AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pulsar Vs Xtreme: మార్కెట్‌లో ఆ రెండు బైక్స్‌కు ఫుల్ డిమాండ్… సూపర్ లుక్స్‌తో స్టన్నింగ్ ఫీచర్లు

యువతను ఆకట్టుకునేందుకు అన్ని కంపెనీలు సరికొత్త మోడల్స్‌లో బైక్స్‌ను రిలీజ్ చేస్తున్నాయి. బజాజ్ ఆటో కొద్ది రోజుల క్రితం భారతదేశంలో పల్సర్ ఎన్ఎస్ 200కు సంబంధించిన నవీకరించిన వెర్షన్‌ను రిలీజ్ చేసింది. ఈ బైక్ రూ.1,57,427 (ఎక్స్-షోరూమ్) వద్ద అందుబాటులో ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే మార్కెట్‌లో అందుబాటులో ఉన్న హీరో ఎక్స్‌ట్రీమ్ 200 ఎస్‌కు ఈ బైక్ పోటీనివ్వనుంది. ఇటీవల కాలంలో యువత ఎక్కువగా 200 సీసీ బైక్స్‌ను ఇష్టపడుతున్న తరుణంలో మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ఈ రెండు బైక్స్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

Pulsar Vs Xtreme: మార్కెట్‌లో ఆ రెండు బైక్స్‌కు ఫుల్ డిమాండ్… సూపర్ లుక్స్‌తో స్టన్నింగ్ ఫీచర్లు
Pulsar Vs Xtreme
Nikhil
|

Updated on: Mar 06, 2024 | 6:00 PM

Share

భారతదేశంలో యువత ఎక్కువగా ఇటీవల కాలంలో బైక్స్ వాడకాన్ని అమితంగా ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా కాలేజీ స్టూడెంట్స్ బైక్స్ ఉండడం స్టేటస్ సింబల్‌లా ఫీలవుతున్నారు. ఈ నేపథ్యంలో యువతను ఆకట్టుకునేందుకు అన్ని కంపెనీలు సరికొత్త మోడల్స్‌లో బైక్స్‌ను రిలీజ్ చేస్తున్నాయి. బజాజ్ ఆటో కొద్ది రోజుల క్రితం భారతదేశంలో పల్సర్ ఎన్ఎస్ 200కు సంబంధించిన నవీకరించిన వెర్షన్‌ను రిలీజ్ చేసింది. ఈ బైక్ రూ.1,57,427 (ఎక్స్-షోరూమ్) వద్ద అందుబాటులో ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే మార్కెట్‌లో అందుబాటులో ఉన్న హీరో ఎక్స్‌ట్రీమ్ 200 ఎస్‌కు ఈ బైక్ పోటీనివ్వనుంది. ఇటీవల కాలంలో యువత ఎక్కువగా 200 సీసీ బైక్స్‌ను ఇష్టపడుతున్న తరుణంలో మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ఈ రెండు బైక్స్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

గత కొన్ని సంవత్సరాలుగా, భారతదేశం అంతటా ప్రీమియం పెద్ద కెపాసిటీ మోటార్ సైకిళ్లకు డిమాండ్ పెరిగింది. బజాజ్ ఎన్ఎస్ 200 టీవీఎస్ అపాచీ ఆర్‌టీఆర్, హీరో ఎక్స్‌ట్రీమ్ 200 ఎస్ వంటి ప్రత్యర్థులతో పోటీపడుతుంది. ముఖ్యంగా బజాజ్ పల్సర్ ఎన్ఎం 200, హీరో ఎక్స్‌ట్రీమ్ 200 ఎస్ మార్కెట్‌లో ప్రధాన పోటీదారులుగా నిలిచాయి. ఇందులో కొత్తగా ప్రారంభించబడిన అప్‌డేటెడ్ బజాజ్ పల్సర్ ఎన్ఎస్200 ధర రూ.1.57 లక్షలు (ఎక్స్-షోరూమ్). మరోవైపు హీరో ఎక్స్‌ట్రీమ్ 200 ఎస్ ధర రూ.1.41 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. అంటే బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 200 ధర కొంచెం ఎక్కువగా ఉంటుంది. 

స్పెసిఫికేషన్లు

కొత్త బజాజ్ పల్సర్ ఎన్ఎస్200లో 199.5 సీసీ, సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజన్‌తో వస్తుంది. ఆరు-స్పీడ్ ట్రాన్స్ మిషన్‌తో వస్తుంది. ఈ20 కంప్లైంట్ ఇంజన్ 9,750 ఆర్‌పీఎం వద్ద 24.13 బీహెచ్‌పీ గరిష్ట శక్తితో 8,000 ఆర్‌పీఎం వద్ద 18.74 ఎన్ఎం గరిష్ట టార్క్ ను విడుదల చేస్తుంది. హీరో ఎక్స్‌ట్రీమ్ 200 ఎస్ 199.6 సీసీ సింగిల్-సిలిండర్ ఇంజన్ ఆధారంగా పని చేస్తుంది. ఈ బైక్ 8,500 ఆర్‌పీఎం వద్ద 18.8 బీహెచ్‌పీ గరిష్ట శక్తిని, 6,500 ఆర్‌పీఎం వద్ద 17.35 ఎన్ఎం గరిష్ట టార్క్ ను విడుదల చేస్తుంది. ఈ బైక్ ఇంజిన్ ఐదు-స్పీడ్ ట్రాన్స్ మిషన్‌తో వస్తుంది.  బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 200 హీరో మోటోకార్ప్ నుంచి దాని ప్రత్యర్థి ఎక్స్‌ట్రీమ్ 200 ఎస్‌తో పోలిస్తే మరింత శక్తిని కొంచెం ఎక్కువ టార్క్‌ను అందిస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్ ప్రారంభం అప్పుడే.. ముహూర్తం ఖరారు..
దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్ ప్రారంభం అప్పుడే.. ముహూర్తం ఖరారు..
గుండెను పిండేసే ఘటన పొలం దున్నేందుకు కాడెద్దుగా మారిన యువకుడు
గుండెను పిండేసే ఘటన పొలం దున్నేందుకు కాడెద్దుగా మారిన యువకుడు
నువ్వేం భర్తవిరా.. అంత చిన్న దానికే భర్యను చంపుతావా?
నువ్వేం భర్తవిరా.. అంత చిన్న దానికే భర్యను చంపుతావా?
ఉడికించిన గుడ్డును ఇలా తింటే.. మీ శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే..
ఉడికించిన గుడ్డును ఇలా తింటే.. మీ శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే..
20 ఏళ్ల పోరాటం.. ప్రభుత్వ కొలువు వచ్చిన మర్నాడే రిటైర్‌మెంట్!
20 ఏళ్ల పోరాటం.. ప్రభుత్వ కొలువు వచ్చిన మర్నాడే రిటైర్‌మెంట్!
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం