Railway Lower Berth: ఇకపై రైలులో లోయర్ బెర్త్ వారికే.. బుక్ చేసే సమయంలో చిన్న టిప్ పాటిస్తే చాలంతే

భారతీయ రైల్వేల ద్వారా ప్రతిరోజూ లక్షలాది మంది ప్రజలు ప్రయాణిస్తూ ఉంటారు. ప్రతి ప్రయాణికుడి అవసరాలను తీర్చేందుకు రైల్వే తన శాయశక్తులా ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా పిల్లలతో పాటు వృద్ధులు కూడా రైళ్లలో ప్రయాణించేందుకు ఆసక్తి చూపుతూ ఉంటారు. ముఖ్యంగా రైల్వే సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక ప్రయోజనాలను అందిస్తుంది. అయితే లోయర్ బెర్త్‌లను పొందే సమయంలో సీనియర్ సిటిజన్లు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో టికెట్ బుక్ చేసుకునే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

Railway Lower Berth: ఇకపై రైలులో లోయర్ బెర్త్ వారికే.. బుక్ చేసే సమయంలో చిన్న టిప్ పాటిస్తే చాలంతే
Follow us
Srinu

|

Updated on: Nov 13, 2024 | 8:00 PM

సీనియర్ సిటిజన్లకు ఉపశమనం కల్పించేందుకు రైల్వే శాఖ అనేక నియమాలను రూపొందించింది. ఇది వారి ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది. సీనియర్ సిటిజన్ల కోసం లోయర్ బెర్త్‌లను బుక్ చేసుకోవచ్చు. సీనియర్ సిటిజన్లకు లోయర్ బెర్త్‌ను సులభంగా కేటాయించడం గురించి ఐఆర్‌సీటీసీ తెలియజేసింది. తన మామయ్యకు రైలు టికెట్ బుక్ చేశానని, కాళ్లకు సమస్య ఉన్నందున లోయర్ బెర్త్‌కే ప్రాధాన్యత ఇచ్చానని, అయితే అప్పుడు కూడా రైల్వే తనకు పై బెర్త్ ఇచ్చిందని ఓ ప్రయాణికుడు ట్వీట్‌లో పేర్కొన్నాడు.

ప్రయాణికుడి ట్వీట్‌పై స్పందించిన రైల్వే మీరు జనరల్ కోటా కింద టికెట్ బుక్ చేసుకుంటే సీటు ఉంటేనే మీకు సీటు అలాట్‌మెంట్ లభిస్తుందని రాసింది. సీటు లేకపోతే రాదు. లోయర్ బెర్త్ కేటాయిస్తే మాత్రమే మీరు రిజర్వేషన్ ఛాయిస్ బుక్ కింద బుక్ చేసుకుంటే మాత్రం కచ్చితంగా మీకు లోయర్ బెర్త్ లభిస్తుందని స్పష్టం చేసింది. 

లోయర్ బెర్త్‌లు మొదట వచ్చిన వారికి మొదటగా అందిస్తామని రైల్వే శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. సీట్లు ఉన్నప్పుడే జనరల్ కోటా కింద బుకింగ్ చేసుకునే వారికి సీట్లు కేటాయిస్తున్నట్లు రైల్వే తెలిపింది. ఈ సీట్లు ఫస్ట్ కమ్ అండ్ ఫస్ట్ సర్వ్ ప్రాతిపదికన అందుబాటులో ఉంటాయి. జనరల్ కోటాలో సీటు పొందడం మొత్తం రైల్వే రిజర్వేషన్ సిస్టమ్ ద్వారా జరుగుతుంది. అయితే మీకు కచ్చితంగా లోయర్ బెర్త్ కావాలంటే మాత్రం ప్రయాణ సమయంలో టీటీఈను సంప్రదించాల్సి ఉంటుంది. ఒకవేళ ఏదైనా లోయర్ బెర్త్ ఖాళీ ఉంటే టీటీఈ మీకు కేటాయించే అవకాశం ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!