Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank FD: వాట్సాప్ నుంచే ఎఫ్‌డీ ఖాతా ప్రారంభించే అవకాశం.. ‘బెటర్ ఎఫ్‌డీ’.. సులభంగా, వేగంగా, సురక్షితంగా..

ఫిన్ టెక్ ప్లాట్ ఫారం ఫిక్స్ డ్ డిపాజిట్లను కూడా వాట్సాప్ ద్వారా ప్రారంభించే అవకాశాన్ని కల్పించింది. బెటర్ ఎఫ్‌డీ పేరిట దీనిని ఆవిష్కరించింది. ఈ బెటర్ ఎఫ్‌డీలో అధిక వడ్డీ రేటు కలిగిన ఎఫ్‌డీ ఆప్షన్లను ఎంచుకోవచ్చు. మార్కెట్లోని బెస్ట్ బ్యాంకులు.. అవి అందించే వడ్డీరేట్లు.. బెస్ట్ ఎఫ్ డీ స్కీమ్లను ఈ ఒక్క మెసేజ్ తో మీరు వెతకవచ్చు. దీని కోసం మీరు ఎటువంటి సేవింగ్స్ ఖాతాను ప్రారంభించాల్సిన అవసరం లేదు.

Bank FD: వాట్సాప్ నుంచే ఎఫ్‌డీ ఖాతా ప్రారంభించే అవకాశం.. ‘బెటర్ ఎఫ్‌డీ’.. సులభంగా, వేగంగా, సురక్షితంగా..
Whatsapp
Follow us
Madhu

|

Updated on: Sep 19, 2023 | 6:15 PM

బ్యాంకింగ్ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. పూర్తిగా డిజిటలైజ్ అవుతోంది. వినియోగదారులు కూడా పూర్తి స్థాయిలో డిజిటల్ లావాదేవీలకు అలవాటు పడుతున్నారు. ఆన్ లైన్, యాప్ ఆధారిత సేవలతో పాటు యూపీఐ లావాదేవీలు అధికంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో కొన్ని బ్యాంకులు వాట్సాప్ బ్యాంకింగ్ సేవలు సైతం అందిస్తున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి ప్రధాన జాతీయ బ్యాంకులు వాట్సాప్ లో విస్తృత సేవలు అందిస్తున్నాయి. కొన్ని ప్రైవేటు బ్యాంకులైతే ఖాతా ఓపెన్ చేయడం కూడా ఆన్ లైన్ లోనే చేపడుతోంది. సేవింగ్స్ ఖాతాలు వాట్సాప్ నుంచి చిన్న మెసేజ్ తో ఓపెన్ అవుతుంది. దీనిని మరింత ముందుకు తీసుకెళ్లిన ఫిన్ టెక్ ప్లాట్ ఫారం  ఫిక్స్ డ్ డిపాజిట్లను కూడా వాట్సాప్ ద్వారా ప్రారంభించే అవకాశాన్ని కల్పించింది. బెటర్ ఎఫ్‌డీ పేరిట దీనిని ఆవిష్కరించింది. ఈ బెటర్ ఎఫ్‌డీలో అధిక వడ్డీ రేటు కలిగిన ఎఫ్‌డీ ఆప్షన్లను ఎంచుకోవచ్చు. మార్కెట్లోని బెస్ట్ బ్యాంకులు.. అవి అందించే వడ్డీరేట్లు.. బెస్ట్ ఎఫ్ డీ స్కీమ్లను ఈ ఒక్క మెసేజ్ తో మీరు వెతకవచ్చు. దీని కోసం మీరు ఎటువంటి సేవింగ్స్ ఖాతాను ప్రారంభించాల్సిన అవసరం లేదు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

వాట్సాప్‌తో ఎఫ్‌డీ..

మీరు వాట్సాప్ ద్వారా ఫిక్స్ డ్ డిపాజిట్ ను ఖాతాను ప్రారంభించవచ్చు. ఫిక్స్‌డ్ ఇన్వెస్ట్ అనే ఫిన్ టెక్ సంస్థ బెటర్ ఎఫ్‌డీ పేరిట ఈ సేవను లాంచ్ చేసింది. దీనిలో మీకు సేవింగ్స్ ఖాతా లేకపోయిన ఎఫ్‌డీని ప్రారంభించవచ్చు. మెచ్యూరిటీ సమయంలో మీరు అందించిన సోర్స్ ఖాతా లోకి సులభంగా మీ అమౌంట్ మొత్తాన్ని ట్రాన్స్ ఫర్ చేసేస్తుంది. అందువల్ల మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.

ఈ ఉదాహరణ చూడండి..

మీరు 18-40 సంవత్సరాల మధ్య వయస్సు గలవారై, హెచ్‌డీఎఫ్సీ బ్యాంక్‌లో ఖాతాను కలిగి ఉన్నారనుకోండి. మీరు కనీసం రెండేళ్లపాటు ఉండే స్వల్పకాలిక ఎఫ్ డీని తెరవాలనుకుంటే.. మీకు ఈ బెటర్ ఎఫ్‌డీ స్కీమ్ బాగా ఉపయోగపడుతుంది. వాట్సాప్ లో బెటర్‌ఎఫ్‌డీ ఇంటరాక్టివ్ ఇంటర్‌ఫేస్ సంబంధిత వివరాలను ఇన్‌పుట్ చేయమని మిమ్మల్ని అడుగుతుంది. నేషనలైజ్డ్ బ్యాంకుల కంటే ఎక్కువ వడ్డీ రేట్లు అందించే ఎఫ్ డీ ఎంపికల పూర్తి జాబితాను తక్షణమే యాక్సెస్ చేస్తుంది. అయితే ఈ జాబితాను మీరు పొందాలంటే మందగా మీ ప్రస్తుత బ్యాంక్ ఖాతా నంబర్, వయస్సు నమోదు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత “ఇన్వెస్ట్ నౌ” ఎంపికను ఎంచుకోవాలి. దీంతో పెట్టుబడిదారుడు ఎంచుకున్న బ్యాంక్ లేదా నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ అధికారిక ఎఫ్డీ బుకింగ్ పోర్టల్‌లోకి వెళ్తారు.

ఇవి కూడా చదవండి

స్మార్ట్‌ఫోన్ తో సునాయాసంగా..

పెట్టుబడిదారులు తమ స్మార్ట్‌ఫోన్‌లలో వాట్సాప్ ద్వారా విభిన్న శ్రేణి ఎఫ్‌డీ ఎంపికలను సౌకర్యవంతంగా అన్వేషించవచ్చు. ఈ ప్రక్రియ పూర్తిగా కాగిత రహితమని కంపెనీ పేర్కొంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)చే నియంత్రించబడే మార్కెట్ ప్లేస్ భద్రత, విశ్వసనీయతకు హామీ ఇస్తుంది. అంతేకాక ఈ ప్లాట్‌ఫారమ్‌లో ఎఫ్‌డీలను బుక్ చేసుకోవడానికి పోటీ వడ్డీ రేట్లతో పాటు పెట్టుబడిదారులకు క్యాష్‌బ్యాక్‌లను కూడా అందిస్తుంది. ప్లాట్‌ఫారమ్ ప్రస్తుతం హిందీ, ఇంగ్లీష్ రెండు భాషా ఎంపికలకు మాత్రమే మద్దతు ఇస్తుంది. త్వరలోనే ఇతర ప్రాంతీయ భాషలకు విస్తరించే అవకాశం ఉంది.

మన దేశంలోనే మొట్టమొదటిది ఇదే..

ఈ సందర్బంగా ఫిక్స్‌డ్ ఇన్వెస్ట్ వ్యవస్థాపకుడు అక్షర్ షా మాట్లాడుతూ, తమ బెటర్‌ఎఫ్‌డీ స్కీమ్ ద్వారా వినియోగదారులు అత్యుత్తమ ఎఫ్‌డీ ఎంపికలను అన్వేషించవచ్చన్నారు. ప్రస్తుత బ్యాంకుతో పోలిస్తే అధిక రాబడిని సాధించడంలో వారికి సాయం చేస్తుందని చెప్పారు. కస్టమర్ల పెట్టుబడి ప్రయాణంలో తెలివిగా ఎంపికలు చేసుకునేందుకు ఇది వీలు కల్పిస్తుంది. వాట్సాప్ ద్వారా పనిచేసే భారతదేశపు మొట్టమొదటి ఎఫ్‌డీ మార్కెట్‌ప్లేస్ బెటర్ఎఫ్‌డీ అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం, ఇది మూడు ప్రైవేట్ బ్యాంకులు, మూడు కార్పొరేట్లు, రెండు చిన్న ఫైనాన్స్ బ్యాంకుల నుంచి ఎఫ్‌డీ ఎంపికలను అందిస్తుందని చెప్పారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..