Gold, Silver Price Crash: జస్ట్ 68 రోజులు.. బంగారం ధర రూ.40,000, వెండి ధర రూ.1.75 లక్షలు పతనం!
Gold and Silver Price Crash: గత కొన్ని రోజులుగా మహిళలకు బంగారం, వెండి ధరలు ఉపశమనం కలిగిస్తున్నాయి. రికార్డు స్థాయిలో పరుగులు పెట్టిన బంగారం, వెండి ధరలకు బ్రేకులు పడి నేల చూపులు చూస్తున్నాయి. అంటే రికార్డు స్థాయిలో పెరిగిన ధరలు.. అదే రికార్డు స్థాయిలో దిగి వస్తున్నాయి..

Gold and Silver Price Crash: ఇరాన్ – యునైటెడ్ స్టేట్స్ మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న యుద్ధం ఇప్పుడు ముగిసింది. అది తాత్కాలికం మాత్రమే. ఇది భారతదేశంపై మాత్రమే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. దీని ప్రభావం ఇప్పటికే బంగారం, వెండి ధరలలో కనిపిస్తోంది ఏప్రిల్ 8న రెండింటి ధరలు గణనీయంగా పెరిగాయి.
అయితే గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు భారీ స్థాయిలో పతనం అవుతున్నాయి. 68 రోజుల్లో బంగారం ధర రూ.40,000, వెండి ధర రూ.1.75 లక్షలు తగ్గింది. జనవరి 29న MCXలో బంగారం ధర రూ.1.93 లక్షలకు చేరి చరిత్ర సృష్టించింది. అయితే మరుసటి రోజే బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. సర్వకాలిక గరిష్ఠ స్థాయిని, నేటి ధరలను పోల్చి చూస్తే, 10 గ్రాముల బంగారం ఇప్పటికీ రూ.40,000 చౌకగా ఉంది. మరోవైపు, వెండి జనవరి 29న రూ.4.20 లక్షల గరిష్ఠ స్థాయికి చేరుకుంది. అంటే అప్పటి నుండి కిలోగ్రాము వెండి ధర రూ.1.75 లక్షలు చౌకైంది.
ఇది కూడా చదవండి: Business Idea: కేవలం రూ.2 లక్షలతో వ్యాపారం.. నెలకు రూ.50 వేల ఆదాయం.. మీ లైఫ్‌ను మార్చే బిజినెస్!
బంగారం, వెండి ధరలు పెరిగాయి:
ఇక బుధవారం స్థానిక బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.3,980 పెరగగా, కిలోగ్రాము వెండి ధర రూ.10,000 ఎగబాకింది. ధర పెరిగిన తర్వాత హైదరాబాద్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.1,53,820, కిలో గ్రాము వెండి ధర రూ.2,60,000కు చేరుకుంది.
భవిష్యత్తులో మరింత తగ్గుతుందా లేక పెరుగుతుందా?
2026 జనవరి చివరిలో బంగారం, వెండి రెండూ సర్వకాలీన గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. జనవరి చివరిలో వెండి కిలోకు రూ.420,000 వద్ద గరిష్ఠ స్థాయికి చేరుకుంది. మధ్యాహ్నం 3:30 గంటలకు, MCXలో 1 కిలో వెండి ధర రూ.244,261గా ఉంది. ఈ రికార్డుతో పోలిస్తే వెండి ధర రూ.1.75 లక్షలకు పైగా పడిపోయింది. అయితే, ఈ రోజు బంగారం, వెండి రెండూ పెరుగుదలను చూస్తున్నాయి.
ఫిబ్రవరితో పోలిస్తే బంగారం ఇప్పటికీ చౌకగానే..
నిన్న ధరలు పుంజుకున్నప్పటికీ, బంగారం తన రికార్డు గరిష్ఠ స్థాయి కంటే తక్కువగానే ఉంది. ఫిబ్రవరి 27, 2026న బంగారం ధర రూ.165,659 వద్ద గరిష్ఠ స్థాయికి చేరుకుంది. యుద్ధ సమయంలో ఇది సుమారు రూ.12,363 (7.5%) మేర పడిపోయింది. అంతర్జాతీయంగా, జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ కూడా సుమారు 3% పెరిగి ఔన్సుకు డాలర్ 4,813కి చేరుకున్నాయి.
అమెరికా డాలర్ బలోపేతం కావడం, బడ్జెట్ అనంతర మార్పులు మరియు గ్లోబల్ మార్కెట్లలో లాభాల స్వీకరణ (Profit Booking) ఈ భారీ పతనానికి ప్రధాన కారణాలుగా నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Buying Silver: మీరు వెండిని కొనుగోలు చేస్తున్నారా? తప్పకుండా గుర్తించుకోవాల్సిన విషయాలు ఇవే!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




