Gold Price Today: మళ్లీ పెరిగిన బంగారం ధర.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
బంగారం ధర ఆకాశమే హద్దుగా పెరిగిపోతోంది. పెరగడం తప్ప తగ్గడం లేదన్నట్లు దూసుకుపోతోంది. నెలల వ్యవధిలోనే తులం బంగారంపై ఏకంగా రూ. 10 వేలు పెరిగి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. తులం బంగారం కచ్చితంగా రూ. లక్షకు చేరనుంది అన్న వార్తలు వస్తున్నాయి. అయితే బంగారం పరుగులు పెడుతోన్న తీరు చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తోంది...
బంగారం ధర ఆకాశమే హద్దుగా పెరిగిపోతోంది. పెరగడం తప్ప తగ్గడం లేదన్నట్లు దూసుకుపోతోంది. నెలల వ్యవధిలోనే తులం బంగారంపై ఏకంగా రూ. 10 వేలు పెరిగి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. తులం బంగారం కచ్చితంగా రూ. లక్షకు చేరనుంది అన్న వార్తలు వస్తున్నాయి. అయితే బంగారం పరుగులు పెడుతోన్న తీరు చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తోంది. సోమవారం స్వల్పంగా తగ్గిన బంగారం ధర మంగళవారం మరోసారి పెరిగింది.
దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలో పెరుగుదల కనిపించింది. 22 క్యారెట్ల తులం బంగారంపై రూ. 10 పెరిగి రూ. 67,060కి పెరిగగా, 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 10 పెరిగి రూ. 73,160కి చేరింది. ఈ పెరుగుదల స్వల్పమే అయినా ప్రస్తుతం గోల్డ్ ప్రైజ్ ఆల్ టైమ్ హైకి చేరుకుంది. ఈ ఏడాది చివరి నాటికి తులం బంగారం ధర రూ. 80 వేలకి చేరడం ఖాయంగా కనిపిస్తోంది. మరి దేశంలో పలు ప్రధాన నగరాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
* దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,210కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 73,310 వద్ద కొనసాగుతోంది.
* దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,060కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,160గా ఉంది.
* ఇక చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ. 67,890కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 74,060 వద్ద కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..
* హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 67,060కాగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 73,160 వద్ద కొనసాగుతోంది.
* విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,060కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,160 వద్ద కొనసాగుతోంది.
* సాగన నగరం విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 67,060గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 73,160 వద్ద కొనసాగుతోంది.
వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
వెండి కూడా బంగారం బాటలోనే పయణిస్తోంది. దేశవ్యాప్తంగా మంగళవారం వెండి ధరలో పెరుగుదల కనిపించింది. కిలో వెండిపై రూ. 100 పెరిగింది. దీంతో ఢిల్లీ, ముంబయి, కోల్‌కతాలో కిలో వెండి ధర రూ. 86,100 వద్ద కొనసాగుతోంది. అదే విధంగా హైదరాబాద్‌తోపాటు విశాఖ, విజయవాడ, కేరళ, ముంబయిలలో కిలో వెండి ధర రూ. 86,100 వద్ద కొనసాగుతోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..