Gold Price: బంగారం ధగధగలు.. ధరల్లో భగభగలు.. తులంపై ఎంత పెరిగిందో తెలుసా..
బంగారు ఆభరణాలే కాకుండా గోల్డ్ బిస్కెట్ రూపంలో కూడా కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఇష్టపడతారు. ఈ మధ్యకాలంలో సావరిన్ గోల్డ్ బాండ్ పేరుతో పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత చూపిస్తున్నారు. అయితే బంగారం ధర రోజుకో విధంగా మారుతూ వస్తోంది. నిన్న స్థిరంగా కొనసాగిన బంగారం ధర ఈరోజు అమాంతం పెరిగిపోయింది.
బంగారు ఆభరణాలే కాకుండా గోల్డ్ బిస్కెట్ రూపంలో కూడా కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఇష్టపడతారు. ఈ మధ్యకాలంలో సావరిన్ గోల్డ్ బాండ్ పేరుతో పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత చూపిస్తున్నారు. అయితే బంగారం ధర రోజుకో విధంగా మారుతూ వస్తోంది. నిన్న స్థిరంగా కొనసాగిన బంగారం ధర ఈరోజు అమాంతం పెరిగిపోయింది. దీనికి కారణం అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ విలువ హెచ్చుతగ్గులు, పలు దేశాల్లో యుద్ద పరిస్థితులు, ముడి చమురు ధరల్లో మార్పులు అన్నీ కలిపి బంగారు ధరలు పెరుగుదలకు కారణం అవుతోంది.
నిన్న హైదరాబాద్ మార్కెట్లో 10గ్రాములు 24 క్యారెట్ పసిడి ధర నిన్న రూ.62,560 కాగా ఈరోజు ఏకంగా తులంపై రూ.820 పెరిగి రూ. 63,380కి చేరింది . ఇక 10గ్రాములు 22 క్యారెట్ బంగారం ధర నిన్న రూ. 57,350 ఉండగా ఈరోజు రూ. 750 పెరిగి 58,100కు చేరింది. ఇక వెండి విషయానికొస్తే నిన్న కిలో రూ. 81,500 కాగా ఈరోజు కిలోపై 700 పెరిగి 82,200కు చేరింది. హైదరాబాద్‌తో పాటూ పలు ప్రధాన నగరాల్లో బంగారం,వెండి ధరలు ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
10 గ్రాముల 24క్యారెట్ బంగారం ధర
హైదరాబాద్..రూ. 63,380 విజయవాడ..రూ. 63,380 ముంబాయి..రూ. 63,380 బెంగళూరు..రూ.63,380 చెన్నై..రూ. 64,040
10గ్రాముల 22క్యారెట్ బంగారం ధర
హైదరాబాద్..రూ. 58,100 విజయవాడ..రూ. 58,100 ముంబాయి..రూ. 58,100 బెంగళూరు..రూ. 58,100 చెన్నై..రూ.58,700
దేశంలోని ప్రధాన నగరాల్లో కిలో వెండి ధరలు ఇలా..
హైదరాబాద్..రూ. 82,200 విజయవాడ..రూ. 82,200 చెన్నై..రూ.82,200 ముంబాయి..రూ. 79,200 బెంగళూరు..రూ. 78,000
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..