Gold Ring: 18 క్యారెట్ల బంగారు ఉంగరం చేయించుకోవాలా? మేకింగ్ ఛార్జీలు, GSTతో కలిపి మొత్తం ఖర్చు ఎంతవుతుంది?
Gold Ring: 18 క్యారెట్ల బంగారు ఉంగరం చేయించుకోవాలా? మేకింగ్ ఛార్జీలు, GSTతో కలిపి మొత్తం ఖర్చు ఎంతవుతుందో మీకు తెలుసా? బిల్లు వేసే సమయంలో మేకింగ్ ఛార్జీలపై జ్యువెలర్‌తో బేరమాడే అవకాశం ఉంటుంది. దీనివల్ల మీరు కొంత మేర ఖర్చు తగ్గించుకోవచ్చు. మీరు నగలు..

18K Gold Ring: బంగారం ధరలు మార్కెట్‌లో ఎంత హెచ్చుతగ్గులకు లోనైనప్పటికీ, బంగారు ఆభరణాల పట్ల మనకున్న మక్కువ ఎప్పటికీ తగ్గదు. మీరు కూడా ఈ రోజుల్లో 18 క్యారెట్ల (18K) బంగారు ఉంగరాన్ని చేయించుకోవాలని ఆలోచిస్తున్నట్లయితే, జ్యువెలరీ షాపుకు వెళ్లేముందు దాని ధర ఎలా లెక్కిస్తారో తెలుసుకోవడం చాలా ముఖ్యం. కేవలం బంగారం ధర మాత్రమే కాకుండా, దానిపై విధించే మేకింగ్ ఛార్జీలు (తయారీ ఖర్చులు), GST కూడా మీ బడ్జెట్‌పై ప్రభావం చూపుతాయి. 18 క్యారెట్ల ఉంగరం చేయించుకోవడానికి అసలు ఎంత ఖర్చవుతుందో చేసుకుందాం.
బంగారం ధర, బరువు:
ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం.. 18 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు సుమారు రూ.11,328 నుండి రూ.11,335 మధ్యలో ఉంది. బంగారం ధరలో వచ్చే స్వల్ప మార్పు కూడా మీ బిల్లుపై ప్రభావం చూపుతుందని గుర్తించుకోండి. మీ ఉంగరం ప్రాథమిక ధర దాని బరువు, ఆ రోజు మార్కెట్ రేటుపై ఆధారపడి ఉంటుంది.
ఇది కూడా చదవండి: Silver Price: మహిళలకు శుభవార్త.. ఏకంగా రూ.50 వేలు తగ్గిన వెండి ధర.. ఇంకా తగ్గుతుందా?
ఉదాహరణకు: మీరు 4 గ్రాముల బరువున్న ఒక సాధారణ ఉంగరాన్ని చేయించుకోవాలనుకుంటే, గ్రాముకు రూ.11,330 చొప్పున కేవలం బంగారం ధర మాత్రమే సుమారు రూ.45,320 అవుతుంది. ఇందులో ఇంకా ఎలాంటి ఇతర ఛార్జీలు కలపలేదు.
మేకింగ్ ఛార్జీలు (Making Charges):
బంగారం అసలు ధర నిర్ణయించిన తర్వాత జ్యువెలర్లు దానిపై మేకింగ్ ఛార్జీలను విధిస్తారు. సాధారణంగా ఇవి 5% నుండి 15% వరకు ఉంటాయి. మీరు ఒక సాధారణ డిజైన్‌ను ఎంచుకుని, దానికి 10% మేకింగ్ ఛార్జీలు అనుకుంటే, మీ బిల్లుకు అదనంగా రూ.4,500 జత చేయబడుతుంది. ఒకవేళ డిజైన్ చాలా క్లిష్టంగా లేదా స్పెషల్‌గా ఉంటే ఈ శాతం ఇంకా పెరగొచ్చు.
GST, ట్యాక్స్:
బంగారం ధర, మేకింగ్ ఛార్జీల మొత్తంపై 3% GST వసూలు చేస్తారు. పైన పేర్కొన్న లెక్క ప్రకారం, దాదాపు రూ.1,400 నుండి రూ.1,500 వరకు ట్యాక్స్ రూపంలో అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
మొత్తం ఖర్చు ఎంత అవుతుంది?
ఈ లెక్కలన్నింటినీ కలిపితే 4 గ్రాముల బరువున్న 18 క్యారెట్ల సాధారణ బంగారు ఉంగరం మీకు సుమారు రూ.53,000 నుండి రూ.56,000 మధ్యలో పడుతుంది.
వినియోగదారులకు ముఖ్య గమనిక:
HUID హాల్ మార్క్: మీరు బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేటప్పుడు దాని నాణ్యతను నిర్ధారించుకోవడానికి ఎల్లప్పుడూ HUID హాల్ మార్క్ ఉన్న నగలను మాత్రమే ఎంచుకోండి. దీని కోసం కొంచెం ఎక్కువ చెల్లించాల్సి వచ్చినా భవిష్యత్తులో అది మీకు భరోసా ఇస్తుంది.
బేరసారాలు: బిల్లు వేసే సమయంలో మేకింగ్ ఛార్జీలపై జ్యువెలర్‌తో బేరమాడే అవకాశం ఉంటుంది. దీనివల్ల మీరు కొంత మేర ఖర్చు తగ్గించుకోవచ్చు. మీరు నగలు కొనేముందు ఈ లెక్కలను గుర్తుంచుకుంటే, మోసపోకుండా సరైన ధరకే బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు.
ఇది కూడా చదవండి: Gold Price Drop: పసిడి ప్రేమికులకు శుభవార్త.. ఏకంగా రూ.54,686 వరకు పడిపోయిన బంగారం ధర.. ఇంకా తగ్గుతుందా?
ఇది కూడా చదవండి: D-Mart: డీమార్ట్‌కు వెళ్లేవాళ్లకు ఈ విషయం తెలిస్తే అవాక్కవుతారు.. రాధాకిషన్ దమానీనా మజాకా..!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

