Cheapest Fuel: ప్రపంచంలోనే అత్యంత చౌకైన పెట్రోల్.. లీటర్ ధర కేవలం 3 రూపాయల లోపే..!
Cheapest Fuel: ప్రస్తుతం మన దేశంలో పెట్రోల్ ధరలు వంద రూపాయలకుపైనే ఉంది. అయితే కొన్ని దేశాల్లో లీటర్ పెట్రోల్ ధర భారీగా ఉంది. కానీ ఓ దేశంలో మాత్రం లీటర్ పెట్రోల్ ధర కేవలం 3 రూపాయలలోపే ఉంది. మరి ఖరీదైన పెట్రోల్ ఏ దేశంలో, అత్యంత చౌకైనది ఏ దేశంలో తెలుసుకుందాం..

Cheapest Fuel: ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరల పెరుగుదల ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలపై నేరుగా ప్రభావం చూపుతోంది. ఇరాన్‌తో ఉద్రిక్తతలు, సరఫరా అంతరాయాలు ఇంధన ధరల పెరుగుదలకు దారితీశాయి. దీంతో సామాన్యులకు జీవన వ్యయం పెరిగింది.
పొరుగు దేశమైన పాకిస్తాన్‌లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. డీజిల్ ధరలు సుమారుగా 54.9 శాతం పెరిగి లీటరుకు 520.35 పాకిస్తానీ రూపాయలకు చేరగా, పెట్రోల్ ధరలు సుమారుగా 42.7 శాతం పెరిగి లీటరుకు 458.40 రూపాయలకు చేరాయి. ప్రపంచంలో అత్యంత చౌకైన, అత్యంత ఖరీదైన పెట్రోల్ ఎక్కడ దొరుకుతుందో తెలుసుకుందాం.
ఇది కూడా చదవండి: Gold Ring: 18 క్యారెట్ల బంగారు ఉంగరం చేయించుకోవాలా? మేకింగ్ ఛార్జీలు, GSTతో కలిపి మొత్తం ఖర్చు ఎంతవుతుంది?
హాంగ్ కాంగ్‌లో అత్యంత ఖరీదైన పెట్రోల్
ప్రపంచ పెట్రోల్ ధరల విషయానికి వస్తే, హాంకాంగ్ అగ్రస్థానంలో ఉంది. ఇక్కడ లీటరు పెట్రోల్ ధర దాదాపు $4.10కి చేరుకుంది. ఇది భారత రూపాయలలో సుమారు రూ.340కి సమానం. దీనికి ప్రధాన కారణం, ఇక్కడ ఉపయోగించే పెట్రోలియంలో దాదాపు 80 శాతం చైనా నుండి దిగుమతి అవ్వడమే. దీనివల్ల ధరలు అధికంగా ఉంటున్నాయి. అనేక ఐరోపా దేశాలలో పెట్రోల్ ఖరీదైనది. దేశాలను బట్టి పెట్రోల్ ధరలు చాలా తేడాగా ఉంటాయి. హాంకాంగ్ తర్వాత, మలావి ($2.85 ($264.94)), నెదర్లాండ్స్ ($2.73 ($253.81)) వంటి దేశాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.
ఇది కూడా చదవండి: Tech Tips: ఏ సీలింగ్ ఫ్యాన్ బ్లేడ్‌లు అత్యంత బలమైన గాలిని అందిస్తాయి? దాని వెనుక ఉన్న టెక్నాలజీ ఇదే!
అనేక యూరోపియన్ దేశాలలో కూడా పెట్రోల్ చాలా ఖరీదైనది. డెన్మార్క్‌లో లీటరు ధర $2.66 (రూ.247.25) కాగా, సింగపూర్‌లో $2.54 (రూ.236.1), జర్మనీలో $2.42 (రూ.224.95) గా ఉంది. అంతేకాకుండా, లీచెన్‌స్టైన్‌లో దీని ధర $2.41 (రూ.224.02) గా నమోదైంది. జాబితాలో ఇంకా దిగువన ఉన్న అల్బేనియాలో $2.39 (రూ. 222.13), గ్రీస్‌లో $2.36 (రూ. 219.34), నార్వేలో $2.36 (రూ. 219.34) వంటి దేశాలలో పెట్రోల్ ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి.
అత్యంత చౌకైన పెట్రోల్ ఎక్కడ ?
ప్రపంచంలో అత్యంత తక్కువ పెట్రోల్ ధరల విషయానికి వస్తే, ఇరాన్ అగ్రస్థానంలో ఉంది. ఇక్కడ ఒక లీటరు ధర సుమారు $0.029 (దాదాపు రూ.2.69)గా ఉంది. ఈ దేశం ఒక ప్రధాన చమురు ఉత్పత్తిదారు కావడం వల్ల, ఇక్కడ ధరలు చాలా తక్కువగా ఉంటాయి. అయితే, కొనసాగుతున్న యుద్ధం కారణంగా దేశంలో అనిశ్చితి నెలకొని ఉంది. తర్వాతి స్థానంలో వెనిజులా ఉంది. అక్కడ లీటరు పెట్రోల్ ధర సుమారు $0.035 (దాదాపు రూ. 2.70)గా ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు, కరెన్సీ మార్పిడి విలువల ఆధారంగా ఈ ధరలలో స్వల్ప మార్పులు ఉండవచ్చు. ఇరాన్‌లో ఇంధనం చౌకగా ఉండటానికి కారణం అక్కడ లభించే సహజ వనరులు , ప్రభుత్వ రాయితీలు కాగా, హాంగ్ కాంగ్‌లో దిగుమతి ఖర్చులు, అధిక పన్నులే దీనికి ప్రధాన కారణం.
ఇది కూడా చదవండి: Stock Market: దుమ్మురేపిన స్టాక్.. ఒకే రోజు రూ.2,300 పెరిగిన షేరు ధర.. ఇన్వెస్టర్లకు లాభాల పంట!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




