AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంట్లో నుంచి పుట్టింటికి వెళ్తానని చెప్పి.. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి కఠిన నిర్ణయం!

వికారాబాద్ జిల్లా పూడూరు మండలం సోమన్‌గుర్తి సమీపంలో మమత అనే మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి బావిలో దూకి విషాదాంతమయ్యారు. ఈ ఘటనలో తల్లి మమత, కుమార్తె జనశ్రీ మృతి చెందగా, కుమారుడు సాకేత్ మృతదేహం కోసం గాలింపు చేపట్టి వెలికితీశారు. కుటుంబ కలహాల కారణంగానే ఈ దారుణం జరిగి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తూ, దర్యాప్తు ప్రారంభించారు.

ఇంట్లో నుంచి పుట్టింటికి వెళ్తానని చెప్పి.. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి కఠిన నిర్ణయం!
Vikarabad Tragedy
Balaraju Goud
|

Updated on: Oct 03, 2026 | 11:15 AM

Share

వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. సోమన్‌గుర్తి గ్రామ సమీపంలో మాటుగూడెం గ్రామానికి చెందిన మమత (26) తన ఇద్దరు పిల్లలతో కలిసి బావిలో దూకిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో తల్లి మమతతో పాటు నాలుగేళ్ల కుమార్తె జనశ్రీ మృతి చెందగా.. ఎనిమిదేళ్ల కుమారుడు సాకేత్ మృతదేహం కోసం గాలింపు చేపట్టారు.

సమాచారం అందుకున్న పోలీసులు, స్థానిక గజ ఈతగాళ్లు బావిలో గాలింపు చర్యలు చేపట్టారు. తొలుత మమత, జనశ్రీ మృతదేహాలు లభ్యమయ్యాయి. అనంతరం సాకేత్ కోసం ముమ్మరంగా గాలింపు కొనసాగించారు. ఎట్టకేలకు గజ ఈతగాళ్లు సాకేత్ మృతదేహాన్ని కూడా వెలికితీశారు.

మాటుగూడెం గ్రామానికి చెందిన మమత.. తన పుట్టింటి గ్రామమైన నారాయణపూర్‌కు వెళ్తున్నట్లు చెప్పి ఇంటి నుంచి బయలుదేరినట్లు పోలీసులు తెలిపారు. అయితే సోమన్‌గుర్తి గ్రామ సమీపంలో పిల్లలతో కలిసి బావిలో దూకినట్లు వెల్లడించారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ ఘటన జరిగి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే పూర్తి కారణాలు దర్యాప్తులో తేలాల్సి ఉంది.

కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతామని పరిగి సీఐ కొండల్‌రెడ్డి తెలిపారు. మమత, జనశ్రీ, సాకేత్ మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
పుట్టింటికి బయలుదేరిన తల్లీపిల్లలు.. బావిలో విగతజీవులుగా..!
పుట్టింటికి బయలుదేరిన తల్లీపిల్లలు.. బావిలో విగతజీవులుగా..!
దేవుడి లాకెట్ మెడలో ధరిస్తున్నారా? ఈ విషయం తప్పక తెలుసుకోండి!
దేవుడి లాకెట్ మెడలో ధరిస్తున్నారా? ఈ విషయం తప్పక తెలుసుకోండి!
GATE 2027 దరఖాస్తు డెడ్‌లైన్ దగ్గర్లోనే.. అక్టోబర్‌ 5 వరకే ఛాన్స్
GATE 2027 దరఖాస్తు డెడ్‌లైన్ దగ్గర్లోనే.. అక్టోబర్‌ 5 వరకే ఛాన్స్
సెలవు రోజు సరదాగా వెళ్లి.. కెరటాల్లో ముగ్గురు పిల్లలు గల్లంతు!
సెలవు రోజు సరదాగా వెళ్లి.. కెరటాల్లో ముగ్గురు పిల్లలు గల్లంతు!
Video: వైభవ్ ఔట్‌పై పాక్ ప్లేయర్ ఓవర్ యాక్షన్..
Video: వైభవ్ ఔట్‌పై పాక్ ప్లేయర్ ఓవర్ యాక్షన్..
బర్త్ డే రోజున హీరోయిన్‌కి షాక్ ఇచ్చిన అభిమాని..
బర్త్ డే రోజున హీరోయిన్‌కి షాక్ ఇచ్చిన అభిమాని..
సుప్రీంకోర్టులో 250 ఉద్యోగాలు.. అక్టోబర్‌ 28లోగా అప్లై చేసుకోండి
సుప్రీంకోర్టులో 250 ఉద్యోగాలు.. అక్టోబర్‌ 28లోగా అప్లై చేసుకోండి
పచ్చి అరటికాయ ఎంత పర్‌ఫుల్లో తెలుసా? తప్పక తెలుసుకోవాల్సిన లాభాలు
పచ్చి అరటికాయ ఎంత పర్‌ఫుల్లో తెలుసా? తప్పక తెలుసుకోవాల్సిన లాభాలు
మత మార్పిడి బెదిరింపులు.. MBBS విద్యార్థి అరెస్ట్!
మత మార్పిడి బెదిరింపులు.. MBBS విద్యార్థి అరెస్ట్!
శ్రీసిటీలో భారీ పేలుడు.. నలుగురు కార్మికులు మృతి.. !
శ్రీసిటీలో భారీ పేలుడు.. నలుగురు కార్మికులు మృతి.. !