Gold & Silver Price Today: మహిళలకు షాకిచ్చిన బంగారం ధరలు.. పసిడి బాటలోనే వెండి.. స్వల్పంగా పెరిగిన రేట్స్..
హైదరాబాద్ మార్కెట్లో మంగళవారం ఉదయం 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 47,850 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 52,200 ఉంది..
సోమవారం ఉదయం స్థిరంగా కొనసాగిన బంగారం ధరలు మంగళవారం స్వల్పంగా పెరిగాయి. గత రెండు రోజులుగా నిలకడగా ఉన్న పసిడి ధరలు మే 31న ఉదయం రూ. 100 పెరిగింది. దీంతో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 47,850కి చేరగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధరలు రూ. 52,200కు చేరాయి. మరోవైపు వైపు వెండి కూడా బంగారం బాటలోనే నడుస్తోంది. నిన్నటి వరకు స్థిరంగా ఉన్న సిల్వర్ రేట్స్ సైతం మంగళవారం స్వల్పంగా పెరిగాయి. ప్రధాన నగరాల్లోని బంగారం, వెండి ధరలలో మార్పులు చోటు చేసుకున్నాయి.
ఈరోజు ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..
హైదరాబాద్ మార్కెట్లో మంగళవారం ఉదయం 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 47,850 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 52,200 ఉంది.. అలాగే చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 47,950 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,310కు చేరింది. ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,850 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 52,200కు చేరింది. ఇక దేశీయ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ. 47,850 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 52,200కు చేరింది. విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 47,850 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 52,200 ఉంది..
ఇక ప్రధాన నగరాల్లో వెండి ధరలు.. సోమవారం వరకు స్థిరంగా ఉన్న వెండి ధరలు మంగళవారం స్వల్పంగా పెరిగాయి. దేశీయ మార్కెట్లో కిలో వెండి రూ. 62,500కు చేరింది. ఇక చెన్నైలో కేజీ సిల్వర్ రేట్ రూ. 67,000 ఉండగా.. ముంబైలో రూ. 62,500కు చేరింది. అలాగే ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 62,500 ఉండగా.. బెంగుళూరులో కేజీ సిల్వర్ రూ. 67000కు చేరింది. ఇక హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లలో కేజీ సిల్వర్ రేట్ రూ. 67000 గా కొనసాగుతుంది.