AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్వయం ఉపాధి: రూ. 1 లక్ష పెట్టుబడితో వ్యాపారం.. రోజుకు రూ. 1500 సంపాదన?

ప్రస్తుత రోజుల్లో చాలా మంది ఉద్యోగాలపైనే ఆధారపడకుండా సొంతంగా ఏదైనా వ్యాపారం ప్రారంభించి స్థిరపడాలని చూస్తున్నారు. అయితే భారీ పెట్టుబడులు పెట్టలేక వెనకాడుతుంటారు. అలాంటి వారి కోసం తక్కువ ఖర్చుతో, ఎప్పటికీ డిమాండ్ తగ్గని ఒక అద్భుతమైన వ్యాపార ఐడియా ఉంది. అదే పిండి మిల్లు వ్యాపారం. గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాల వరకు ప్రతి ఒక్కరికీ నిత్యావసరమైన సేవలలో ఇది ఒకటి. దీనిని ఎలా ప్రారంభించాలి, లాభాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

స్వయం ఉపాధి: రూ. 1 లక్ష పెట్టుబడితో వ్యాపారం.. రోజుకు రూ. 1500 సంపాదన?
Flour Mill MachineImage Credit source: TV9 Bharatvarsh
Jyothi Gadda
|

Updated on: Jul 20, 2026 | 8:50 PM

Share

మీరు ఉద్యోగంపై ఆధారపడకుండా, తక్కువ ఖర్చుతో సొంత వ్యాపారాన్ని ప్రారంభించాలని చూస్తున్నట్లయితే ఇది మీ కోసమే.. తక్కువ పెట్టుబడితో స్థిరమైన ఆదాయం ఇచ్చే వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి పిండి మిల్లు ఒక అద్భుతమైన అవకాశం. పిండి మిల్లు వ్యాపారం మంచి ఉపాధి అవకాశం. పల్లెటూరులో అయినా, నగరంలో అయినా ప్రతి ఇంటిలోనూ ఈ వ్యాపారం రోజూ అవసరం. ప్రతి ఒక్కరూ ఏదో విధంగా పిండిని ఉపయోగిస్తుంటారు. అందుకే ఈ వ్యాపారంలో వినియోగదారుల కొరత అరుదుగా ఉంటుంది. మీ మిల్లు మంచి ప్రదేశంలో ఉండి, సమర్థవంతంగా పనిచేస్తే, మీరు రోజూ మంచి ఆదాయం సంపాదించవచ్చు.

ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి దాదాపు రూ. 1 లక్ష పెట్టుబడి సరిపోతుంది. ఇందులో ప్రధానమైన ఖర్చు పిండి మర. మార్కెట్లో సింగిల్ ఫేజ్ లేదా త్రీ-ఫేజ్ కరెంట్‌తో నడిచే మంచి నాణ్యత గల పిండి మర మిషన్లు రూ. 30,000 నుండి రూ. 60,000 ధరలో లభిస్తాయి. ఇవి కాకుండా షాప్ అడ్వాన్స్, కరెంట్ ఫిట్టింగ్, త్రాసు వంటి వాటికి మిగిలిన డబ్బు అవసరమవుతుంది. మీ ఇంట్లో కాళీ స్థలం ఉంటే రెంట్ ఖర్చు కూడా మిగులుతుంది.

సాధారణంగా పిండి మిల్లు అనగానే కేవలం గోధుమలు ఆడించడమే అనుకుంటారు. కానీ, లాభాలు పెంచుకోవడానికి మీరు మల్టీపర్పస్ మెషిన్ ఎంచుకోవాలి. దీని ద్వారా గోధుమలు, జొన్నలు, రాగులు, సజ్జలు వంటి ధాన్యాలు పౌడర్ చేయవచ్చు. కారం పొడి, పసుపు కొమ్ములు, ధనియాల పొడి వంటి మసాలా దినుసులు గ్రైండ్ చేయవచ్చు. ప్యాక్ చేసిన బ్రాండెడ్ పిండి కంటే కళ్లెదుట ఆడించిన పిండిని కొనేందుకే ప్రజలు మొగ్గు చూపుతారు. కాబట్టి, మీరే స్వయంగా ధాన్యాలు కొని, పిండి చేసి చిన్న ప్యాకెట్లుగా కూడా అమ్మవచ్చు.

ఇవి కూడా చదవండి

పిండి మిల్లు వ్యాపారంలో లాభాలు మీరు చేసే పని పరిమాణం పై ఆధారపడి ఉంటాయి. సగటున ఒక కిలో ధాన్యం ఆడించడానికి రూ. 5 నుండి రూ. 8 వరకు ఛార్జ్ చేస్తారు. రోజుకు కనీసం 200 నుండి 250 కిలోల ధాన్యం ఆడించినా, కరెంట్ బిల్లు, ఇతర ఖర్చులు పోను రోజుకు రూ. 1000 నుండి రూ. 1500 వరకు నికర లాభం మిగులుతుంది. అంటే నెలకు సులభంగా రూ. 30,000 నుండి రూ. 45,000 వరకు సంపాదించవచ్చు.

అయితే, ఇక్కడ కొన్ని విషయాలను తప్పక గమనించాల్సి ఉంటుంది. వ్యాపారం విజయవంతం కావాలంటే నివాస ప్రాంతాలకు దగ్గరగా ఉండే స్థలాన్ని ఎంచుకోవాలి. అలాగే, కస్టమర్లతో మంచిగా ప్రవర్తించడం, మిల్లును శుభ్రంగా ఉంచడం చాలా ముఖ్యం. స్థానిక మున్సిపాలిటీ లేదా గ్రామ పంచాయతీ నుండి ట్రేడ్ లైసెన్స్, వీలైతే FSSAI రిజిస్ట్రేషన్ చేయించుకోవడం మంచిది. తక్కువ రిస్క్, తక్కువ పెట్టుబడితో గ్యారెంటీ ఆదాయాన్ని ఇచ్చే వ్యాపారాలలో పిండి మిల్లు అత్యుత్తమమైనది. సరైన లొకేషన్ ఎంచుకుని కష్టపడితే ఈ బిజినెస్‌లో త్వరగా స్థిరపడవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us