Buying Silver: మీరు వెండిని కొనుగోలు చేస్తున్నారా? తప్పకుండా గుర్తించుకోవాల్సిన విషయాలు ఇవే!
Buying Silver: ప్రస్తుత ధర అంతర్జాతీయ మార్కెట్ ఆధారంగా వెండి ధరలు రోజూ మారుతుంటాయి. కొనే ముందు ఆ రోజు ధరను తప్పక సరిచూసుకోండి. ప్రస్తుతం దేశీయంగా వెండి ధరలు భారీ స్థాయిలో దిగి వస్తున్నాయి. గతంలో గరిష్టంగా కిలో వెండి ధర..

Buying Silver: వెండిని (Silver) కొనుగోలు చేయడం అనేది కేవలం అలంకరణ కోసమే కాదు, ఒక మంచి పెట్టుబడి మార్గంగా కూడా చాలా మంది భావిస్తారు. అయితే, వెండి కొనే ముందు కొన్ని కీలక విషయాలను గమనించకపోతే నష్టపోయే ప్రమాదం ఉంది. మీరు వెండి వస్తువులు లేదా పెట్టుబడి కోసం వెండిని కొనాలనుకుంటే, ఈ క్రింది విషయాలను తప్పకుండా గుర్తుంచుకోండి:
ప్రస్తుత ధర అంతర్జాతీయ మార్కెట్ ఆధారంగా వెండి ధరలు రోజూ మారుతుంటాయి. కొనే ముందు ఆ రోజు ధరను తప్పక సరిచూసుకోండి. ప్రస్తుతం దేశీయంగా వెండి ధరలు భారీ స్థాయిలో దిగి వస్తున్నాయి. గతంలో గరిష్టంగా కిలో వెండి ధర రూ.4 లక్షల వరకు వెళ్లగా ప్రస్తుతం రూ.2.60,000 వద్ద ట్రేడవుతోంది. అంటే గతంలో పోలిస్తే భారీ స్థాయిలోనే దిగి వచ్చింది. ఒక నెల రోజుల కిందటి ధరతో పోలిస్తే సుమారు రూ.50,000 వరకు దిగి వచ్చింది.
ఇది కూడా చదవండి: Gold Ring: 18 క్యారెట్ల బంగారు ఉంగరం చేయించుకోవాలా? మేకింగ్ ఛార్జీలు, GSTతో కలిపి మొత్తం ఖర్చు ఎంతవుతుంది?
వెండి కొనే ముందు గుర్తుంచుకోవాల్సిన విషయాలు:
- మేకింగ్ ఛార్జీలు: ఆభరణాలు లేదా పాత్రలు కొనేటప్పుడు జ్యువెలర్లు మేకింగ్ ఛార్జీలు వసూలు చేస్తారు. వీటి గురించి ముందే అడిగి తెలుసుకోవడం మంచిది.
- నమ్మకమైన విక్రేతలు: వెండి స్వచ్ఛత విషయంలో మోసపోకుండా ఉండాలంటే పేరున్న డీలర్లు లేదా జ్యువెలరీ షాపుల్లోనే కొనాలి. దీనివల్ల రీసేల్ (తిరిగి అమ్మేటప్పుడు) వాల్యూ బాగుంటుంది.
- సర్టిఫికేషన్: మీరు కొనే వెండి బిస్కెట్లు లేదా ఆభరణాల స్వచ్ఛతను తెలిపే సర్టిఫికేట్ లేదా హాల్‌మార్కింగ్ తప్పనిసరిగా ఉండాలి.
- బరువు తనిఖీ: వెండిని కొనే ముందు, కొన్న తర్వాత ఎలక్ట్రానిక్ వెయిట్ మెషిన్‌పై బరువును చెక్ చేయండి. ఆభరణాలలో అమర్చిన రత్నాలు లేదా పూసల బరువును వెండి బరువు నుండి మినహాయించారో లేదో గమనించండి. మీరు కేవలం వెండి బరువుకు మాత్రమే డబ్బు చెల్లించాలి.
- ప్యూర్ సిల్వర్ vs స్టెర్లింగ్ సిల్వర్ (తేడాలు): ప్యూర్ సిల్వర్ (Fine Silver): ఇది 99.9% స్వచ్ఛమైనది. ఇది చాలా మెత్తగా ఉంటుంది. అందుకే దీనితో ఆభరణాలు చేయడం కష్టం. సాధారణంగా నాణేలు, బిస్కెట్ల రూపంలో ఇది లభిస్తుంది.
- స్టెర్లింగ్ సిల్వర్: ఇందులో 92.5% వెండి ఉంటుంది. మిగిలిన 7.5% రాగి లేదా జింక్ కలుపుతారు. దీనివల్ల వెండికి గట్టిదనం వస్తుంది. ఆభరణాలు, పాత్రల తయారీకి దీనినే వాడతారు. ఇది చాలా కాలం మన్నికగా ఉంటుంది.
- పెట్టుబడి పరంగా వెండి: బంగారంతో పోలిస్తే వెండి ధర తక్కువగా ఉన్నప్పటికీ, పెట్టుబడికి ఇది సురక్షితమైన మార్గం. వెండి ఆభరణాలు లేదా నాణేలను అత్యవసర సమయంలో తిరిగి అమ్ముకున్నా మంచి ధర లభిస్తుంది.
ఇది కూడా చదవండి:: Dubai Gold: దుబాయ్‌లో తులం బంగారం ధర ఎంతో తెలుసా? మన దేశంలోని ధరలతో పోలిస్తే ఎంత తేడా?
ఇది కూడా చదవండి: Cheapest Fuel: ప్రపంచంలోనే అత్యంత చౌకైన పెట్రోల్.. లీటర్ ధర కేవలం 3 రూపాయల లోపే..!




