AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rs. 2,000 notes: అక్కడ మీరు రూ. 2వేల నోట్లు ఉపయోగించలేరు.. ఈ రోజు నుంచి పూర్తిగా నిలిపివేత.. కారణమిదే..

అమెజాన్ మాత్రం ఈ రోజు అంటే 2023 సెప్టెంబర్ 19 నుంచి తమ డెలివరీ బాయ్స్ ఈ రూ. 2000 నోట్లను స్వీకరించరని ప్రకటించింది. ఈ మేరకు అమెజాన్ ఇండియా ఓ ప్రకటనను విడుదల చేసింది. క్యాష్ ఆన్ డెలివరీ(సీఓడీ) ఆప్షన్లపై వినియోగదారుల నుంచి స్వీకరించే నగదులో రూ. 2,000 నోట్లను తీసుకోవడాన్ని నిలిపివేస్తున్నట్లు చెప్పింది. అయితే థర్డ్ పార్టీ ఏజెన్సీల ద్వారా అందించే ఆర్డర్లకు మాత్రం రూ. 2,000నోట్లు స్వీకరిస్తారని వివరించింది.

Rs. 2,000 notes: అక్కడ మీరు రూ. 2వేల నోట్లు ఉపయోగించలేరు.. ఈ రోజు నుంచి పూర్తిగా నిలిపివేత.. కారణమిదే..
Rs 2000 Notes
Madhu
|

Updated on: Sep 19, 2023 | 5:48 PM

Share

హెడ్డింగ్ చూడగానే మీకు ఓ అనుమానం కలిగి ఉండవచ్చు.. సెప్టెంబర్ 30 వరకూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 2వేల నోట్లతో ఎలాంటి లావాదేవీలైన చేసుకోవచ్చని చెప్పింది కదా! ఇంకా మరి పది రోజుల సమయం ఉండగానే ఎందుకు తీసుకోరు అని. కానీ ప్రముఖ ఈ-కామర్స్ జెయింట్ అమెజాన్ మాత్రం ఈ రోజు అంటే 2023 సెప్టెంబర్ 19 నుంచి తమ డెలివరీ బాయ్స్ ఈ రూ. 2000 నోట్లను స్వీకరించరని ప్రకటించింది. ఈ మేరకు అమెజాన్ ఇండియా ఓ ప్రకటనను విడుదల చేసింది. క్యాష్ ఆన్ డెలివరీ(సీఓడీ) ఆప్షన్లపై వినియోగదారుల నుంచి స్వీకరించే నగదులో రూ. 2,000 నోట్లను తీసుకోవడాన్ని నిలిపివేస్తున్నట్లు చెప్పింది. అయితే థర్డ్ పార్టీ ఏజెన్సీల ద్వారా అందించే ఆర్డర్లకు మాత్రం రూ. 2,000నోట్లు స్వీకరిస్తారని వివరించింది.

సెప్టెంబర్ 30 వరకూ గడువు..

కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో 2023 మే 19న భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) రూ. 2,000 నోట్లను చెలామణి నుంచి తొలగించింది. అయితే వాటిని మార్చుకోడానికి లేదా డిపాజిట్ చేయడానికి ప్రజలకు సెప్టెంబర్ 30 వరకు గడువు ఇచ్చింది. ఈ క్రమంలో వినియోగదారులు, పలు సంస్థలు తమ వద్ద ఉన్న రూ. 2000 నోట్లను మార్చుకునేందుకు బ్యాంకులకు క్యూ కట్టారు. జూన్ 30 నాటికి భారతీయ బ్యాంకులకు రూ. 2.72 లక్షల కోట్ల విలువైన రూ. 2,000 నోట్లు వచ్చాయని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి గతంలో వెల్లడించారు . ఆర్‌బీఐ ప్రకారం, ఈ అధిక విలువ కలిగిన నోట్లలో 76% బ్యాంకుల్లో డిపాజిట్ చేయబడ్డాయి లేదా మార్పిడి చేయబడ్డాయి. అయితే అమెజాన్ ఇండియా మాత్రం సెప్టెంబర్ 19 నుంచే పెద్ద నోట్లను మార్చబోమని ప్రకటించింది. తమ ప్రతినిధులు ఎవరూ క్యాష్ ఆన్ డెలివరీ సమయంలో వినియోగదారుల నుంచి పెద్ద నోట్లను స్వీకరించరని చెప్పింది. అయితే, ఈ మార్పు అమెజాన్ తో అనుబంధించబడిన థర్డ్-పార్టీ కొరియర్ భాగస్వాముల ద్వారా డెలివరీని ఎంచుకునే వారిని ప్రభావితం చేయదు. ఈ కొరియర్ సేవలు రూ.2,000 నోట్ల ఆమోదానికి సంబంధించి వారి సొంత విధానాలను వర్తింపజేస్తాయి. త్వరలో పనికిరాని కరెన్సీని ఇప్పటికీ కలిగి ఉన్నవారికి ప్రత్యామ్నాయ మార్గాన్ని అందిస్తాయి.

ప్రజలకు మరోసారి అలర్ట్..

అమెజాన్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రజల్లో మరోసారి అలర్ట్ లా ఉపయోగపడింది. పెద్ద నోట్లు చెలామణి నుంచి నిషేధించినా.. ఈ నెల 30తో మార్చుకోడానికి కూడా విధించిన గడువు కూడా పూర్తవుతోంది. దీంతో ఇంకా మిగిలిపోయిన నోట్లను డిపాజిట్ చేసేందుకు ప్రజలు త్వరపడేందుకు ఈ ప్రకటన దోహదపడుతుంది. కాగా ఈ పెద్ద నోట్ల ఉపసంహరణ ప్రకటన వెలువడిన 20 రోజుల్లోనే రూ. 2,000 నోట్లలో 50% బ్యాంకులకు తిరిగి వచ్చినట్లు ఆర్బీఐ గతంలో వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..