AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: బతుకమ్మ పూల చెత్తతో సిరుల పంట.. వరంగల్ బల్దియా అదిరిపోయే ప్లాన్.. వీడియో చూడండి..

పారేస్తే చెత్త... ఒడిసిపడితే కోట్లాది రూపాయల సంపద.. బతుకమ్మ సంబరాలు ముగిశాయి సరే, మరి ఆ టన్నుల కొద్దీ పూల వ్యర్థాలు ఏమయ్యాయో తెలుసా? అక్కడే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అదిరిపోయే ప్లాన్ వేసింది. పండుగ వేళ వాడిన 60 టన్నుల పూలను సేకరించి.. భూమికి బలాన్నిచ్చే మేలైన బయో కంపోస్ట్ ఎరువుగా మారుస్తూ సరికొత్త రికార్డు సృష్టిస్తోంది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Telangana: బతుకమ్మ పూల చెత్తతో సిరుల పంట.. వరంగల్ బల్దియా అదిరిపోయే ప్లాన్.. వీడియో చూడండి..
Bathukamma Flower Waste To Bio Compost
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: Oct 22, 2026 | 3:10 PM

Share

వృథాగా పారేస్తే అది పర్యావరణానికి చేటు తెచ్చే చెత్త.. అదే కాస్త ఆలోచించి సద్వినియోగం చేసుకుంటే అద్భుతమైన సంపద.. తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ సంబరాలు ముగిశాయి. అయితే పండుగ వేళ వాడిన టన్నుల కొద్దీ పూల వ్యర్థాలను కాస్త అధికారులు రికొత్త రీతిలో సంపదగా మారుస్తున్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్‌మెంట్ సిబ్బంది పూల వ్యర్థాలతో నాణ్యమైన సేంద్రియ ఎరువును తయారు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. వరంగల్, హనుమకొండ, కాజీపేట ట్రైసిటీస్ పరిధిలో తొమ్మిది రోజుల పాటు జరిగిన బతుకమ్మ ఉత్సవాల్లో బంతి, చామంతి, గునుగు, తంగేడు, సీతజడ, గుమ్మడి, గులాబీ తదితర రకాల పూలు దాదాపు 60 టన్నుల మేర వినియోగించినట్లు అధికారులు గుర్తించారు. ఎనిమిది రోజుల పాటు మైదానాల్లో ఆడి పడేసిన పువ్వులతో పాటు, సద్దుల బతుకమ్మ నాడు చెరువులు, కుంటల్లో నిమజ్జనం చేసిన పూలను శానిటేషన్ సిబ్బంది ఎప్పటికప్పుడు సేకరించారు. ఇప్పటివరకు దాదాపు 40 టన్నుల పూల వ్యర్థాలను ఒడ్డుకు చేర్చి ప్రాసెసింగ్ కేంద్రాలకు తరలించారు. బతుకమ్మ పూలతో పాటు నగరంలోని ఆలయాలు, పూల మార్కెట్ల నుంచి వచ్చే వ్యర్థాలను కూడా వీటికి జత చేస్తున్నారు.

మూడు దశల్లో సేంద్రియ ఎరువు తయారీ

సేకరించిన పూల వ్యర్థాలను వరంగల్ నగరంలోని 6 ప్రత్యేక కేంద్రాల్లో ప్రాసెస్ చేస్తున్నారు.

వ్యర్థాల వేరుచేత: మొదటగా పూలలో కలిసిపోయిన ప్లాస్టిక్ కవర్లు, దారాలు, రిబ్బన్లు, ఇతర వ్యర్థాలను వేరు చేస్తున్నారు.

కంపోస్టింగ్ ప్రక్రియ: పూర్తిగా శుద్ధి చేసిన పూలను గుంతలు, తొట్టెల్లో నింపి శాస్త్రీయ పద్ధతిలో బయో కంపోస్ట్‌గా మారుస్తున్నారు.

ఎరువుగా మార్పు: నిర్దిష్ట గడువులో సేంద్రియ పోషకాలు సమృద్ధిగా ఉండే పచ్చి ఎరువు సిద్ధమవుతోంది.

మొక్కల పెంపకానికి.. రైతులకు వరం

ఈ విధంగా తయారైన బయో కంపోస్ట్‌ను గ్రేటర్ వరంగల్ పరిధిలోని అర్బన్ ప్లాంటేషన్, పార్కులు, డివైడర్లపై ఉన్న మొక్కలకు ఎరువుగా వాడుతున్నారు. రసాయన రహిత సాగు వైపు మొగ్గు చూపే రైతులకు, నగర పౌరులకు కూడా నామమాత్రపు ధరకే లేదా ఉచితంగా ఈ ఎరువును సరఫరా చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. పుడమి నుంచి పుట్టిన పువ్వులను పూజలకే కాకుండా.. మళ్లీ భూమాతకు బలాన్నిచ్చే సేంద్రియ ఎరువుగా మార్చడం పట్ల వరంగల్ ప్రజలు, పర్యావరణ వేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వ్యర్థాల నిర్వహణలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ యంత్రాంగం చూపిన చొరవ ఇతర నగరాలకు ఆదర్శంగా నిలుస్తోంది.

వీడియో చూడండి..

Follow Us
బతుకమ్మ పూల చెత్తతో సిరుల పంట.. వరంగల్ బల్దియా అదిరిపోయే ప్లాన్..
బతుకమ్మ పూల చెత్తతో సిరుల పంట.. వరంగల్ బల్దియా అదిరిపోయే ప్లాన్..
క్రికెట్‌లో ఫుట్‌బాల్ స్కిల్స్.. స్టంప్స్‌ను ఎలా పడేశాడో చూడండి..
క్రికెట్‌లో ఫుట్‌బాల్ స్కిల్స్.. స్టంప్స్‌ను ఎలా పడేశాడో చూడండి..
చింతపండు, టమాటా లేకుండానే చేపల కూర.. ఇలా చేస్తే రుచికి తిరుగుండదు
చింతపండు, టమాటా లేకుండానే చేపల కూర.. ఇలా చేస్తే రుచికి తిరుగుండదు
యాసపై ట్రోలింగ్.. ఇచ్చిపడేసిన రష్మిక..
యాసపై ట్రోలింగ్.. ఇచ్చిపడేసిన రష్మిక..
'2028లోపు పోలీసుశాఖలో ఖాళీలన్నీ భర్తీ చేస్తాం'.. CM రేవంత్‌
'2028లోపు పోలీసుశాఖలో ఖాళీలన్నీ భర్తీ చేస్తాం'.. CM రేవంత్‌
భారతదేశంలో చూడాల్సిన 8 అద్భుతమైన పూల మార్కెట్లు..
భారతదేశంలో చూడాల్సిన 8 అద్భుతమైన పూల మార్కెట్లు..
తొలి టీ20లో భారత్‌కు బిగ్ టార్గెట్.. గెలిస్తే చరిత్రే
తొలి టీ20లో భారత్‌కు బిగ్ టార్గెట్.. గెలిస్తే చరిత్రే
తెలంగాణలో 264 అంగన్‌వాడీ ఉద్యోగాలు.. అప్లై చేసేందుకు మరో 2 రోజులే
తెలంగాణలో 264 అంగన్‌వాడీ ఉద్యోగాలు.. అప్లై చేసేందుకు మరో 2 రోజులే
రూ. 10 లక్షల కారులో వచ్చి.. రూ. 10 వేల మేకను ఎకెసుకెళ్లిన దొంగలు
రూ. 10 లక్షల కారులో వచ్చి.. రూ. 10 వేల మేకను ఎకెసుకెళ్లిన దొంగలు
ట్యూబ్‌లెస్ టైర్‌లో గాలి తగ్గుతోందా? ఈ 6 జాగ్రత్తలు పాటిస్తే..
ట్యూబ్‌లెస్ టైర్‌లో గాలి తగ్గుతోందా? ఈ 6 జాగ్రత్తలు పాటిస్తే..