Gold Price Today: హమ్మయ్యా.! బిగ్ రిలీఫ్.. హైదరాబాద్‌లో తులం బంగారం ధర ఎంతుందంటే.?

|

Nov 17, 2024 | 7:54 AM

గోల్డ్ లవర్స్ ఇది విన్నారా.. రికార్డు స్థాయిలో తగ్గిన బంగారం ధరలు.. మళ్లీ పెరగకుండా శాంతించాయి. గత రెండు రోజులుగా స్వల్పంగా పెరిగి.. స్థిరపడ్డాయి. ఇవాళ హైదరాబాద్‌లో ధరలు ఎలా ఉన్నాయంటే..

Gold Price Today: హమ్మయ్యా.! బిగ్ రిలీఫ్.. హైదరాబాద్‌లో తులం బంగారం ధర ఎంతుందంటే.?
Follow us on

బంగారం ధరలు తగ్గినట్టే తగ్గి.. మళ్లీ పెరగడం మొదలుపెట్టాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఎఫెక్ట్‌తో దేశీయంగా బంగారం ధరలు రికార్డు స్థాయిలో పడిపోయాయి. గడిచిన వారం రోజుల్లో ఏకంగా రూ. 3 వేల వరకు తగ్గాయి. ఇక రెండు రోజుల నుంచి మళ్లీ పసిడి పైపైకి ఎగబాకుతోంది. అయితే నిన్నటితో పోలిస్తే.. ఇవాళ బంగారం ధరల్లో ఎలాంటి మార్పు కనిపించట్లేదు. ఈ మేరకు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో గోల్డ్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందామా..

ఇది చదవండి: మీరు పుట్టిన తేదీని బట్టి మీ వెనకున్న దేవుడెవరో చెప్పొచ్చు.! ఎలాగో తెల్సా

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 69,500గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 75,800గా ఉంది. ఇక ఆర్ధిక రాజధాని ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 69,350గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 75,650గా కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: తస్సాదియ్యా.! పే..ద్ద టాస్కే ఇది.. పామును గుర్తిస్తే మీరే తెలివైనవారే

వెండి ధరలు ఇలా..

వెండి ధరలు కూడా బంగారం బాటలో పయణిస్తున్నాయి. గడిచిన రెండు రోజుల్లో వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, ముంబై, పూణేలో కిలో వెండి రూ. 89,500గా ఉంది. ఇక హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, చెన్నైలో కేజీ వెండి. రూ. 99,000గా కొనసాగుతోంది.

ఇది చదవండి: బాబోయ్.. అది రోడ్డు కాదు భారీ కొండచిలువ.. పట్టు జారితే పరలోకానికే

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..