Gold Price Today: మహిళలకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతంటే..!
Gold Price Today: బంగారం దాని స్వచ్ఛత కారణంగా ఎల్లప్పుడూ ప్రీమియం కొనుగోలుదారుల మొదటి ఎంపికగా నిలిచింది. మరోవైపు, 22 క్యారెట్ల బంగారం బలమైనదిగా, ఆభరణాలకు ఉత్తమమైనదిగా పరిగణిస్తారు. అంతర్జాతీయ మార్కెట్ ధరలు, ప్రభుత్వ పన్నులు, రూపాయి విలువలో హెచ్చుతగ్గులు వంటి అనేక..

బంగారం ధరలు మళ్లీ పరుగులు పెడుతున్నాయి. ఇటీవల లక్ష రూపాయలకుపైగా చేరిన తులం బంగారం ధర.. తర్వాత క్రమంగా దిగి వచ్చింది. ఒక్కసారిగా రూ.95 వేలకు దిగువన వచ్చింది. ఆ తర్వాత మెల్లమెల్లగా పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం మళ్లీ ఎగబాకుతోంది. మంగళవారం (జూన్ 3)న దేశీయంగా బంగారం ధర పెరిగింది. జూన్ 2న ధరలతో పోల్చుకుంటే తులంపై ఏకంగా 1500 వరకు పెరిగింది. ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.98,850 ఉండగా, 94 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.90,610 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి విషయానికొస్తే కిలో ధర రూ.1,00,100 వద్ద ఉంది. ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో పెరగవచ్చు.. తగ్గవచ్చు.. లేదా స్థిరంగా కొనసాగవచ్చు. ఈ ధరలు అన్ని ప్రాంతాల్లో ఒకే విధంగా ఉండకపోవచ్చు. ఎందుకంటే ప్రాంతాలను బట్టి జీఎస్టీ ఇతర ఛార్జీల ఆధారంగా ధర ఉంటుందని గుర్తించుకోండి.
ఇది కూడా చదవండి: Gas Cylinder: వంటగది గ్యాస్ సిలిండర్‌కు ఎరుపు రంగు ఎందుకు ఉంటుంది? అసలు రహస్యం ఇదే?
దేశంలోని ప్రధాన నగరాల్లో ధరల వివరాలు:
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.98,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.90,610 ఉంది.
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.99,000 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.90,760 ఉంది.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.98,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.90,610 వద్ద కొనసాగుతోంది.
బంగారం ధర ఎలా నిర్ణయించబడుతుంది?
24 క్యారెట్ల బంగారం దాని స్వచ్ఛత కారణంగా ఎల్లప్పుడూ ప్రీమియం కొనుగోలుదారుల మొదటి ఎంపికగా నిలిచింది. మరోవైపు, 22 క్యారెట్ల బంగారం బలమైనదిగా, ఆభరణాలకు ఉత్తమమైనదిగా పరిగణిస్తారు. అంతర్జాతీయ మార్కెట్ ధరలు, ప్రభుత్వ పన్నులు, రూపాయి విలువలో హెచ్చుతగ్గులు వంటి అనేక కారణాల వల్ల భారతదేశంలో బంగారం ధర మారుతుంది. బంగారం పెట్టుబడి సాధనం మాత్రమే కాదు, మన సంప్రదాయాలు, పండుగలలో కూడా ఒక ముఖ్యమైన భాగం. ముఖ్యంగా వివాహాలు, పండుగల సమయంలో దీని డిమాండ్ పెరుగుతుంది.
ఇది కూడా చదవండి: Smartphones: వీవీఐపీలు ఎలాంటి స్మార్ట్‌ఫోన్లు ఉపయోగిస్తారో తెలుసా? వీటి ప్రత్యేకతలు ఏంటి?
ఇది కూడా చదవండి: Vehicle Number Plate: నంబర్ ప్లేట్ల రంగుల రహస్యం.. తెలుపు, పసుపు, ఆకుపచ్చ నంబర్ల అర్థం ఏంటో తెలుసా..?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




