AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Fasal Bima Yojana: రైతులకు ఆపద వేళ ఆర్థిక భరోసా.. ఫసల్ బీమాతో పైసల చిక్కులు ఫసక్

ఆరోగ్య బీమాను ఉపయోగించుకోవడం ద్వారా అనారోగ్యం సంభవించినప్పుడు భరోసా కలిగినట్టే పంట నష్టం జరిగినప్పుడు కూడా మీరు పంటల బీమా ఉంటే పంట నష్టం సంభవించినప్పుడు కూడా ఆర్థిక భరోసా లభిస్తుంది. అందువల్లే ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పేరుతో రైతులకు కేంద్ర ప్రభుత్వం పంటల బీమాను అందిస్తుంది. అయితే చాలా మంది రైతులకు ఈ పథకంపై అవగాహన లేకపోవడంతో చాలా మంది ఈ పథకాన్ని ఉపయోగించుకోవడం లేదు.

PM Fasal Bima Yojana: రైతులకు ఆపద వేళ ఆర్థిక భరోసా.. ఫసల్ బీమాతో పైసల చిక్కులు ఫసక్
Farmers
Nikhil
|

Updated on: Apr 10, 2024 | 4:00 PM

Share

వేసవి కాలంలో పలు ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంట నష్టపోయే వారి సంఖ్య అధికంగా ఉంటుంది. ముఖ్యంగా అధిక ఎండలు పండ్ల, పూల మొక్కలను నాశనం చేస్తాయి. ఇది దిగుబడిని కూడా ప్రభావితం చేస్తుంది. పంటలు పండక రైతులు ఎక్కువగా నష్టపోతున్నారు. చాలా మంది అప్పుల భారిన పడుతున్నారు. ఆరోగ్య బీమాను ఉపయోగించుకోవడం ద్వారా అనారోగ్యం సంభవించినప్పుడు భరోసా కలిగినట్టే పంట నష్టం జరిగినప్పుడు కూడా మీరు పంటల బీమా ఉంటే పంట నష్టం సంభవించినప్పుడు కూడా ఆర్థిక భరోసా లభిస్తుంది. అందువల్లే ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పేరుతో రైతులకు కేంద్ర ప్రభుత్వం పంటల బీమాను అందిస్తుంది. అయితే చాలా మంది రైతులకు ఈ పథకంపై అవగాహన లేకపోవడంతో చాలా మంది ఈ పథకాన్ని ఉపయోగించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో  ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

కిసాన్ ఫసల్ బీమా యోజన అంటే?

దేశంలోని రైతులు చాలా మంది ప్రైవేట్ పంటల బీమా ద్వారా లబ్ధి పొందుతున్నారు. అయితే 2016లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కిసాన్ ఫసల్ బీమా యోజన పేరుతో కొత్త పంట బీమాను ప్రవేశపెట్టారు. అందులో రైతులకు పంటల బీమాలో అన్ని ప్రయోజనాలను అందించడానికి అనేక కొత్త నిబంధనలు పేర్కొంటున్నారు. భారీ వర్షాలు, వేడిగాలులు, తుఫానుల వల్ల సంభవించే పంట నష్టానికి రైతులు ఇప్పుడు పరిహారం కోరవచ్చు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కార్యక్రమంలో భాగంగా ప్రకృతి వైపరీత్యాల కారణంగా రైతులు పంట నష్టపోతే పరిహారం అందుతుంది. ఈ బీమా వడగళ్ల తుఫానులు, నీటి ఎద్దడి , కొండచరియలు విరిగిపడటం వంటి వాటికి కూడా పరిహారం అందిస్తుంది. 

 ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనలో భాగంగా ఈ తరహా ఘటనలన్నింటినీ స్థానిక విపత్తులుగా పరిగణించి పరిహారం నిర్ణయిస్తారు. మీరు పంటను పండించి, వాటిని పొలంలో ఎండబెట్టడానికి వదిలివేస్తే, పంట చేతికి వచ్చిన 14 రోజులలోపు వర్షం లేదా ఇతర విపత్తుల వల్ల పంట దెబ్బతిన్నట్లయితే మీకు పరిహారం అందుతుంది. పంట బీమా ప్రయోజనాలను ఉపయోగించుకోవడానికి నష్టపోయిన 72 గంటల్లోగా బీమా కంపెనీకి లేదా స్థానిక వ్యవసాయ కార్యాలయానికి తెలియజేయాలి. ఈ విధంగా బ్యాంకు, బీమా కంపెనీ, వ్యవసాయ కార్యాలయం నష్టాన్ని సులభంగా అంచనా వేయవచ్చు. ఈ విధంగా బ్యాంకు, బీమా కంపెనీ, వ్యవసాయ కార్యాలయం నష్టాన్ని మరింత సులభంగా అంచనా వేయవచ్చు. పొలంలో కనీసం 33 శాతం లేదా అంతకంటే ఎక్కువ పంట నష్టపోతే మాత్రమే పరిహారం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..