AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Prices: దీపావళి పండక్కి ముందే గుడ్ న్యూస్.. భారీగా దిగొచ్చిన బంగారం ధరలు.. అక్టోబర్ 30న తులం ఎంతంటే..?

పండక్కి ముందే బంగారం, వెండి ధరలు కుప్పకూలుతున్నాయి. గత కొద్ది నెలలుగా ధరలు తగ్గుతుండగా.. దీపావళి పండుగ క్రమంలో ధరలు మరింత పడిపోతున్నాయి. డాలర్ బలపడటమే ధరల పతనానికి కారణంగా నిపుణులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో మరింత పడే అవకాశముందని అభిప్రాయపడుతున్నారు.

Gold Prices: దీపావళి పండక్కి ముందే గుడ్ న్యూస్.. భారీగా దిగొచ్చిన బంగారం ధరలు.. అక్టోబర్ 30న తులం ఎంతంటే..?
Gold Prices
Venkatrao Lella
|

Updated on: Oct 30, 2026 | 6:28 AM

Share

దీపావళి పండుగ వేళ బంగారం ధరలు దిగొస్తున్నాయి. గత రెండు నెలలుగా పసిడి ధరలు భారీగా పతనమవుతుండగా.. పండుగ వేళ కుప్పకూలడం ఊరటగా చెప్పవచ్చు. ఎందుకంటే కొద్ది రోజుల్లో పండుగ రానుండటం, కార్తీక మాసం కూడా వస్తుండటంతో పెళ్లిళ్ల సీజన్ మొదలుకానున్న క్రమంలో గోల్డ్ కొనుగోలు చేసేందుకు చాలామంది ముందుకొస్తున్నారు. ఈ క్రమంలో ధరలు డౌన్ కావడం దేశ ప్రజలకు ఉపశమనం కలిగించే అంశంగా చెప్పవచ్చు. అమెరికా డాలర్ బలపడటం, ఫెడ్ వడ్డీ రేట్లను పెంచడం ధరల తగ్గుదలకు కారణంగా చెప్పవచ్చు. దీంతో బంగారం కొనుగోలు చేయడానికి ఇదే అద్బుతమ అవకాశంగా నిపుణులు చెబుతున్నారు. అక్టోబర్ 30వ తేదీన శుక్రవారం కూడా ధరలు క్రాష్ అయ్యాయి. ఇవాళ దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..

బంగారం ధరలు ఇవే..

-హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,43,940 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,31,940గా ట్రేడవుతోంది.

-విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,43,940గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,31,940 వద్ద కొనసాగుతోంది.

-దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,44,090 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,32,090 వద్ద ట్రేడవుతోంది.

-చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,43,940 పలుకుతుండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,31,940కు లభిస్తోంది.

-బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,43,940 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,31,940గా ట్రేడవుతోంది.

నేటి వెండి రేట్లు ఇవే..

బంగారంతో పాటు వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి.

-చెన్నైలో కేజీ సిల్వర్ ధర రూ.2,14,900 వద్ద కొనసాగుతోంది. నిన్న ఈ రేటు రూ.2.15 లక్షలుగా ఉంది.

-బెంగళూరులో కేజీ సిల్వర్ ధర రూ.2,14,900 వద్ద కొనసాగుతోంది

-హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.2,14,900 వద్ద కొనసాగుతోంది

-చెన్నైలో కిలో సిల్వర్ రేటు రూ.2,14,900గా ట్రేడవుతోంది

బంగారం ధరలు రికార్డ్ స్థాయిలో పతనం

గోల్డ్ రేట్లు రికార్డ్ స్థాయిలో కుప్పకూలుతున్నాయి. ఈ ఏడాది జనవరిలో గరిష్ట స్థాయికి చేరుకోగా.. అక్కడి నుంచి 20 శాతం మేర డౌన్ అయ్యాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వల్ల క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో పసిడి ధరలపై ప్రభావం చూపింది. జనవరి 29న గోల్డ్ రేటు రూ.1,76,306 ఆల్ టైం రికార్డ్ స్థాయికి చేరుకోగా.. అక్టోబర్ 23 నాటికి రూ.1,40,664కి పడిపోయింది. దీంతో మొత్తం 20.21 శాతం తగ్గినట్లయింది. ఇప్పుడు పండుగ వేళ ధరలు తగ్గుతుండటం పెద్ద ఊరటగా చెప్పవచ్చు. దీంతో కొనుగోలు చేయాలనుకునేవారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Follow Us