AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దసరా ధమాకా! హైదరాబాద్‌లో తగ్గిన బంగారం ధరలు.. పండుగల వేళ కొనుగోలుదారులకు పెద్ద ఊరట!!

పసిడి ప్రియులకు తీపి కబురు! గత కొన్ని రోజులుగా నిలకడగా ఉన్న బంగారం ధరలు దేశీయ మార్కెట్లో తగ్గుముఖం పట్టాయి. పండుగల సీజన్ మొదలవుతున్న వేళ బంగారం ధరలు తగ్గడం వినియోగదారులకు పెద్ద ఊరటనిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌‌లోని పరిస్థితులు, డాలర్ మారకం విలువలో మార్పుల కారణంగా భారతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు తగ్గాయి.

దసరా ధమాకా! హైదరాబాద్‌లో తగ్గిన బంగారం ధరలు.. పండుగల వేళ కొనుగోలుదారులకు పెద్ద ఊరట!!
Gold Price Today
Jyothi Gadda
|

Updated on: Oct 03, 2026 | 11:55 AM

Share

భాగ్యనగరంలో పసిడి ప్రియులకు మంచి వార్త! గత కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులకు గురవుతున్న బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. పండుగల సీజన్ ప్రారంభమవుతున్న వేళ బంగారం రేట్లు దిగిరావడం హైదరాబాద్‌లోని కొనుగోలుదారుల్లో, నిత్యం ఆభరణాలు కొనుగోలు చేసే మహిళల్లో ఆనందాన్ని నింపుతోంది. స్వచ్ఛత ఆధారంగా బంగారం ధరల వివరాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

అత్యంత స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధరలో తగ్గుదల నమోదైంది. ప్రధానంగా బిస్కట్లు, నాణేల రూపంలో పెట్టుబడి పెట్టేవారికి ఇది లాభదాయకంగా ఉంటుంది. మహిళలు ఎక్కువగా కొనుగోలు చేసే 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర కూడా తగ్గడంతో పసిడి కొనుగోలుదారుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. ఇటీవల ట్రెండ్‌గా మారిన తక్కువ బరువుగల ఆభరణాల కోసం వాడే 18 క్యారెట్ల బంగారం రేటు కూడా తగ్గింది.

తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు తగ్గాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్ వంటి నగరాల్లో 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం రేట్లలో తగ్గుదల కనిపించింది.. అలాగే ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు నగరాల్లో కూడా పసిడి ధరలు దిగివచ్చాయి.

ఇవి కూడా చదవండి

– చెన్నైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,49,180 లు ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,36,750 గా ఉంది.

– ముంబైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,49,180, 22 క్యారెట్ల ధర రూ.1,36,750 గా ఉంది.

– ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,49,330 క్యారెట్ల ధర రూ.1,36,900 గా ఉంది.

– కోల్‌కతాలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,49,180, 22 క్యారెట్ల ధర రూ.1,36,750 గా ఉంది.

– బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,49,180, 22 క్యారెట్ల ధర రూ.1,36,750 గా ఉంది.

– హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,49,180, 22 క్యారెట్ల ధర రూ.1,36,750 గా ఉంది.

– విజయవాడలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,49,180, 22 క్యారెట్ల ధర రూ.1,36,750 గా ఉంది.

– విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,49,180, 22 క్యారెట్ల ధర రూ.1,36,750 గా ఉంది.

గ్లోబల్ మార్కెట్‌లో గోల్డ్ రేట్లు హెచ్చుతగ్గులకు గురికావడం వల్ల దేశీయ మార్కెట్‌పై ప్రభావం పడింది. అంతర్జాతీయంగా డాలర్ విలువ స్థిరంగా ఉండటం, బాండ్ ఈల్డ్స్ ప్రభావం వల్ల బంగారంపై పెట్టుబడులు స్వల్పంగా తగ్గాయి. ఇండియన్ రూపాయి మారకపు విలువలో వచ్చిన మార్పులు కూడా బంగారం దిగుమతి వ్యయాన్ని ప్రభావితం చేశాయి. పండుగల సమయం దగ్గర పడుతుండటంతో, బంగారం లేదా బంగారు ఆభరణాలు కొనుగోలు చేయాలనుకునే వారు స్థానిక జ్యువెలరీ షాపుల్లో తాజా ధరలను సరిచూసుకుని కొనుగోలు చేయడం శ్రేయస్కరం.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఇంట్లో డబ్బు నిలవడం లేదా? ఈ వాస్తు మార్పులు చేయండి!
ఇంట్లో డబ్బు నిలవడం లేదా? ఈ వాస్తు మార్పులు చేయండి!
విద్యార్థులకు భలే ఛాన్స్.. జాతీయ స్థాయిలో పెయింటింగ్‌ పోటీలు 2026
విద్యార్థులకు భలే ఛాన్స్.. జాతీయ స్థాయిలో పెయింటింగ్‌ పోటీలు 2026
అనంతగిరి లోయలోకి దూసుకెళ్లి బోల్తా!
అనంతగిరి లోయలోకి దూసుకెళ్లి బోల్తా!
పాక్‌పై అభిషేక్ శర్మ కొత్త చరిత్ర.. కోహ్లీ రికార్డ్ బ్రేక్..
పాక్‌పై అభిషేక్ శర్మ కొత్త చరిత్ర.. కోహ్లీ రికార్డ్ బ్రేక్..
హైదరాబాద్‌లో తగ్గిన బంగారం ధరలు.. పండుగల వేళ కొనుగోలుదారులకు ఊరట!
హైదరాబాద్‌లో తగ్గిన బంగారం ధరలు.. పండుగల వేళ కొనుగోలుదారులకు ఊరట!
అయూబ్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన అభిషేక్.. వైభవ్ పగ తీర్చేశాడుగా
అయూబ్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన అభిషేక్.. వైభవ్ పగ తీర్చేశాడుగా
పుట్టింటికి బయలుదేరిన తల్లీపిల్లలు.. బావిలో విగతజీవులుగా..!
పుట్టింటికి బయలుదేరిన తల్లీపిల్లలు.. బావిలో విగతజీవులుగా..!
దేవుడి లాకెట్ మెడలో ధరిస్తున్నారా? ఈ విషయం తప్పక తెలుసుకోండి!
దేవుడి లాకెట్ మెడలో ధరిస్తున్నారా? ఈ విషయం తప్పక తెలుసుకోండి!
GATE 2027 దరఖాస్తు డెడ్‌లైన్ దగ్గర్లోనే.. అక్టోబర్‌ 5 వరకే ఛాన్స్
GATE 2027 దరఖాస్తు డెడ్‌లైన్ దగ్గర్లోనే.. అక్టోబర్‌ 5 వరకే ఛాన్స్
సెలవు రోజు సరదాగా వెళ్లి.. కెరటాల్లో ముగ్గురు పిల్లలు గల్లంతు!
సెలవు రోజు సరదాగా వెళ్లి.. కెరటాల్లో ముగ్గురు పిల్లలు గల్లంతు!