Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mukesh Ambani: టాప్‌ 10 జాబితాలో వెనుకబడ్డ ముఖేష్‌ అంబానీ.. క్షీణిస్తున్న సంపద

భారతదేశంలోని ఇద్దరు అత్యంత ధనవంతులైన ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీల నికర విలువ కూడా క్షీణించింది. దేశంలోనే అత్యంత విలువైన కంపెనీ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు పతనం కావడం వల్ల ముఖేష్ అంబానీ కూడా నష్టాల పాలయ్యారు. సోమవారం రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు 0.98 శాతం పతనంతో ముగిశాయి. దీంతో ముఖేష్ అంబానీ నికర విలువ 91 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ఈ నికర విలువ క్షీణించిన తర్వాత ముఖేష్ అంబానీ,,

Mukesh Ambani: టాప్‌ 10 జాబితాలో వెనుకబడ్డ ముఖేష్‌ అంబానీ.. క్షీణిస్తున్న సంపద
Bloomberg Billionaire
Follow us
Subhash Goud

|

Updated on: Sep 19, 2023 | 5:40 PM

ప్రపంచంలోని అగ్రశ్రేణి సంపన్నుల సంపదలో క్షీణత ఉంది. ఇందులో టెస్లా లోన్ మస్క్ నుండి భారతదేశానికి చెందిన ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ ఉన్నారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ తాజా డేటా ప్రకారం.. ప్రపంచంలోని టాప్ 20 మంది సంపన్నులలో 15 మంది సంపన్నుల సంపద క్షీణించింది. టెస్లా చీఫ్ ఎలోన్ మస్క్ అత్యంత నష్టపోయారు. టెస్టా షేర్ల పతనం కారణంగా ఎలాన్ మస్క్ నికర విలువ 6.41 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 54,206 కోట్లు) తగ్గింది.

ఇక్కడ, భారతదేశంలోని ఇద్దరు అత్యంత ధనవంతులైన ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీల నికర విలువ కూడా క్షీణించింది. దేశంలోనే అత్యంత విలువైన కంపెనీ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు పతనం కావడం వల్ల ముఖేష్ అంబానీ కూడా నష్టాల పాలయ్యారు. సోమవారం రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు 0.98 శాతం పతనంతో ముగిశాయి. దీంతో ముఖేష్ అంబానీ నికర విలువ 91 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ఈ నికర విలువ క్షీణించిన తర్వాత ముఖేష్ అంబానీ ధనవంతుల టాప్ 10 జాబితా నుండి బయటికి వచ్చారు.

గౌతమ్ అదానీ కూడా నష్టపోయాడు

బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ డేటా ప్రకారం.. అదానీ గ్రూప్ చీఫ్ గౌతమ్ అదానీ నికర విలువ కూడా $668 మిలియన్ల క్షీణతను నమోదు చేసింది. ఈ పతనం తర్వాత గౌతమ్ అదానీ టాప్ రిచ్ లిస్ట్‌లో 19వ స్థానానికి చేరుకున్నాడు. సోమవారం అతని నికర విలువలో $668 మిలియన్ల క్షీణత తర్వాత, గౌతమ్ అదానీ నికర విలువ $65.2 బిలియన్లకు తగ్గింది. ఈ ఏడాది ఇప్పటివరకు గౌతమ్ అదానీ మొత్తం $55.3 బిలియన్ల నష్టాన్ని చవిచూశారు. టాప్ 5లో భారత్‌ నుంచి ఎవ్వరు కూడా లేరు.

ఇవి కూడా చదవండి

ఆదాని నికర విలువలో భారీ క్షీణత ఉన్నప్పటికీ, ఎలాన్ మస్క్ అగ్రస్థానంలో ఉన్నాడు. బెర్నార్డ్ ఆర్నాల్డ్ 172 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నారు. అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ 164 బిలియన్ డాలర్లతో మూడో స్థానంలో, బిల్ గేట్స్ 128 బిలియన్ డాలర్లతో నాలుగో స్థానంలో ఉన్నారు. లారీ ఎల్లిసన్ $128 బిలియన్లతో ఐదవ స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ జాబితా ప్రకారం.. టాప్ 10లో మాత్రమే కాకుండా, టాప్ 5లో భారతీయులు ఎవరూ లేరు. గతంలో ముఖేష్ అంబానీ టాప్ 10లో చేరారు. సోమవారం పతనం తర్వాత ముఖేష్ అంబానీ టాప్ 10 జాబితా నుంచి బయటికి వచ్చారు.  టాప్ టెన్ జాబితాలో ఉన్న రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇప్పుడు ఆ జాబితా నుంచి బయటకు రావడంతో టాప్ 5 జాబితాలో మన భారతీయులు ఎవరు లేరనే చెప్పాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి