ఊపిరి పీల్చుకో వినియోగదారుడా.. బంగారం ధరలు భారీగా తగ్గాయి. గడిచిన వారం రోజులుగా పైపైకి ఎగబాకుతున్న గోల్డ్ రేట్స్‌కి చెక్ పడింది. మూడు రోజుల నుంచి బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇది గోల్డ్ లవర్స్‌కి కాస్త రిలీఫ్‌ను ఇచ్చే అంశం. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరిగినప్పటికీ.. దేశీయంగా ఆ ప్రభావం కనిపించకపోవడం గమనార్హం. అయితే వచ్చేది పండుగల సీజన్ కాబట్టి.. మరోసారి బంగారానికి డిమాండ్ విపరీతంగా పెరగనుంది. దీంతో గోల్డ్ రేట్స్ మళ్లీ భారీగా పెరిగే ఛాన్స్ ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గత 2 రోజులుగా 24 క్యారెట్ల బంగారం ధర రూ. 600 మేరకు తగ్గింది. అటు 22 క్యారెట్ల బంగారం ధర రూ. 550 మేర దిగింది. ఈ క్రమంలో జులై 10న హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందామా..
ఇది చదవండి: ‘హాయ్ ఫ్రెండ్స్.! ఈరోజు మా ఫస్ట్ నైట్’.. వీడియో షేర్ చేసిన కొత్త జంట.. ఇదేం బూతు పురాణం
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బుధవారం 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 67 వేల 100 వద్ద ఉంది. ఇక 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ రేటు తులానికి రూ. 73 వేల 200 పలుకుతోంది. విజయవాడ, విశాఖపట్నం నగరాల్లోనూ ఇదే ధర కొనసాగుతోంది. మరోవైపు ఢిల్లీ మార్కెట్లో 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 67 వేల 250 పలుకుతోంది. ఇక 24 క్యారెట్ల మేలిమి గోల్డ్ రేటు తులానికి రూ. 73 వేల 350 వద్ద ఉంది.
ఇది చదవండి: ద్యావుడా.! వాటే మేకోవర్.. ఈ వయ్యారి అందాన్ని చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..
వెండి కూడా బంగారం బాటలో పయణిస్తోంది. గత వారం రోజులుగా పెరుగుతూపోతోన్న వెండి ధరలకు బ్రేక్ పడింది. గడిచిన 2 రోజుల్లో రూ. 1000 మేరకు తగ్గింది. హైదరాబాద్, చెన్నై, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో కిలో వెండి రూ. 99 వేల దగ్గర ఉంది. ఇక బెంగళూరులో కిలో వెండి రూ. 93900గా, ముంబై, ఢిల్లీలలో రూ. 94,500గా కొనసాగుతోంది. కోల్‌కతాలో కిలో వెండి రూ. 95,100 వద్ద ఉంది.
ఇది చదవండి: ఇప్పుడిదే ట్రెండింగ్ బిజినెస్.. లక్షల్లో డబ్బు.. స్టార్ట్ చేస్తే తిరుగుండదిక
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..