
ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ అతిపెద్ద పండుగ సీజన్ సేల్ అయిన బిగ్ బిలియన్ డేస్‌ను త్వరలో ప్రారంభించనుంది. ఈ సేల్ గురించి కంపెనీ అధికారికంగా ప్రకటించింది. గతంలో మాదిరేగానే ఈసారి కూడా స్మార్ట్‌ఫోన్‌లు, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్ వంటి ఉత్పత్తులపై భారీ తగ్గింపులు లభించనున్నాయి. ముఖ్యంగా శామ్‌సంగ్, ఆపిల్, మోటరోలా, రియల్‌మీ వంటి ప్రముఖ బ్రాండ్‌ల ఉత్పత్తులపై కళ్లుచెదిరే ఆఫర్లు ఉంటాయని అంచనా వేస్తున్నారు.
ఈ సేల్ కోసం ఫ్లిప్‌కార్ట్ ఒక ప్రత్యేక మైక్రోసైట్‌ను కూడా సిద్ధం చేసింది. ఈ సంవత్సరం సేల్‌ను గతేడాది కంటే పెద్ద ఎత్తున నిర్వహించాలని కంపెనీ భావిస్తున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం ఏ ఉత్పత్తులపై ఎంత డిస్కౌంట్ ఉంటుంది అనే వివరాలను ఫ్లిప్‌కార్ట్ వెల్లడించలేదు. ఈ సేల్ సాధారణంగా ప్రతి సంవత్సరం దసరా, దీపావళి పండుగ సమయాల్లో జరుగుతుంది.
ఈ సేల్‌లో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ఆపిల్ ఐఫోన్‌లపై లభించే ఆఫర్లు. ఈ సంవత్సరం విడుదలైన ఐఫోన్ 16 సిరీస్ ధర భారీగా తగ్గుతుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఐఫోన్ 16 బేసిక్ వేరియంట్‌ను రూ. 49,999కి కొనుగోలు చేయవచ్చని ట్విట్టర్, రెడ్డిట్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఐఫోన్ 15, ఐఫోన్ 14 సిరీస్‌ల స్టాక్‌ను క్లియర్ చేయడానికి కూడా మంచి ఆఫర్లను ప్రకటించే అవకాశం ఉంది.
అలాగే ఈ సంవత్సరం ప్రారంభంలో విడుదలైన శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్పై కూడా భారీ తగ్గింపులు అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా భవిష్యత్తులో విడుదల కానున్న శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్25 ఎఫ్ఈ మోడల్‌ను కూడా ఈ సేల్‌లో మంచి ధరకు కొనుగోలు చేయవచ్చని నివేదికలు చెబుతున్నాయి.
కేవలం ప్రీమియం ఫోన్‌లే కాకుండా మోటరోలా, రియల్‌మీ, ఇన్ఫినిక్స్, షియోమీ, టెక్నో వంటి ఇతర బ్రాండ్‌ల నుండి బడ్జెట్, మిడ్-బడ్జెట్ ఫోన్‌లను కూడా ఈ సేల్‌లో తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. గత సంవత్సరం విడుదలైన మోడల్‌లపై డిస్కౌంట్లు, ఈఎంఐ, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. స్మార్ట్ టీవీలు, ఏసీలు, రిఫ్రిజిరేటర్లు వంటి గృహోపకరణాలపై కూడా ఫ్లిప్‌కార్ట్ భారీ తగ్గింపులను ప్రకటించనుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి