పసిడి కొనుగోలుదారులకు బంగారం ధర కాస్త ఊరటనిచ్చింది. ఈరోజు మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. బంగారాన్ని ఆభరణాల రూపంలో కొనేందుకు మహిళలు ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇదే క్రమంలో పసిడిపై పెట్టుబడులు పెట్టేందుకు కూడా చాలా మంది సుముఖత చూపిస్తారు. అయితే ప్రస్తుతం ఉన్న ధరల నేపథ్యంలో చాలా మంది ఆలోచనలో పడ్డారు. ప్రతి రోజు ధరల్లో హెచ్చతగ్గులు కనిపించడంతో పెట్టుబడులు పెట్టేందుకు జంకుతున్నారు.
బంగారం ధరల్లో ఇలా మార్పులు రావడానికి ప్రదాన కారణం అంతర్జాతీయ మార్కెట్లో ఏర్పాడిన ఆర్థిక పరిస్థితులు, డాలర్ విలువలో మార్పు, స్టాక్ మార్కెట్లలో నెలకొన్న గడ్డుపరిస్థితులే అని అంటున్నారు నిపుణులు. ఈరోజు హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన తులం బంగారం ధర రూ. 72,150గా ఉంది. అదే 22 క్యారెట్ల ఆర్నమెంట్ బంగారం రేటు రూ. 66,140కు చేరింది. నిన్నటి ధరలతో పోలిస్తే తులంపై రూ. 10 పెరిగింది. ఇక కిలో వెండి ధర కూడా రూ. 88,800గా ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే కిలోపై రూ.100 పెరిగింది. దేశ వ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పడు చూద్దాం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..