Fujiyama Classic: ఫ్యూజులెగరగొడుతున్న ఫుజియమా స్కూటర్.. అతి తక్కువ ధరలో అద్భుత రేంజ్..
మన దేశంలో కొత్త బ్రాండ్ లాంచ్ అయ్యింది. ఫుజియామ ఈవీ నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ క్లాసిక్ మన దేశంలో లాంచ్ అయ్యింది. దీనిలో ప్రత్యేకత ఏంటంటే.. అతి తక్కువ ధరలో అధిక రేంజ్ ఇస్తుంది. దీని పనితీరు, స్కూటర్లోని సాంకేతికత కూడా బాగా ఆకట్టుకుంటుంది. ఈ నేపథ్యంలో ఫుజియామ క్లాసిక్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఇండియన్ వేగంగా ఎలక్ట్రిఫై అవుతోంది. విద్యుత్ శ్రేణిలోకి వేగంగా అడుగులేస్తోంది. ప్రభుత్వ ప్రోత్సాహానికి తోడు.. కంపెనీలు కూడా అత్యాధునిక ఫీచర్లు, వినియోగదారులకు అవసరమైన స్పెసిఫికేషన్లతో అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలో వీటి కొనుగోళ్లు పెరుగుతున్నాయి. ఫలితంగా మార్కెట్లో కొత్త కొత్త కంపెనీలు తమ ఉత్పత్తులను లాంచ్ చేస్తున్నాయి. ప్రస్తుతం మన దేశంలో ఓలా ఎలక్ట్రిక్, ఏథర్ వంటి బ్రాండ్లు అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్ల జాబితాలో ఉన్నాయి. వీటి తోడు మరిన్ని స్టార్టప్స్ తో పాటు కొన్ని దిగ్గజ టూ వీలర్ కంపెనీలకు చెందిన స్కూటర్లు కూడా బాగానే సేల్స్ రాబడుతున్నాయి. ఈ క్రమంలో మన దేశంలో కొత్త బ్రాండ్ లాంచ్ అయ్యింది. ఫుజియామ ఈవీ నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ క్లాసిక్ మన దేశంలో లాంచ్ అయ్యింది. దీనిలో ప్రత్యేకత ఏంటంటే.. అతి తక్కువ ధరలో అధిక రేంజ్ ఇస్తుంది. దీని పనితీరు, స్కూటర్లోని సాంకేతికత కూడా బాగా ఆకట్టుకుంటుంది. ఈ నేపథ్యంలో ఫుజియామ క్లాసిక్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఫుజియామ క్లాసిక్ ఎలక్ట్రిక్ స్కూటర్..
మన దేశంలో కొత్తగా లాంచ్ అయిన ఈ ఫుజియామ క్లాసిక్ స్కూటర్ రైడర్లకు అద్భుతమైన అనుభూతిని అందిస్తుంది. ముఖ్యంగా సిటీ పరిధిలో అవసరాలకు ఇది సరిగ్గా సరిపోతుంది. అద్భుతమైన రేంజ్, మంచి టాప్ స్పీడ్ అందిస్తుంది. ఆధునిక రైడర్ల అవసరాలకు అనుగుణంగా కంపెనీ దీనిని రూపొందించింది. దీని ధర రూ.79,999(ఎక్స్ షోరూం)గా ఉంటుంది. ముందుగా రూ. 1,999 చెల్లించి ప్రీ బుక్ చేసుకోవచ్చు, కంపెనీ సైట్ ప్రకారం, దేశవ్యాప్తంగా దీనికి 55 ప్రత్యేకమైన డీలర్‌షిప్‌లు, 115 సర్వీస్ పాయింట్లు ఉన్నాయి.
ఫుజియామ క్లాసిక్ ఎలక్ట్రిక్ స్కూటర్ స్పెసిఫికేషన్లు..
ఈ స్కూటర్ 3000-వాట్ పీక్ పవర్ మోటార్‌తో వస్తుంది. ఈ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 60 కి.మీ. అదే సమయంలో, దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 120 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. అంటే ఈ కాంబినేషన్‌తో రైడర్‌లు చార్జింగ్‌పై చింతించకుండా ఎక్కువసేపు సిటీలో హాయిగా తిరిగే అవకాశం ఉంటుంది.. దీనిలో బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయడానికి 4 గంటలు పడుతుంది.
ఇది రాత్రి వేళల్లో మెరుగైన విజిబిలిటీ కోసం ట్విన్-బ్యారెల్ ఎల్ఈడీ లైట్లను కలిగి ఉంటుంది. బ్రేకింగ్ గురించి చెప్పాలంటే, దీనికి కాంబి-డ్రమ్ బ్రేక్ సిస్టమ్ అందుతుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో రైడర్‌లు డిజిటల్ స్పీడోమీటర్‌ను కూడా పొందుతారు. ఫుజియామా ఈవీ క్లాసిక్‌లో పెద్ద 12-అంగుళాల ట్యూబ్‌లెస్ టైర్లు ఉంటాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








