Gold Silver Price Today: బంగారం ధరలకు బ్రేకులు.. స్వల్పంగా తగ్గిన వెండి ధర!

Gold Silver Price Today: గత రెండు రోజులుగా బంగారం ధరల్లో మార్పులు ఉండటం లేదు. ఒక వేళ మార్పులు ఉన్నా.. స్వల్పంగానే ఉంటున్నాయి. దేశంలో బంగారంకు మహిళలు..

Gold Silver Price Today: బంగారం ధరలకు బ్రేకులు.. స్వల్పంగా తగ్గిన వెండి ధర!
Follow us
Subhash Goud

| Edited By: Ram Naramaneni

Updated on: Apr 07, 2022 | 10:45 AM

Gold Silver Price Today: గత రెండు రోజులుగా బంగారం ధరల్లో మార్పులు ఉండటం లేదు. ఒక వేళ మార్పులు ఉన్నా.. స్వల్పంగానే ఉంటున్నాయి. దేశంలో బంగారంకు మహిళలు అత్యంత ప్రాధాన్యతి ఇస్తుంటారు. బంగారం, వెండి ధరల్లో మార్పులు ఉండడానికి అనేక కారణాలు ఉంటాయంటున్నారు బులియన్‌ మార్కెట్ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి తదితర కారణాలు పసిడి ధరలపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇక తాజాగా ఏప్రిల్‌ 7 (గురువారం) దేశీయంగా బంగారం (Gold) ధర స్థిరంగా కొనసాగితే.. వెండి (Silver) ధర స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

☛ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,800 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,140,

☛ చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.47,420, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,820

☛ దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,800 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.52,140 వద్ద ఉంది.

☛ కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,140 ఉంది.

☛ బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,140 ఉంది.

☛ హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,140,

☛ విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.52,140 ఉంది.

వెండి ధరలు

ఇక వెండి ధరల విషయానికొస్తే.. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.66,200 ఉండగా, ముంబైలో రూ.66,200 ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.70,700 ఉండగా, కోల్‌కతాలో రూ.66,200 ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.70,700 ఉండగా, కేరళలో రూ.70,700 ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.70,700 ఉండగా, విజయవాడలో రూ.70,700 వద్ద కొనసాగుతోంది. అయితే ఈ ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. కొనుగోలు చేసే ముందు ధర ఎంత ఉందో తెలుసుకుని వెళ్లడం మంచిది.

ఇవి కూడా చదవండి:

Bank Account Aadhaar Link: మీ ఆధార్‌ ఏయే బ్యాంకు అకౌంట్లకు అనుసంధానం అయ్యిందో తెలుసుకోవడం ఎలా..?

Hero Electric Scooter: తక్కువ ధరల్లో హీరో నుంచి మరో ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. ఫీచర్స్‌, ఇతర వివరాలు