంది.

ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు..

  • హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం10 గ్రాముల ధర రూ.1,60,490, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,47,110 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,65,100 ఉంది.
  • విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.1,60,490, 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.1,47,110 ఉంది. వెండి కిలో ధర రూ.2,60,100 ఉంది.
  • ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.1,60,640, 22 క్యారెట్ల ధర రూ.1,44,260 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,60,100 ఉంది.
  • ముంబైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,60,490, 22 క్యారెట్ల ధర రూ.1,47,110 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,60,100 లుగా ఉంది.
  • చెన్నైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,60,490, 22 క్యారెట్ల ధర రూ.1,47,110 ఉంది. వెండి కిలో ధర రూ.2,65,100 ఉంది.
  • బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,60,490, 22 క్యారెట్ల ధర రూ.1,47,110 ఉంది. వెండి కిలో ధర రూ.2,60,100 లుగా ఉంది.

అయితే బంగారం, వెండి ధరలు అన్ని ప్రాంతాల్లో ఎప్పుడూ ఒకే విధంగా ఉండవు.. స్థానిక డిమాండ్, సరఫరా, అలాగే రాష్ట్ర పన్నులు, తదితర అంశాల ప్రకారం ఎప్పటికప్పుడు మారుతుంటాయి.. కాబట్టి మీరు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలుసుకోవాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఇంట్లో డబ్బు నిలవడం లేదా? ఈ వాస్తు మార్పులు చేయండి!
ఇంట్లో డబ్బు నిలవడం లేదా? ఈ వాస్తు మార్పులు చేయండి!
విద్యార్థులకు భలే ఛాన్స్.. జాతీయ స్థాయిలో పెయింటింగ్‌ పోటీలు 2026
విద్యార్థులకు భలే ఛాన్స్.. జాతీయ స్థాయిలో పెయింటింగ్‌ పోటీలు 2026
అనంతగిరి లోయలోకి దూసుకెళ్లి బోల్తా!
అనంతగిరి లోయలోకి దూసుకెళ్లి బోల్తా!
పాక్‌పై అభిషేక్ శర్మ కొత్త చరిత్ర.. కోహ్లీ రికార్డ్ బ్రేక్..
పాక్‌పై అభిషేక్ శర్మ కొత్త చరిత్ర.. కోహ్లీ రికార్డ్ బ్రేక్..
హైదరాబాద్‌లో తగ్గిన బంగారం ధరలు.. పండుగల వేళ కొనుగోలుదారులకు ఊరట!
హైదరాబాద్‌లో తగ్గిన బంగారం ధరలు.. పండుగల వేళ కొనుగోలుదారులకు ఊరట!
అయూబ్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన అభిషేక్.. వైభవ్ పగ తీర్చేశాడుగా
అయూబ్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన అభిషేక్.. వైభవ్ పగ తీర్చేశాడుగా
పుట్టింటికి బయలుదేరిన తల్లీపిల్లలు.. బావిలో విగతజీవులుగా..!
పుట్టింటికి బయలుదేరిన తల్లీపిల్లలు.. బావిలో విగతజీవులుగా..!
దేవుడి లాకెట్ మెడలో ధరిస్తున్నారా? ఈ విషయం తప్పక తెలుసుకోండి!
దేవుడి లాకెట్ మెడలో ధరిస్తున్నారా? ఈ విషయం తప్పక తెలుసుకోండి!
GATE 2027 దరఖాస్తు డెడ్‌లైన్ దగ్గర్లోనే.. అక్టోబర్‌ 5 వరకే ఛాన్స్
GATE 2027 దరఖాస్తు డెడ్‌లైన్ దగ్గర్లోనే.. అక్టోబర్‌ 5 వరకే ఛాన్స్
సెలవు రోజు సరదాగా వెళ్లి.. కెరటాల్లో ముగ్గురు పిల్లలు గల్లంతు!
సెలవు రోజు సరదాగా వెళ్లి.. కెరటాల్లో ముగ్గురు పిల్లలు గల్లంతు!