AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంట్లో లక్ష్మీదేవి నిలవాలంటే చాణక్యుడు చెప్పిన ఈ 3 విషయాలు తప్పక గుర్తుంచుకోండి!

ఆచార్య చాణక్యుడు గొప్ప వ్యూహకర్త మాత్రమే కాదు, అద్భుతమైన ఆర్థిక నిపుణుడు కూడా. ఆయన అందించిన చాణక్య నీతి సూత్రాలు మానవ జీవితాన్ని సరైన మార్గంలో నడిపించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే వారు, ఇంట్లో సంపద పెరగాలని కోరుకునే వారి కోసం చాణక్యుడు తన శ్లోకాలలో కొన్ని రహస్యాలను వెల్లడించారు. చాణక్య నీతిలోని మూడవ అధ్యాయంలో ఉన్న ఒక శ్లోకం ప్రకారం, ఏ ఇంట్లో ఈ మూడు పనులు జరుగుతాయో, అక్కడ లక్ష్మీదేవి స్వయంగా వచ్చి కొలువై ఉంటుంది. ఆ మూడు ముఖ్యమైన విషయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంట్లో లక్ష్మీదేవి నిలవాలంటే చాణక్యుడు చెప్పిన ఈ 3 విషయాలు తప్పక గుర్తుంచుకోండి!
Chanakya Niti For Wealth
Jyothi Gadda
|

Updated on: Jul 08, 2026 | 7:08 AM

Share

కౌటిల్యుడు, విష్ణుగుప్తుడు అని కూడా పిలువబడే ఆచార్య చాణక్యుడు, చాణక్య నీతి అనే ఒక అద్భుతమైన గ్రంథాన్ని రచించాడు. చాణక్య నీతి శాస్త్రం ఆర్థిక ఇబ్బందులకు దారితీసే అనేక సాధారణ సమస్యలను వివరంగా తెలియజేస్తుంది. ఇంట్లో చేసే చిన్న పొరపాట్లు ఆర్థిక కొరతకు, పేదరికానికి ఎలా దారితీస్తాయో వివరిస్తుంది. ఈ సమస్యను నివారించడానికి, చాణక్యుడు కొన్ని తప్పనిసరి నియమాలను వివరించాడు. ఆచార్య చాణక్యుడి నీతిశాస్త్రం ప్రకారం, జీవితంలో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ఐశ్వర్యం సిద్ధించాలంటే ఇంట్లో కొన్ని ప్రత్యేక నియమాలను పాటించాలి. వాటిని సరిగ్గా ఆచరిస్తే, లక్ష్మీదేవి స్వయంగా మీ ఇంటికి తరలివస్తుందని ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి మీ అదృష్టం ప్రకాశిస్తుందని చెబుతున్నారు.

గుణవంతులకు, జ్ఞానులకు గౌరవం ఇవ్వడం:

చాణక్యుడి ప్రకారం, ఏ సమాజంలో లేదా ఏ ఇంట్లో అయితే మూర్ఖులకు ప్రాధాన్యత ఇవ్వకుండా, విద్యావంతులను, గుణవంతులను గౌరవిస్తారో అక్కడ ఎల్లప్పుడూ సానుకూల శక్తి ఉంటుంది. అహంకారులను, మూర్ఖులను దూరం పెట్టి, జ్ఞానుల సలహాలను పాటించే వారి ఇళ్లలో సంపద, సుఖసంతోషాలు ఎప్పటికీ తరగవు.

అన్నాన్ని గౌరవించడం :

మన సంస్కృతిలో అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తారు. చాణక్య నీతి ప్రకారం, ఏ ఇంట్లో అయితే ఆహారాన్ని వృథా చేయకుండా గౌరవిస్తారో, ఆ ఇల్లు ఎల్లప్పుడూ ధాన్యంతో సమృద్ధిగా ఉంటుంది. అవసరమైన వారికి అన్నదానం చేసేవారిపై, ఆహారాన్ని జాగ్రత్తగా దాచుకునే వారిపై అన్నపూర్ణా దేవి, లక్ష్మీదేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. పొరపాటున కూడా అన్నాన్ని అవమానించే లేదా వృథా చేసే ఇళ్ల నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది.

ఇవి కూడా చదవండి

గృహ కలహాలు లేకుండా ప్రశాంతంగా ఉండడం:

లక్ష్మీదేవి చంచలమైనది, ఆమె ప్రశాంతత ఉన్న చోటే నివసిస్తుంది. ఏ ఇంట్లో అయితే భార్యాభర్తల మధ్య నిరంతరం గొడవలు, కలహాలు ఉంటాయో అక్కడ దరిద్రం తాండవిస్తుంది. దీనికి విరుద్ధంగా, పరస్పర అంగీకారం, ప్రేమ, ప్రశాంత వాతావరణం ఉన్న కుటుంబాలలో లక్ష్మీదేవి స్వయంగా వచ్చి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. అటువంటి ఇళ్లలో ఆదాయ వనరులు ఆటోమేటిక్‌గా పెరుగుతాయి.

లక్ష్మీదేవి అనుగ్రహం కేవలం పూజల వల్లే కాదు, మన ఇంట్లో ఉండే వాతావరణం, మనం ప్రవర్తించే తీరుపైనే ఆధారపడి ఉంటుందని చాణక్యుడు స్పష్టం చేశారు. కాబట్టి, ఈ మూడు సూత్రాలను పాటించి మీ ఇంటిని ప్రశాంత నిలయంగా మార్చుకోండి, ధనధాన్యాలను పొందండి.

Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us