Gold Price Today: బంగారం ప్రియులకు ఊరట.. స్వల్పంగా తగ్గిన పసిడిధర.. తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..
దేశంలో మహిళలు బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలలో అయితే చెప్పాల్సిన అవసరం లేదు. షాపులన్ని కిటకిటలాడుతుంటాయి. చాలా మంది తమ వద్ద ఉన్న డబ్బులను బంగారంపై కూడా పొదుపు చేస్తుంటారు. భవిష్యత్తులో బంగారం..
దేశంలో మహిళలు బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలలో అయితే చెప్పాల్సిన అవసరం లేదు. షాపులన్ని కిటకిటలాడుతుంటాయి. చాలా మంది తమ వద్ద ఉన్న డబ్బులను బంగారంపై కూడా పొదుపు చేస్తుంటారు. భవిష్యత్తులో బంగారం ధర పెరగవచ్చనే అంచనాతో.. పసిడి కొనుగోలు చేస్తుంటారు. అయితే ఇటీవల కాలంలో బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కొద్దిరోజులుగా బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తుండగా.. డిసెంబర్ 13వ తేదీ మంగళవారం బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. డిసెంబర్ 12వ తేదీ సోమవారం నాటి ధరలతో పోలిస్తే మంగళవారం బంగారం పది గ్రాములపై రూ.100 వరకు తగ్గింది. అలాగే వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో ఏ సమయంలోనైనా పెరగవచ్చు. తగ్గవచ్చు. మీరు బంగారం కొనుగోలు చేసే సమయానికి ముందు ధరలు తెలుసుకోవడం ముఖ్యం. దేశ వ్యాప్తంగా పలు ప్రధాన నగారాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
* దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 49,950 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 54,490 వద్ద కొనసాగుతోంది.
* దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్స్ బంగారం ధర రూ. 49,800 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ రూ. 54,330 గా ఉంది.
* తమిళనాడు రాజధాని చెన్నైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 50,450 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 55,040 వద్ద కొనసాగుతోంది.
* కర్ణాటక రాజధాని బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 49,850 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 54,390 గా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ఉన్నాయి..
* హైదరాబాద్‌లో గురువారం 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ. 49,800 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 54,330 వద్ద కొనసాగుతోంది.
* విజయవాడలో 22 క్యారెట్స్ బంగారం ధర రూ. 49,800 గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 54,330 వద్ద కొనసాగుతోంది.
* విశాఖపట్నంలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ. 49,800 కాగా, 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ రూ. 54,330 గా ఉంది.
వెండి ధరలు ఇలా ఉన్నాయి..
ఓవైపు బంగారం ధర స్వల్పంగా తగ్గా.. వెండి ధరలో కూడా స్వల్ప తగ్గుదల కన్పించింది. దేశంలో పలు ప్రధాన నగరాల్లో మంగళవారం కిలో వెండి ధరలు ఎలా ఉన్నాయంటే.. ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 69,000 , ముంబైలో రూ. 69,000 గా ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 72,800 వద్ద కొనసాగుతోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి