Silver Prices: అప్పుడు రూ. లక్షతో.. ఇప్పుడు ఏకంగా రూ. 3.77 లక్షలు.! ద.. ద.. దరువేస్తున్న వెండి కొండ

ఇంటర్నేషనల్‌ మార్కెట్‌లో వెండి రేట్లు...డైలీ సీరియల్‌లా పెరుగుతున్నాయి. ఆ ప్రభావంతో లోకల్‌గా కూడా వినియోగదారులకు భారీ షాక్‌ ఇస్తున్నాయి. మరి బంగారం, సిల్వర్‌లో ఇన్వెస్ట్ మెంట్ ఇప్పుడు చేయొచ్చా.. ఆ వివరాలు ఏంటి.? ఓ సారి చెక్ చేయండి ఇది. ఆ వివరాలు ఇలా..

Silver Prices: అప్పుడు రూ. లక్షతో.. ఇప్పుడు ఏకంగా రూ. 3.77 లక్షలు.!  ద.. ద.. దరువేస్తున్న వెండి కొండ
Silver

Updated on: Jan 24, 2026 | 9:52 AM

వెండి రేట్లు కొండలా పెరుగుతున్నాయి. ఎంతకీ తగ్గనంటున్నాయి. డైలీ ఓ రికార్డ్‌ సృష్టిస్తున్నాయి. హైదరాబాద్‌ మార్కెట్‌లో ఒక్క రోజులోనే 20 వేల రూపాయలు పెరిగి, మూడు లక్షల 60 వేల రూపాయలను టచ్‌ చేసిన కిలో వెండి.. కొత్త రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. ఇక ఇంటర్నేషనల్‌ మార్కెట్‌లో ఔన్స్ వెండి రేటు రికార్డు స్థాయిలో పెరిగి 99.39 డాలర్ల మార్క్‌ను టచ్‌ చేసింది. వరుసగా రెండో రోజు కూడా సిల్వర్‌ రేట్లు పెరిగాయి. త్వరలోనే ఇది 100 డాలర్ల మార్కును కూడా దాటేస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇది చదవండి: ‘అలా అనుకుంటే ఎన్టీఆర్‌ను అడ్డంపెట్టుకుని కొన్ని కోట్లు సంపాదించేవాడిని..’

2025 జనవరిలో కేవలం 31 డాలర్లు ఉన్న ఔన్స్‌ వెండి రేటు…ఇప్పుడు ఏకంగా మూడు రెట్ల కన్నా ఎక్కువగా పెరిగింది. గత ఏడాది కాలంలో చూస్తే వెండి 215 శాతం కన్నా ఎక్కువ లాభాలను ఇచ్చింది. ఒక్క 2025లోనే వెండి రేటు సుమారు 147 శాతం పెరిగింది. అందుకే ఆ ఏడాదిలో అత్యంత లాభదాయకమైన మెటల్‌గా వెండి నిలిచింది. ఇక అంతర్జాతీయంగా ప్రస్తుతం నెలకొన్నపరిస్థితుల్లో, సిల్వర్‌ను సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్‌గా జనం భావిస్తున్నారు. ఇక EV బ్యాటరీలు, సోలార్‌ ప్యానెల్స్‌, సెమీకండక్టర్స్‌, ఇతర ఇండస్ట్రియల్ అవసరాల కోసం వెండి వినియోగం తారస్థాయికి చేరింది.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: ఆ ఒక్క సీన్ కోసం రేకుల బాత్రూమ్‌లోకి వెళ్లి.! సౌందర్య గొప్పతనానికి ఈ సంఘటన చాలు..

మరోవైపు వెండి లభ్యత నానాటికి తగ్గిపోతోంది. ఇంకో వైపు సిల్వర్ ETFలలో పెట్టుబడులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ కారణంతో, గతంలో ఎన్నడూ లేనివిధంగా సిల్వర్‌ రేట్లు ఆకాశాన్ని తాకుతున్నాయంటున్నారు అనలిస్టులు. గ్రీన్‌లాండ్‌ వివాదం, డాలర్‌ బలహీనత, వడ్డీరేట్లను US ఫెడ్‌ రిజర్వ్‌ తగ్గించవచ్చనే అంచనాలతో గోల్డ్‌, సిల్వర్‌ ధరల్లో దూకుడు కనిపిస్తోంది. కొన్ని దేశాలు డాలర్‌ మారకంలో వాణిజ్యాన్ని తగ్గించుకునే ప్రయత్నాలతో పసిడికి డిమాండ్‌ పెరుగుతోంది. కాగా, వెండి, సిల్వర్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకునేవారికి బిజినెస్ నిపుణులు కొన్ని కీలక సలహాలు ఇచ్చారు. ఎప్పుడైనా కూడా ఈ రెండు మెటల్స్ కింద పడే అవకాశం ఉందని.. కాబట్టి వన్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ బదులుగా సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(SIP) చేయాలని సూచిస్తున్నారు. అలా చేస్తే యావరేజ్ చేసే ఛాన్స్ ఉంటుందన్నారు.

ఇది చదవండి: అబ్బ.! ఆర్సీబీ జట్టు కొనేందుకు లైన్‌లోకి లక్కీ లేడీ.. ఎవరో తెలిస్తే స్టన్

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి