Gold Price: సామాన్యులకు షాకిస్తున్న బంగారం ధరలు.. ఉగాది పర్వదినాన పసిడి ఎంత ఉందంటే..

అంతర్జాతీయంగా బ్యాంకింగ్‌ రంగంలో చోటుచేసుకుంటున్న తీవ్రమైన మార్పులతో బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. అనూహ్యంగా పది రోజుల వ్యవధిలోనే పసిడి ధర రూ.56వేల నుంచి రూ.61వేలకు ఎగబాకింది.

Gold Price: సామాన్యులకు షాకిస్తున్న బంగారం ధరలు.. ఉగాది పర్వదినాన పసిడి ఎంత ఉందంటే..
Gold
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 22, 2023 | 1:11 PM

బంగారం ధరలు ఆకాశానికెగబాకుతున్నాయి. అమెరికన్‌ బ్యాంకుల సంక్షోభం పసిడిధరలపై తీవ్రమైన ప్రభావం చూపుతోంది. ఒక్కరోజులో అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర రెండువేల డాలర్లు పెరిగింది. ఒకే ఒక్క రోజులో 24 క్యారెట్ల పదిగ్రాముల బంగారం ధర దేశంలో ఏకంగా రూ.1400 పెరిగింది. ఈరోజు ఢిల్లీలో 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.61,100కు చేరింది.అమెరికా బ్యాంక్‌ల సంక్షోభంతో ప్రపంచ మార్కెట్‌లో పసిడి రేటు పరుగులు పెడుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 2005 డాలర్లు పలుకుతుండగా.. వెండి ధర 22.55 డాలర్లు ఉంది. మార్చి 8 నాటికి అంతర్జాతీయంగా ఔన్సు బంగారం ధర 1818 డాలర్ల కనిష్ఠానికి చేరింది. దీంతో ఇండియాలో 10 గ్రాముల పసిడి ధర రూ.56-57వేల మధ్య ఊగిసలాడింది. తిరిగి అంతర్జాతీయంగా బ్యాంకింగ్‌ రంగంలో చోటుచేసుకుంటున్న తీవ్రమైన మార్పులతో బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. అనూహ్యంగా పది రోజుల వ్యవధిలోనే పసిడి ధర రూ.56వేల నుంచి రూ.61వేలకు ఎగబాకింది.

స్విస్‌ బ్యాంకు క్రెడిట్‌ సూసీ సంక్షోభంతో పసిడి ధరలకు రెక్కలొచ్చాయని అంతర్జాతీయ నిపుణుల అంచనా వేస్తున్నారు. క్రెడిట్‌ సూసీ బ్యాంకును మరో స్విస్‌ బ్యాంకు యూబీఎస్‌ కొనుగోలు చేస్తున్నట్టు ప్రకటించడంతో అంతర్జాతీయంగా స్టాక్‌ మార్కెట్లు వణికిపోతున్నాయి. దీని ప్రభావంతో స్టాక్‌ మార్కెట్ల నుంచి పెట్టుబడులు బంగారం వైపు మళ్ళుతున్నాయి. దీంతో ఒక్కరోజులో అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర రెండువేల డాలర్లు పెరిగింది. ఉక్రెయిన్‌ యుద్ధం తరువాత బంగారం ధరలు ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి. ఇదే సందర్భంలో క్రిప్టో కరెన్సీకూడా పుంజుకుంది. బ్యాంకులపై విశ్వాసం సన్నగిల్లడంతో ఇన్వెస్టర్లు బిట్‌కాయిన్‌ వంటి క్రిప్టో కరెన్సీవైపు మళ్ళుతున్నారు. మొత్తంగా అమెరికన్‌ బ్యాంకుల సంక్షోభం ఇటు బంగారాన్నీ, అటు క్రిప్టో కరెన్సీ మార్కెట్‌ ను తళుక్కుమనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే.. కొద్ది రోజులుగా పరుగులు పెడుతున్న పసిడి ధరలు ఉగాది రోజున స్వల్పంగా తగ్గాయి. దీంతో ఈరోజు దేశీయ మార్కెట్లో 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 60,000గా కొనసాగుతుంది. ఇక ఈరోజు హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ రూ. 59,130గా ఉంది. కాగా గత కొద్ది రోజులుగా పసిడి ధరలు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈరోజు స్వల్పంగా తగ్గడంతో రాబోయే రోజుల్లో బంగారం ధరలు మరింత పెరుగుతాయా ? లేదా తగ్గుతాయా ? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!