బంగారం కొనుగోలు చేసే వారికి బ్యాడ్ న్యూస్. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తోన్న పసిడి, వెండి ధరలు ఇవాళ (నవంబర్ 25) భారీగా పెరిగాయి. 10 గ్రాముల బంగారంపై రూ.300 నుంచి రూ.330 వరకు పెరిగింది. మారిన ధరలతో ప్రస్తుతం దేశీయ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.48,550కు లభిస్తోంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ. 52,970 పలుకుతోంది. ఇక వెండి కూడా బంగారం బాటలోనే పయనిస్తోంది. కిలో వెండిపై రూ.120 మేర పెరిగింది. కొత్త ధరలతో బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ. 62,200 గా ఉంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో ఏ సమయంలోనైనా పెరగవచ్చు. తగ్గవచ్చు. మీరు బంగారం కొనుగోలు చేసే సమయానికి ముందు ధరలు తెలుసుకోవడం ముఖ్యం.
ఇక మారిన ధరలతో దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి రేట్లు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.68,200 ఉంది. విజయవాడ, విశాఖపట్నం, చెన్నై, బెంగళూరు, కేరళ లో కూడా ఇదే ధర పలుకుతోంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.62,200 గా ఉంది. ఇక ముంబై, కోల్‌తా నగరాల్లోనూ ఇదే ధర పలుకుతోంది. కాగా, దేశంలోని ఇతర నగరాల్లో దాదాపు ఇదే ధరలు కొనసాగుతున్నాయి. జీఎస్టీ, టీసీఎస్, ఇతరత్రా పన్నుల కారణంగా ఆయా నగరాల్లోని బంగారం, వెండి రేట్లలో కొంత హెచ్చుతగ్గులు ఉండొచ్చునని గమనించాలి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..