NIbe Limited: ఆ కంపెనీ ఇన్వెస్టర్లకు రాబడి పండగ.. రూ.12తో ఏకంగా రూ.1844 రిటర్న్

స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెడితే దీర్ఘకాలంలో అత్యధిక రాబడి పొందవచ్చు. కొంచెం రిస్క్ ఉన్నప్పటికీ లాభాలు ఎక్కువగా ఉంటాయి. ఈ కారణంతోనే చాాలామంది స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపుతారు. అయితే కొన్ని సార్లు కాలం కలిసివస్తే తక్కువ సమయంలోనే గరిష్ట లాభాలను పొందవచ్చు.

NIbe Limited: ఆ కంపెనీ ఇన్వెస్టర్లకు రాబడి పండగ.. రూ.12తో ఏకంగా రూ.1844 రిటర్న్
Follow us
Srinu

|

Updated on: Nov 13, 2024 | 7:47 PM

ప్రస్తుతం నిబే లిమిటెడ్ స్టాక్ హోల్డర్లు లాభాల వానతో తడిసి ముద్దవుతున్నారు. ఎందుకంటే నాలుగేళ్ల క్రితం రూ.12 ఉన్న ఈ కంపెనీ షేర్ ఇప్పుడు రూ.1,844కి పెరిగింది. నిబే లిమిటెడ్ కంపెనీలో డిఫెన్స్, ఏరోస్పేస్ ఉత్పత్తులు తయారవుతాయి. ముఖ్యంగా రక్షణ రంగానికి సంబంధించిన విడిభాగాలను తయారు చేస్తుంది. అలాగే ఎలక్ట్రిక్ వాహనాల కోసం భాగాలను అసెంబుల్ చేస్తుంది. వీటితో పాటు ఈ-బైక్, ఈ-రిక్షాల తయారు చేయాలనే ఆలోచనలో ఉంది. నాలుగేళ్ల క్రితం ఈ కంపెనీ షేరు ధర కేవలం రూ.12 మాత్రమే. ప్రస్తుతం రూ.1844కి చేరింది. అంటే నాలుగేళ్లలో ఇన్వెస్టర్లకు 15,300 శాతం లాభాన్ని ఆర్జించి పెట్టింది.

నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లో మంగళవారం గ్రీన్ లో ప్రారంభమైన ఈ షేరు ఇంట్రాడేలో రూ.1,844 గరిష్ట స్థాయికి చేరింది. ఈ నివేదికను అందించే సమయానికి రూ.1785 వద్ద కొనసాగుతోంది. గతేడాది కూడా లాభాల బాటలోనే పయనించింది. దీని ధర 12 నెలల్లో 210 శాతం పెరిగింది. నిబే లిమిటెడ్‌ కంపెనీ 2005లో స్టాక్‌ మార్కెట్‌లో జాబితా చేయబడింది. కాంపోనెంట్‌ ఫాబ్రికేషన్‌, మ్యాచింగ్‌లో ఎంతో ప్రత్యేకత ఉంది. ప్రస్తుత సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌, డిఫెన్స్‌, ఎలక్ట్రిక్‌ వాహనాలఉ అవసరమైన భాగాలను తయారు చేస్తుంది. ఈ కంపెనీ క్యాపిటలైజేషన్‌ రూ.2400 కోట్లకు చేరుకుంది. గత నాలుగేళ్లలో దీని షేర్లు వివరీతమైన వృద్ధిని సాధించాయి. 2020 నవంబర్‌ 9 రూ.12.57 ఉన్న షేర్‌ ధర ప్రస్తుతం రూ.1,844కి పెరిగింది. నాలుగేళ్లలో స్టాక్‌ ధర పరుగులు తీసింది.

నిబే లిమిటెడ్‌ స్టాకులో నాలుగేళ్ల క్రితం రూ.20 వేలు పెట్టుబడి పెడితే ఇప్పుడు అది రూ.29 లక్షలకు చేరుకుంది. రూ.50 వేలు పెట్టిన వారు ప్రస్తుతం రూ.73 లక్షలు అందుకోనున్నారు. అప్పట్లో లక్ష రూపాయలు పెట్టిన వారికి ఇప్పుడు కోటి రూపాయలు లభించనున్నాయి. బీఎస్‌ఈలో అందుబాటులో ఉన్న డేటా ప్రకారం కంపెనీ ఆదాయం, లాభాలు వివరాలు ఇలా ఉన్నాయి. త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ.109.28 కోట్లు, నికర లాభం రూ.7.86 కోట్లుగా నమోదైంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రూ.279 కోట్లు, నికర లాభం రూ.22 కోట్లు గా తెలిపారు. 2024 సెప్టెంబర్‌ చివరి నాటికి కంపెనీలో ప్రమోటర్లు 53.08 శాతం వాటా కలిగి ఉన్నారు. జూలై – సెప్టెంబర్‌ త్రైమాసికంతో పాటు ఏప్రిల్‌ – సెప్టెంబర్‌ అర్ధ సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక ఫలితాలను విడుదల చేశారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి