AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Komaki Electric Scooters: డబుల్ బ్యాటరీ.. డబుల్ రేంజ్.. సింగిల్ చార్జ్‌పై ఏకంగా 200కి.మీ. ఈ స్కూటర్లు మార్కెట్లోనే బెస్ట్..

ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ కోమాకి కంపెనీ ఎస్ఈ, ఎల్‌వై పేరుతో ఈ డబుల్ బ్యాటరీ స్కూటర్లను విడుదల చేసింది. వీటిలో బేస్, డ్యూయల్, డ్యూయల్ ప్రో అనే వెర్షన్లను ఆవిష్కరించింది. బేస్ వేరియంట్‌లో స్కూటర్‌కు ఒకే బ్యాటరీ ఉంటుంది. కానీ డ్యూయల్, డ్యూయల్ ప్రో వేరియంట్లకు రెండు బ్యాటరీలు ఏర్పాటు చేసింది. ముఖ్యంగా రెండు బ్యాటరీల స్కూటర్లు ఎంతో ఆకట్టుకుంటున్నాయి.

Komaki Electric Scooters: డబుల్ బ్యాటరీ.. డబుల్ రేంజ్.. సింగిల్ చార్జ్‌పై ఏకంగా 200కి.మీ. ఈ స్కూటర్లు మార్కెట్లోనే బెస్ట్..
Komaki Ly Electric Scooter
Madhu
|

Updated on: Mar 22, 2024 | 7:54 AM

Share

ఎలక్ట్రిక్ స్కూటర్ల ప్రియులకు శుభవార్త. అద్భుత ఫీచర్లతో ద్విచక్ర వాహనాలు మార్కెట్ లోకి విడుదలయ్యాయి. రెండు బ్యాటరీలు, ఒక్కసారి చార్జింగ్ చేస్తే సుమారు 200 కిలోమీటర్ల ప్రయాణం వీటి ప్రత్యేకత. ప్రస్తుతం దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరిగిన నేపథ్యంలో వీటికి ప్రజల నుంచి మరింత ఆదరణ లభిస్తుందని తయారీదారులు చెబుతున్నారు. మైలేజీ అధికంగా ఇచ్చే స్కూటర్ల వల్ల ప్రయాణం సుఖంగా జరుగుతుంది. డబ్బులు ఆదా అవుతాయి. అలరించే ఫీచర్లు, ఆకట్టుకునే ధరలతో ఇవి మార్కెట్ లో సందడి చేస్తున్నాయి.

మార్కెట్లోకి విడుదల..

ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ కోమాకి కంపెనీ ఎస్ఈ, ఎల్‌వై పేరుతో ఈ డబుల్ బ్యాటరీ స్కూటర్లను విడుదల చేసింది. వీటిలో బేస్, డ్యూయల్, డ్యూయల్ ప్రో అనే వెర్షన్లను ఆవిష్కరించింది. బేస్ వేరియంట్‌లో స్కూటర్‌కు ఒకే బ్యాటరీ ఉంటుంది. కానీ డ్యూయల్, డ్యూయల్ ప్రో వేరియంట్లకు రెండు బ్యాటరీలు ఏర్పాటు చేసింది. ముఖ్యంగా రెండు బ్యాటరీల స్కూటర్లు ఎంతో ఆకట్టుకుంటున్నాయి. అమ్మకాలలో ఆ విభాగంలోని ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్లను అధిగమిస్తాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

ప్రత్యేకతలు ఇవే..

  • ఎస్ఈ, ఎల్‌వై రెండు మోడళ్ల స్కూటర్లూ 3 కేడబ్ల్యూ హబ్ మోటార్‌పై పనిచేస్తాయి. ఎస్ఈ మోడల్ గంటకు 80 కిలోమీటర్ల గరిష్ట వేగంతో పరుగెడుతుంది. ఎల్ వై మోడల్ గరిష్ట వేగం 60 కిలోమీటర్లు.
  • ఈ స్కూటర్లను కీలెస్ ఆపరేషన్ తో తీర్చిదిద్దారు. వీటిలో రివర్స్, పార్క్ అసిస్ట్, క్రూయిజ్ కంట్రోల్ తదితర స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి. టీఎఫ్ టీ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌లతో స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ ఉంది. నావిగేషన్, కాల్ అలర్ట్‌, ఇంటిగ్రేటెడ్ సౌండ్ సిస్టమ్ ను ఏర్పాటు చేశారు. రీజెనరేటివ్ బ్రేకింగ్‌తో పాటు మూడు పవర్ మోడ్‌లతో లభిస్తున్నాయి.
  • ఎస్ఈ బేస్ వేరియంట్ లో ఫ్రంట్ డిస్క్ బ్రేక్, వెనుక డ్రమ్ బ్రేక్‌ ఉన్నాయి. బండిని సమర్థంగా ఆపడానికి వీలుంటుంది. ఎస్ఈ డ్యూయల్, డ్యూయల్ ప్రో వేరియంట్లు రెండు చివర్లలో డిస్క్ బ్రేక్‌లను కలిగి ఉంటాయి. ఎల్ వై మోడల్ అన్ని వేరియంట్లు డ్రమ్ బ్రేక్‌లతో లభిస్తున్నాయి.
  • ఎస్ఈ బేస్ వెరియంట్ స్కూటర్‌కు ఒకే బ్యాటరీ ఉంటుంది. ఒక్కసారి చార్జింగ్ చేస్తే సుమారు 80 నుంచి 100 కిలోమీటర్ల మైలేజీ వస్తుంది. ఈ స్కూటర్ రూ. 96,968 ధరకు అందుబాటులో ఉంది. ఎస్ఈ డ్యూయల్ వేరియంట్ లో రెండు బ్యాటరీలు ఉంటాయి. ఒక్కసారి చార్జింగ్ చేస్తే 140 నుంచి 160 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. ఈ మోడల్ రూ.1,19,900కు లభిస్తుంది. ఎస్ఈ డ్యూయల్ ప్రో విషయానికి వస్తే రెండు బ్యాటరీలతో ఉన్నఈ స్కూటర్ రూ. 1,28,500కు మార్కెట్ లో అందుబాటులో ఉంది. వినియోగదారులను ఆకట్టకునేలా 160 నుంచి 200 కిలోమీటర్ల వరకూ రేంజ్ ఇస్తుంది.
  • ఎల్‌వై మోడల్ బేస్ వేరియంట్ కూడా ఒకే బ్యాటరీతో వస్తుంది. దీని ధర రూ.78,000, అలాగే 80 నుంచి 100 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. ఇక ఎల్‌వై డ్యూయల్ వేరియంట్ లో రెండు బ్యాటరీలు ఉన్నాయి. ఒక్కసారి చార్జింగ్ చేస్తే 140 నుంచి 160 కిలోమీటర్ల వరకూ ప్రయాణం చేయవచ్చు. రూ. 1,07,500 ప్రారంభ ధరకు అందుబాటులో ఉంది.
  • చివరగా, డ్యూయల్ బ్యాటరీ సెటప్‌ కలిగిన ఎల్ వై డ్యూయల్ ప్రో గురించి తెలుసుకుందాం. దీని ధర రూ. 1,13,900. మైలేజీ మాత్రం అద్భుతంగా వస్తుంది. ఇది 160 నుంచి 200 కిలోమీటర్ల వరకూ రేంజ్ ఇస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

టెస్ట్ బ్యాటర్‌గా స్టాంప్.. 8 సిక్సర్లు, 13 ఫోర్లతో బీభత్సం
టెస్ట్ బ్యాటర్‌గా స్టాంప్.. 8 సిక్సర్లు, 13 ఫోర్లతో బీభత్సం
తక్కువ ధరలో సన్‌రూఫ్‌తో వచ్చే టాప్‌ 4 కార్లు ఇవే!
తక్కువ ధరలో సన్‌రూఫ్‌తో వచ్చే టాప్‌ 4 కార్లు ఇవే!
ఉదయం పూట ఈ వ్యక్తులు టీ తాగితే బాడీ షెడ్డుకే.. అసలు విషయం..
ఉదయం పూట ఈ వ్యక్తులు టీ తాగితే బాడీ షెడ్డుకే.. అసలు విషయం..
2026లో మారుతి సుజుకి బిగ్ బ్యాంగ్..కొత్త అప్‌డేట్స్‌తో 4 కార్లు!
2026లో మారుతి సుజుకి బిగ్ బ్యాంగ్..కొత్త అప్‌డేట్స్‌తో 4 కార్లు!
శీతాకాలంలో మాత్రమే లభించే టర్నిప్ కూరగాయ గురించి తెలుసా? లాభాలు
శీతాకాలంలో మాత్రమే లభించే టర్నిప్ కూరగాయ గురించి తెలుసా? లాభాలు
కొత్త జీతం ఎలా నిర్ణయిస్తారు..? 8వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం..
కొత్త జీతం ఎలా నిర్ణయిస్తారు..? 8వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం..
మరోవారంలో MAT 2025 రాత పరీక్ష.. దరఖాస్తుకు మరికొన్ని గంటలే ఛాన్స్
మరోవారంలో MAT 2025 రాత పరీక్ష.. దరఖాస్తుకు మరికొన్ని గంటలే ఛాన్స్
SBIలో తక్కువ వడ్డీకే లోన్లు.. నేటి నుంచే ప్రారంభం!
SBIలో తక్కువ వడ్డీకే లోన్లు.. నేటి నుంచే ప్రారంభం!
తెలుగు రాష్ట్రాల్లో భగ్గుమంటున్న బంగారం ధరలు.. వెండి రికార్డ్
తెలుగు రాష్ట్రాల్లో భగ్గుమంటున్న బంగారం ధరలు.. వెండి రికార్డ్
RBI సమ్మర్ ఇంటర్న్‌షిప్‌కు 2026 దరఖాస్తు చేశారా? చివరి ఛాన్స్ ఇదే
RBI సమ్మర్ ఇంటర్న్‌షిప్‌కు 2026 దరఖాస్తు చేశారా? చివరి ఛాన్స్ ఇదే