Gold Price Today: గోల్డ్‌ కొనేవారికి ఊరట.. శనివారం తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరల వివరాలివే

బంగారం కొనుగోలు దారులకు కాస్త ఊరట లభించింది. గత కొన్ని రోజుల వరకు భారీగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు శనివారం (అక్టోబర్‌14) మాత్రం స్థిరంగా కొనసాగాయి. నిన్నటి (అక్టోబర్‌ 13) తో పోలిస్తే ఇవాళ పసిడి ధరల్లో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. శనివారం ఉదయం 6 గంటల వరకు నమోదైన వివరాల ప్రకారం.. ప్రస్తుతం బులియన్‌ మార్కెట్‌లో 22 క్యారెట్ల తులం గోల్డ్‌ ధర రూ. 54,000 ధర పలుకుతోంది.

Gold Price Today: గోల్డ్‌ కొనేవారికి ఊరట.. శనివారం తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరల వివరాలివే
Gold Silver Price

Updated on: Oct 14, 2023 | 6:30 AM

బంగారం కొనుగోలు దారులకు కాస్త ఊరట లభించింది. గత కొన్ని రోజుల వరకు భారీగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు శనివారం (అక్టోబర్‌14) మాత్రం స్థిరంగా కొనసాగాయి. నిన్నటి (అక్టోబర్‌ 13) తో పోలిస్తే ఇవాళ పసిడి ధరల్లో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. శనివారం ఉదయం 6 గంటల వరకు నమోదైన వివరాల ప్రకారం.. ప్రస్తుతం బులియన్‌ మార్కెట్‌లో 22 క్యారెట్ల తులం గోల్డ్‌ ధర రూ. 54,000 ధర పలుకుతోంది. అదేవిధంగా 24 క్యారెట్స్‌ గోల్డ్ రేట్ రూ. 58,910 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి ధరలు బంగారం బాటలోనే పయనిస్తున్నాయి. ప్రస్తుతం బులియన్‌ మార్కెట్‌లో కిలో వెండి రూ.72, 600 పలుకుతోంది. మరి శనివారం ఉదయం 6 గంటల వరకు దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం రండి.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇలా..

  • హైదరాబాద్‌లో ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం ధరూ. 58,910 పలుకుతుండగా.. 22 క్యారెట్స్ గోల్డ్ రేట్స్ 54,000 పలుకుతోంది.
  • ఏపీలోని విజయవాడలోనూ దాదాపు రేట్స్ ఉన్నాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర రూ. 58,910 గా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ. 54,000 గా ఉంది.
  • విశాఖపట్నంలోనూ ఇదే ధరలు కొనసాగుతున్నాయి.

దేశీయ మార్కెట్‌లో ధరలు ఇలా..

  • దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్స్ ధర రూ. 54,150 కాగా, 24 క్యారెట్స్‌ గొల్డ్‌ ధర రూ. 59,060గా ఉంది.
  • ముంబైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 54,000 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 58,910 గా ఉంది.
  • కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,000 గా ఉండగా, 24 క్యారెట్స్‌ గోల్డ్ రేట్ రూ. 58,910 వద్ద కొనసాగుతోంది.
  • చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,100 కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 60,110గా ఉంది.
  • బెంగళూరులో 22 క్యారెట్స్ గోల్డ్‌ ధర రూ. 54,000 కాగా, 24 క్యారెట్స్ బంగారం ధర రూ. 58,9100 వద్ద కొనసాగుతోంది.

వెండి ధరలిలా..

దేశీయ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ. 72,600 వద్ద ట్రేడ్ అవుతోంది. దేశంలోని ప్రధాన నగరాన్నింటిలోనూ ఇదే ధరలు అమలవుతున్నాయి. ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 77,000 గా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో ఇదే ధరలకు వెండి లభిస్తోంది. ఢిల్లీలో రూ. 72,600, ముంబైలో 72,600, బెంగళూరులో రూ. 71,500, కోల్‌కతా రూ. 72,600, చెన్నైలో 77,000లకు కిలో వెండి లభిస్తోంది.

 

ఇవి కూడా చదవండి

గమనిక.. బంగారం, వెండి ధరలు బులియన్ మార్కెట్ వెబ్‌సైట్‌లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి.. అయితే, ఈ ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉంటుంది.. కావున, కొనేముందు ఒకసారి బంగారం, వెండి ధరలను పరిశీలించి వెళ్లడం మంచిది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..