AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: ఒక్కసారిగా మారిన సీన్.. మళ్లీ పెరుగుతున్న బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?

గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తూ కొనుగోలు దారులకు ఊరటకల్పించిన బంగారం, వెండి ధరలూ సడెన్‌గా రూట్‌ మార్చాయి. శుక్రవారం మరోసారి బంగారం, వెండి ధరలు పెరిగి కొనుగోలు దారులకు షాక్ ఇచ్చాయి. ఇక శనివారం అదే తరహాలో కొనసాగుతున్నాయి. కాబట్టి ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలు సహా దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

Gold Price Today: ఒక్కసారిగా మారిన సీన్.. మళ్లీ పెరుగుతున్న బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?
Latest Gold Rates On June 27th
Anand T
|

Updated on: Jun 27, 2026 | 7:06 AM

Share

పసిడి ప్రియులకు బంగారం ధరలు షాక్ ఇచ్చాయి. గత వారం రోజులుగా వరుసగా తగ్గుముఖం పట్టిన బంగారం, వెండి ధరలు సడెన్‌గా రూట్‌ మార్చాయి. శుక్రవారం మరోసారి బంగారం ధరలు పుంజుకున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలు, డాలర్ విలువ మారకమే ఈ పెరుగుదలకు ప్రధాన కారణం అంటున్నారు మార్కెట్‌ నిపుణులు.. ఇక శుక్రవారంతో పోల్చుకుంటే శనివారం 24 క్యారట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1000కిపైగా పెరిగింది.

నిన్నటితో పోల్చుకుంటే నేటి  ధరలు ఇలా 

ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో తులం బంగారం ధర రూ.1,42,760 వద్ద ట్రేడవుతుండగా.. నిన్న ఈ ధర రూ.1,41,600గా ఉంది. ఇక 22 క్యారట్ల బంగారం ధర రూ.1,30,860గా ఉండగా.. నిన్న ఈ ధర రూ..1,29,800గా ఉంది. 18 క్యారట్ల బంగారం ధర ప్రస్తుతం రూ. 1,07,070గా ఉంది. ఇక వెండి కూడా బంగారం బాటలోనే దూసుకెళ్తోంది. ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో కేజీ వెండి ధర రూ.2,40,100 వద్ద ట్రేడవుతుంది.

దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా

  • హైదరాబాద్‌లో గోల్డ్ 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,42,760, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,30,860గా ఉంది. వెండి కిలో ధర రూ.2,45,100 ఉంది.
  • విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.1,42,760, 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాముల ధర రూ.1,30,860 ఉంది. వెండి కిలో ధర రూ.2,45,100 ఉంది.
  • ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,42,960, 22 క్యారెట్ల ధర రూ.1,31,060 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,40,100 ఉంది.
  • ముంబైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,42,760,, 22 క్యారెట్ల ధర రూ.1,30,860 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,40,100 లుగా ఉంది.
  • చెన్నైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.145,100, 22 క్యారెట్ల ధర రూ.1,33,010 ఉంది. వెండి కిలో ధర రూ.2,45,100 ఉంది.
  • బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,42,760, 22 క్యారెట్ల ధర రూ.1,30,860గా ఉంది. వెండి కిలో ధర రూ.2,41,100 లుగా ఉంది.

బంగారం సంబంధించిన FAQs

ప్రశ్న 1: ప్రస్తుతం బంగారం, వెండి ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? సమాధానం: అంతర్జాతీయ మార్కెట్లలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల, ద్రవ్యోల్బణం కారణంగా సురక్షిత పెట్టుబడిగా వీటికి డిమాండ్ పెరిగి ధరలు పెరుగుతున్నాయి.

ప్రశ్న 2: రాబోయే రోజుల్లో బంగారం, వెండి ధరలు పెరుగుతాయా లేదా తగ్గుతాయా? సమాధానం: నిపుణుల అంచనాల ప్రకారం స్వల్పకాలికంగా స్వల్ప హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ, భవిష్యత్తులో ధరలు మరింత పెరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

ప్రశ్న 3: ఆభరణాలు కొనే ముందు నాణ్యత విషయంలో ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి? సమాధానం: బంగారంపై ప్రభుత్వ గుర్తింపు పొందిన ‘BIS హాల్‌మార్క్’ (916 సింబల్) ముద్ర ఉందో లేదో తప్పనిసరిగా తనిఖీ చేసి కొనుగోలు చేయాలి.

ప్రశ్న 4: నగలు కొనేటప్పుడు ధరల లెక్కింపులో దేనిని గమనించాలి? సమాధానం: రోజువారీ అసలు ధరతో పాటు, దుకాణదారులు వేసే తరుగు, తయారీ ఖర్చులు, 3% GST లెక్కింపును సరిచూసుకోవాలి.

ప్రశ్న 5: కేవలం పెట్టుబడి కోసమే అయితే ఎలాంటి బంగారం లేదా వెండి కొనడం మంచిది? సమాధానం: పెట్టుబడి కోసం అయితే నగల రూపంలో కాకుండా 24 క్యారెట్ల నాణేలు, బిస్కెట్లు లేదా డిజిటల్ గోల్డ్ రూపంలో కొనడం వల్ల తరుగు ఖర్చులు మిగిలి పూర్తి లాభం వస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us