
బంగారం కొనేవారికి క్రమంగా ఊరట లభిస్తోంది. బులియన్ మార్కెట్‌లో గత కొన్ని రోజుల నుంచి పరుగులు పెడుతున్న బంగారం ధరలకు బ్రేక్ పడుతోంది. వరుసగా నాలుగో రోజు కూడా పసిడి ధరలు తగ్గాయి. శనివారం (ఫిబ్రవరి18) 22 క్యారెట్ల తులం గోల్డ్‌పై రూ. 200 తగ్గగా, 24 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.220 తగ్గడం విశేషం. మారిన ధరలతో ప్రస్తుతం దేశంలోని బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.52,000 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.56,510 గా ఉంది. ఇక వెండి ధరలు కూడా బంగారం బాటలోనే పయనిస్తున్నాయి. శనివారం కిలో వెండిపై రూ.400 తగ్గడం విశేషం. ప్రస్తుతం బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.68,600 పలుకుతోంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో ఏ సమయంలోనైనా పెరగవచ్చు. తగ్గవచ్చు. మీరు బంగారం కొనుగోలు చేసే సమయానికి ముందు ధరలు తెలుసుకోవడం ముఖ్యం.
* హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,510గా ఉంది.
* విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,510గా ఉంది.
* విశాఖటపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,510గా ఉంది.
* దేశ రాజధాని న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,660 ఉంది.
* దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,510గా ఉంది.
* చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,230గా ఉంది.
* బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,560గా ఉంది.
ఇక వెండి ధరల్లోనూ భారీగా తగ్గుదుల కనిపించింది. దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో ఈ రోజు వెండి ధరలు తగ్గాయి. కిలో వెండి ధరపై ఏకంగా రూ. 400 తగ్గడం విశేషం. దేశ రాజధాని న్యూఢిల్లీలో కిలో వెండి ధర రూ. 68,600 కాగా, ముంబైలోనూ ఇదే ధరకు లభిస్తోంది. ఇక బెంగళూరులో రూ. 71,200 పలుకుతుండగా, చెన్నైలో రూ. 71,800 గా ఉంది. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 71,200 విజయవాడలో, విశాఖపట్నంలోనూ ఇదే ధర పలుకుతోంది.
గమనిక: ఈ ధరలు బులియన్ మార్కెట్ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం.. క్లిక్ చేయండి..