Gold Price Today: బంగారం ప్రియులకు చుక్కలే.. శనివారం గోల్డ్‌ రేట్ ఎంత పెరిగిందో తెలుసా.?

Gold, Silver Price Today: బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పడుతున్నాయని సంతోషించేలోపే మళ్లీ పెరుగుతున్నాయి. ఈ నెల 10వ తేదీ నుంచి వరుసగా 5 రోజులుగా బంగారం ధర తగ్గుముఖం పట్టింది. ఏకంగా రూ. వెయ్యి వరకు తగ్గింది. అయితే శనివారం మళ్లీ ఒక్కసారిగా బంగారం ధరలో పెరుగుదల కనిపించింది...

Gold Price Today: బంగారం ప్రియులకు చుక్కలే.. శనివారం గోల్డ్‌ రేట్ ఎంత పెరిగిందో తెలుసా.?
Gold Price

Updated on: Jun 17, 2023 | 6:41 AM

Gold, Silver Price Today: బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పడుతున్నాయని సంతోషించేలోపే మళ్లీ పెరుగుతున్నాయి. ఈ నెల 10వ తేదీ నుంచి వరుసగా 5 రోజులుగా బంగారం ధర తగ్గుముఖం పట్టింది. ఏకంగా రూ. వెయ్యి వరకు తగ్గింది. అయితే శనివారం మళ్లీ ఒక్కసారిగా బంగారం ధరలో పెరుగుదల కనిపించింది. ఒకే రోజులో తులంపై ఏకంగా రూ. 400 పెరిగింది. దీంతో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ. 55,100గా ఉండగా, 24 క్యారెట్స్‌ బంగారం ధర రూ. 54,700 వద్ద కొనసాగుతోంది. ఇక ఈ రోజు దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలో పెరుగుదల కనిపించింది. మరి నేడు దేశ వ్యాప్తంగా గోల్డ్‌, సిల్వర్‌ ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూసేద్దాం..

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బంగారం ధరలు భారీగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో గోల్డ్‌ రేట్స్‌ ఎలా ఉన్నాయంటే.. తెలంగాణ రాజధానిలో శనివారం బంగారం ధర రూ. 400 పెరిగింది. దీంతో ఇక్కడ 22 క్యారెట్ల పసిడి ధర రూ. 55,100గా ఉండగా, 24 క్యారెట్స్‌ ధర రూ. 60,110వద్ద కొనసాగుతోంది. నిజామాబాద్‌లో 22 క్యారెట్స్‌ గోల్డ్‌ ధర రూ. 55,100కాగా, 24 క్యారెట్ల ధర రూ. 60,110గా ఉంది. ఆంధ్రప్రదేశ్‌ విషయానికొస్తే విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ. 55,100గా ఉండగా, 24 క్యారెట్ల ధర రూ. 60,110గా ఉంది. ఇక సాగర నగరం విశాఖపట్నంలో 22 క్యారెట్స్‌ ధర రూ. 55,100కాగా, 24 క్యారెట్ల ధర రూ. 60,110 వద్ద కొనసాగుతోంది. ఆధ్యాత్మితక నగరం తిరుపతిలో 22 క్యారెట్ల ధర రూ. 55,100కాగా, 24 క్యారెట్స్‌ ధర రూ. 60,110గా ఉంది.

దేశంలోని పలు ప్రధాన నగరాల విషయానికొస్తే..

* ఢిల్లీలో 24 క్యారెట్స్‌ గోల్డ్‌ ధర రూ. 60,460గా ఉంది.

ఇవి కూడా చదవండి

* బెంగళూరులో బంగారం ధర రూ. 60,160వద్ద కొనసాగుతోంది.

* తమిళనాడులో 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,460గా ఉంది.

వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 73,100, చెన్నైలో రూ. 78,500, బెంగళూరులో 73,000 వద్ద కొనసాగుతోంది. ఇక తెలంగాణ రాజధానిలో కిలో వెండి ధర రూ. 78,500కాగా, విజయవాడ, విశాఖపట్నంలో రూ. 78,500వద్ద కొనసాగుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us