AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రీచార్జ్ చేసేటప్పుడు ఇక ఆ కష్టం ఉండదు.. టెలికాం కంపెనీలకు ట్రాయ్ కీలక ఆదేశాలు

రీచార్జ్‌ ప్లాన్ల కోసం వెబ్‌సైట్లు, మొబైల్‌ యాప్‌లలో వెతకాల్సిన అవసరం లేకుండా టెలికాం కంపెనీలకు ట్రాయ్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ప్రీపెయిడ్‌ రీచార్జ్‌ విభాగంలో ‘ట్రాయ్ నిర్దేశించిన ప్లాన్లు’ పేరుతో ప్రత్యేక సెక్షన్‌ ఏర్పాటు చేసి, దాన్ని మొదటి ఎంపికగా చూపించాలి. ప్రత్యేక విక్రయ కేంద్రాల్లోనూ ఈ ప్లాన్ల వివరాలను ప్రముఖంగా ప్రదర్శించాలి. ఇప్పటికే అందుబాటులో ఉన్న ప్లాన్లను సులభంగా గుర్తించేలా చేయడమే ఈ ఆదేశాల ఉద్దేశం.

రీచార్జ్ చేసేటప్పుడు ఇక ఆ కష్టం ఉండదు.. టెలికాం కంపెనీలకు ట్రాయ్ కీలక ఆదేశాలు
Telecom Recharge Plans
Ram Naramaneni
|

Updated on: Oct 03, 2026 | 8:54 AM

Share

మొబైల్‌ రీచార్జ్‌ చేసేటప్పుడు తమకు కావాల్సిన ప్లాన్‌ కోసం యాప్‌లో, వెబ్‌సైట్‌లో వెతికి వెతికి విసిగిపోయే వినియోగదారులకు ఇది గుడ్‌న్యూస్‌. తక్కువ ధరలో ఉండే రీచార్జ్‌ ప్లాన్లు సులభంగా కనిపించేలా టెలికాం కంపెనీలకు ట్రాయ్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ప్రీపెయిడ్‌ రీచార్జ్‌ విభాగంలో ‘ట్రాయ్ నిర్దేశించిన ప్లాన్లు’ పేరుతో ప్రత్యేక సెక్షన్‌ ఏర్పాటు చేయాలి. అంతేకాదు.. ఆ సెక్షన్‌నే మొదటి ఎంపికగా కనిపించేలా చేయాలి.

మొదట కనిపించాల్సిందే..

టెలికాం కంపెనీల వెబ్‌సైట్లు, మొబైల్‌ యాప్‌లలో ప్రీపెయిడ్‌ రీచార్జ్‌ విభాగాన్ని ఓపెన్‌ చేసిన వెంటనే ‘ట్రాయ్ నిర్దేశించిన ప్లాన్లు’ కనిపించేలా చేయాలని ట్రాయ్ స్పష్టం చేసింది. వాటిని ఏదో ఒక విభాగంలో దాచి పెట్టడం లేదా పలు పేజీలు దాటిన తర్వాత కనిపించేలా చేయడం కుదరదు. అలాగే టెలికాం కంపెనీల ప్రత్యేక విక్రయ కేంద్రాల్లోనూ ఈ ప్లాన్ల వివరాలను ప్రముఖంగా ప్రదర్శించాల్సి ఉంటుంది.

వినియోగదారుల ఫిర్యాదులతో..

తమకు అవసరమైన రీచార్జ్‌ ప్లాన్లను వెబ్‌సైట్లు, యాప్‌లలో సులభంగా గుర్తించలేకపోతున్నామని పలువురు వినియోగదారులు ట్రాయ్‌కు ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా తక్కువ ధరలో ఉండే ప్లాన్ల కోసం అనేక పేజీలు, విభాగాలు వెతకాల్సి వస్తోందని తెలిపారు. ఈ ఫిర్యాదులపై ట్రాయ్‌ కూడా టెలికాం కంపెనీల వెబ్‌సైట్లు, యాప్‌లను పరిశీలించింది. కొన్ని చోట్ల వినియోగదారులు కావాల్సిన ప్లాన్‌ చేరుకోవడానికి రెండు, మూడు కంటే ఎక్కువ దశలు దాటాల్సి వస్తున్నట్లు గుర్తించింది. దీంతో వినియోగదారులకు అవసరమైన ప్లాన్లు సులభంగా కనిపించేలా ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని ఆదేశించింది.

ఈ ప్లాన్లు ఏంటి?

ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఉంది. ట్రాయ్‌ ఇప్పుడు కొత్తగా ఎలాంటి రీచార్జ్‌ ప్లాన్లను తీసుకురావడం లేదు. ఇప్పటికే నిబంధనల ప్రకారం టెలికాం కంపెనీలు అందించాల్సిన ప్లాన్లను ఒకే చోట సులభంగా కనిపించేలా చేయడమే తాజా ఆదేశాల ఉద్దేశం. టెలికాం కంపెనీలు కనీసం ఒక సాధారణ ప్లాన్‌, ఒక ప్రత్యేక టారిఫ్‌ ప్లాన్‌, ఒక కాంబో ప్లాన్‌ను అందించాల్సి ఉంటుంది. వీటికి 30 రోజుల చెల్లుబాటు ఉండాలి. ప్రతి నెలా ఒకే తేదీన రీచార్జ్‌ చేసుకునే అవకాశం కూడా ఉండాలి.

డేటా అవసరం లేనివారికి ఉపయోగం

ప్రతి ఒక్కరికీ ఎక్కువ మొబైల్‌ డేటా అవసరం ఉండదు. కొందరు కేవలం ఫోన్‌ కాల్స్‌, ఎస్‌ఎంఎస్‌ల కోసం మాత్రమే మొబైల్‌ ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా ఫీచర్‌ ఫోన్లు వాడేవారికి ఇలాంటి ప్లాన్లు ఉపయోగకరంగా ఉంటాయి. వాయిస్‌ కాల్స్‌, ఎస్‌ఎంఎస్‌లకు మాత్రమే రీచార్జ్‌ చేసుకునే అవకాశం ఉండటంతో అవసరం లేని డేటా కోసం అదనంగా డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు.

కొత్త ధరలు రావు

ట్రాయ్‌ తాజా ఆదేశాల వల్ల రీచార్జ్‌ ధరలు తగ్గుతాయని లేదా పెరుగుతాయని అనుకోవాల్సిన అవసరం లేదు. అలాగే కొత్త ప్లాన్లు కూడా రావు. ఇప్పటికే ఉన్న ప్లాన్లు వినియోగదారులకు సులభంగా కనిపించేలా చేయడమే ఈ ఆదేశాల ప్రధాన ఉద్దేశం.

30 రోజుల్లో మార్పులు చేయాలి

టెలికాం కంపెనీలు తమ వెబ్‌సైట్లు, మొబైల్‌ యాప్‌లు, ప్రత్యేక విక్రయ కేంద్రాల్లో అవసరమైన మార్పులు చేయడానికి ట్రాయ్‌ 30 రోజుల గడువు ఇచ్చింది. ఈ మార్పులు పూర్తయిన తర్వాత ప్రీపెయిడ్‌ రీచార్జ్‌ విభాగంలోకి వెళ్లగానే ట్రాయ్‌ నిర్దేశించిన ప్లాన్లకు సంబంధించిన ప్రత్యేక సెక్షన్‌ ముందుగానే కనిపించనుంది. దీంతో తక్కువ ధరలో తమకు అవసరమైన ప్లాన్‌ కోసం వినియోగదారులు ఎక్కువగా వెతకాల్సిన అవసరం ఉండదు.

Follow Us
రీచార్జ్ ప్లాన్ల కోసం ఇక వెతకాల్సిన పనిలేదు.. ట్రాయ్ కొత్త రూల్!
రీచార్జ్ ప్లాన్ల కోసం ఇక వెతకాల్సిన పనిలేదు.. ట్రాయ్ కొత్త రూల్!
భారత్-పాకిస్థాన్ ఫైనల్‌కు దూరంగా మొహ్సిన్ నఖ్వీ.. కారణం ఇదే.!
భారత్-పాకిస్థాన్ ఫైనల్‌కు దూరంగా మొహ్సిన్ నఖ్వీ.. కారణం ఇదే.!
గాజులా మెరిసే చర్మం కావాలా?రోజూ తాగాల్సిన పవర్‌ఫుల్ డ్రింక్స్ ఇవే
గాజులా మెరిసే చర్మం కావాలా?రోజూ తాగాల్సిన పవర్‌ఫుల్ డ్రింక్స్ ఇవే
ఆకాశాన్ని తాకే బ్రిడ్జ్‌పై వందే భారత్ పరుగులు..!
ఆకాశాన్ని తాకే బ్రిడ్జ్‌పై వందే భారత్ పరుగులు..!
అష్టమి శ్రాద్ధం: పితృదేవతల అనుగ్రహం కోసం ఈ పనులు చేయండి..
అష్టమి శ్రాద్ధం: పితృదేవతల అనుగ్రహం కోసం ఈ పనులు చేయండి..
వేగంగా బరువు తగ్గాలా?తక్కువ క్యాలరీలు ఉండే అద్భుతమైన ఆహారాలు ఇవే!
వేగంగా బరువు తగ్గాలా?తక్కువ క్యాలరీలు ఉండే అద్భుతమైన ఆహారాలు ఇవే!
పన్నా గనిలో తవ్వుతుండగా దంపతులకు జాక్‌పాట్..!
పన్నా గనిలో తవ్వుతుండగా దంపతులకు జాక్‌పాట్..!
చిన్న రూమ్ నుంచి హోమ్ థియేటర్ వరకు 4 కొత్త మోడళ్లు!
చిన్న రూమ్ నుంచి హోమ్ థియేటర్ వరకు 4 కొత్త మోడళ్లు!
చివరి వరకు ఉత్కంఠ.. ఆర్చరీలో గోల్డ్ పట్టేసిన కుమ్‌కుమ్‌
చివరి వరకు ఉత్కంఠ.. ఆర్చరీలో గోల్డ్ పట్టేసిన కుమ్‌కుమ్‌
కెప్టెన్సీ మారింది.. ఓటింగ్‌లో దూసుకెళ్తున్న త్రిగుణ్
కెప్టెన్సీ మారింది.. ఓటింగ్‌లో దూసుకెళ్తున్న త్రిగుణ్