బంగారం ధరలు భారీగా తగ్గాయోచ్. ఇది నిజంగానే గోల్డ్ ప్రియులకు బిగ్ రిలీఫ్. దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. గత 7 రోజుల్లో 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ. 1,520 మేరకు తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు నేల చూపులు చూడటంతో.. ఆ ప్రభావం దేశీ మార్కెట్‌పై కూడా పడిందని బులియన్ మార్కెట్ నిపుణులు అంటున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లోనూ బంగారం, వెండి ధరల్లో గత వారం రోజులుగా మార్పులు కనిపిస్తున్నాయి.
హైదరాబాద్‌లో చూస్తే.. గోల్డ్ రేట్స్ క్రమేపి తగ్గుతూ వస్తున్నాయి. జూన్ 21న బంగారం ధరలు గమనిస్తే.. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,150గా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,250గా ఉంది. ఈ పసిడి ధరలు శుక్రవారం నాటికి 22 క్యారెట్లు గోల్డ్ రూ. 65,740గా.. 24 క్యారెట్ల బంగారం రూ. 71,720గా కొనసాగుతోంది. విశాఖపట్నం, విజయవాడ నగరాల్లోనూ ఇదే ధర ఉంది.
వెండి ధరలు కూడా బంగారం బాటలో నడుస్తున్నాయి. గత వారం రోజులుగా వెండి నేల చూపులు చూస్తోంది. ఈ నెల 21న వెండి ధర రూ. 94 వేలుగా ఉంటే.. అది ఇప్పుడు రూ. 89 వేలకు చేరింది. అంటే దాదాపుగా రూ. 5 వేలు మేరకు తగ్గింది. దీన్ని బట్టి హైదరాబాద్‌లో కిలో వెండి రూ. 94,400గా కొనసాగుతోంది.
ఇది చదవండి: అరెకరం భూమి ఉంటే చాలు.. నెలకు రూ. 2 లక్షలు గ్యారెంటీ.! అదేంటంటే
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..