AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cyber Frauds: డిజిటల్ సైబర్ మోసాలపై బ్యాంకులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. బాధితులకు ఊరట

Cyber Frauds: డిజిటల్ అరెస్ట్ కేసుల నియంత్రణకు గాను మార్గదర్శకాలు వర్తించే బ్యాంకులు, ఆర్థిక సంస్థల జాబితాను సమర్పించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని సుప్రీంకోర్టు ఆదేశించింది. డిసెంబర్ 31 నాటికి అమలులోకి రానున్న ఆర్‌బీఐ సవరించిన నూతన కేవైసీ (KYC) మార్గదర్శకాలను సుప్రీంకోర్టు స్వయంగా పరిశీలించనుంది..

Cyber Frauds: డిజిటల్ సైబర్ మోసాలపై బ్యాంకులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. బాధితులకు ఊరట
Cyber Frauds
Gopikrishna Meka
| Edited By: |

Updated on: Oct 29, 2026 | 8:25 PM

Share

Cyber Frauds: దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న సైబర్ మోసాలు, డిజిటల్ అరెస్ట్ నేరాల బాధితులకు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. డిజిటల్, సైబర్ మోసాల్లో నష్టపోయిన బాధితులకు ఊరట కలిగించేలా సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.డిజిటల్ మోసాల్లో నష్టపోయిన బాధితుల సొమ్ముకు సంబంధించి బ్యాంకుల నిర్లక్ష్యం లేదా సరైన తనిఖీలు చేయడంలో విఫలమైతే, ఆ నష్టాన్ని బ్యాంకులే భరించాలని బాధితులకు పరిహారం చెల్లించేలా నిబంధనలు తీసుకురావాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.బ్యాంక్ ఖాతాల్లో సాధారణ విధానానికి భిన్నంగా జరిగే అసాధారణ లేదా సందేహాస్పద లావాదేవీలను వెంటనే గుర్తించి, ఖాతాదారులను కాపాడేందుకు సమీపంలోని పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేయడం బ్యాంకుల ప్రాథమిక బాధ్యత అని ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం తేల్చిచెప్పింది…

రూ. 800 కోట్ల నష్టంపై సుప్రీంకోర్టు ఆందోళన

ఈ ఏడాది డిజిటల్ నేరాలు 50 శాతం తగ్గినట్లు గణాంకాలు చూపుతున్నప్పటికీ, మోసగాళ్ల బారినపడి బాధితులు ఏకంగా రూ. 800 కోట్లు కోల్పోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర విచారం, ఆందోళన వ్యక్తం చేసింది. డిజిటల్ అరెస్ట్ కేసులకు సంబంధించి ఇప్పటివరకు 9,400 అనుమానాస్పద ఖాతాలను బ్యాన్ చేసినట్లు వాట్సాప్ సుప్రీంకోర్టుకు వెల్లడించింది.డిజిటల్ అరెస్ట్ వ్యవహారంపై సుప్రీంకోర్టు చేపట్టిన సుమోటో విచారణలో భాగస్వామిగా జోక్యం చేసుకునేందుకు వాట్సాప్‌కు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది.

ఆర్‌బీఐకి సుప్రీంకోర్టు ఆదేశాలు

డిజిటల్ అరెస్ట్ కేసుల నియంత్రణకు గాను మార్గదర్శకాలు వర్తించే బ్యాంకులు, ఆర్థిక సంస్థల జాబితాను సమర్పించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని సుప్రీంకోర్టు ఆదేశించింది. డిసెంబర్ 31 నాటికి అమలులోకి రానున్న ఆర్‌బీఐ సవరించిన నూతన కేవైసీ (KYC) మార్గదర్శకాలను సుప్రీంకోర్టు స్వయంగా పరిశీలించనుంది..డిజిటల్ అరెస్ట్ కేసుల నియంత్రణకు మార్గదర్శకాలు వర్తించే బ్యాంకుల జాబితాను ఇవ్వాలని ఆర్‌బీఐకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.. సుప్రీంకోర్టు ఆదేశాలతో డిజిటల్ మోసాల బాధితులకు కొంత మేరకు ఉపశమనం లభించనుందని న్యాయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Follow Us
డిజిటల్ సైబర్ మోసాలపై బ్యాంకులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
డిజిటల్ సైబర్ మోసాలపై బ్యాంకులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
రణ్ బీర్, సాయి పల్లవిల 'రామాయణ' .. సీతారాముల కల్యాణం పాట చూశారా?
రణ్ బీర్, సాయి పల్లవిల 'రామాయణ' .. సీతారాముల కల్యాణం పాట చూశారా?
 వామ్మో.. డాక్టర్ల కన్నా మూడేళ్ల ముందే క్యాన్సర్‌ కు AI చెక్!
 వామ్మో.. డాక్టర్ల కన్నా మూడేళ్ల ముందే క్యాన్సర్‌ కు AI చెక్!
 పిల్లలు చదువంటే పారిపోతున్నారా? పేరెంట్స్ ఈ 3 పనులు చేయండి!
 పిల్లలు చదువంటే పారిపోతున్నారా? పేరెంట్స్ ఈ 3 పనులు చేయండి!
టాప్ 10 ‘బ్లైండ్ ర్యాంకింగ్’లో కోహ్లీ ప్లేస్ చూస్తే షాకే..?
టాప్ 10 ‘బ్లైండ్ ర్యాంకింగ్’లో కోహ్లీ ప్లేస్ చూస్తే షాకే..?
Video: చనిపోతాడని వదిలేశారు.. ప్రాణాలకు తెగించి కాపాడిన టెకీ!
Video: చనిపోతాడని వదిలేశారు.. ప్రాణాలకు తెగించి కాపాడిన టెకీ!
పాకిస్థాన్‌లో‌ని ఈ కట్టడాన్ని తాజ్ మహల్‌తో ఎందుకు పోలుస్తారు? 
పాకిస్థాన్‌లో‌ని ఈ కట్టడాన్ని తాజ్ మహల్‌తో ఎందుకు పోలుస్తారు? 
నల్లా నుంచి చుక్కచుక్కగా నీరు కారుతోందా? నెలకు ఇంత నీరు వృథా!
నల్లా నుంచి చుక్కచుక్కగా నీరు కారుతోందా? నెలకు ఇంత నీరు వృథా!
3 మ్యాచ్‌లకే తేలిపోయిన భువీ.. కట్‌చేస్తే.. ఊహించని షాక్
3 మ్యాచ్‌లకే తేలిపోయిన భువీ.. కట్‌చేస్తే.. ఊహించని షాక్
బిగ్‌బాస్ 10లో ఈ వారం కూడా డబుల్ ఎలిమినేషన్.. ఆ ఇద్దరూ బయటికే
బిగ్‌బాస్ 10లో ఈ వారం కూడా డబుల్ ఎలిమినేషన్.. ఆ ఇద్దరూ బయటికే