AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fastag Annual Pass: పాపులర్‌ అవుతున్న వార్షిక టోల్‌ పాస్‌.. మొదటి రోజే 1.4 లక్షల మంది కొనుగోలు

Fastag Annual Pass: వార్షిక పాస్‌ ద్వారా ప్రతిసారి రీఛార్జ్‌, డబ్బులు చెల్లించే ఇబ్బంది ఉండదు. ఏడాది పాటు సుమారు200 ట్రిప్పులు టోల్‌ వదకద ఆగకుండా వెళ్లవచ్చు. వార్షికంగా తీసుకోవడం వల్ల పెద్ద మొత్తంలో డబ్బులు ఆదా అవుతాయి. ఒకే సారి..

Fastag Annual Pass: పాపులర్‌ అవుతున్న వార్షిక టోల్‌ పాస్‌.. మొదటి రోజే 1.4 లక్షల మంది కొనుగోలు
Subhash Goud
|

Updated on: Aug 16, 2025 | 4:41 PM

Share

Fastag Annual Pass: దేశంలో రహదారులపై ప్రయాణం మరింత సులభం అయ్యింది. ఇప్పుడు టోల్‌ ప్లాజా గుండా వెళ్లాలంటే మరింత చౌకగా మారింది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఇటీవల వార్షిక టోల్‌ ప్లాన్‌ను ప్రారంభించింది. ఈ విధానానికి దేశ వ్యాప్తంగా మంచి స్పందన వస్తోంది.దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 1,150 టోల్ ప్లాజాల వద్ద ఇది ఆగస్ట్ 15 నుంచి అమలులోకి వచ్చింది. మొదటి రోజే సాయంత్రం 7 గంటల వరకు దాదాపు 1.4 లక్షల మంది ఈ వార్షిక టోల్‌ పాస్‌ కొనుగోలు చేసి, యాక్టివేట్ చేశారు. అలాగే 1.39 లక్షల టోల్ లావాదేవీలు కూడా నమోదయ్యాయి.

ఇది కూడా చదవండి: EPFO: ఈపీఎఫ్‌ఓ కొత్త నియమం.. ఉద్యోగులకు టెన్షన్‌.. ఏంటది!

తాజాగా కేంద్రం తీసుకువచ్చిన వార్షిక ప్లాన్‌ ఎంత పాపులర్‌ అయ్యిందో ఇట్టే తెలిసిపోతుంది.ఈ క్రమంలో రాజ్‌మార్గ్‌యాత్ర యాప్‌ని ఒక్కసారిగా 25 వేల మంది వరకు యూజర్లు వినియోగించినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ పాస్ ఉన్నవాళ్లకి టోల్ ఫీజు జీరో అని చెప్పే SMSలు కూడా వస్తున్నాయి. దీని సమస్యల పరిష్కారం కోసం ప్రతి టోల్ ప్లాజాలో NHAI నోడల్ అధికారులను నియమించింది. వార్షిక పాస్ వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసేందుకు వీరంతా సహాయం అందిస్తున్నారు. అలాగే వినియోగదారుల ఫీడ్‌బ్యాక్‌, సమస్యల పరిష్కారానికి 1033 హెల్ప్‌లైన్‌ను మరింత బలోపేతం చేశారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Accident Video: ఇలాంటి యాక్సిడెంట్‌ వీడియో మీరెప్పుడైనా చూశారా? సీసీటీవీలో రికార్డ్‌!

ఈ వార్షిక పాస్ ద్వారా ఒక సంవత్సరం చెల్లుబాటు లేదా 200 టోల్ ప్లాజా క్రాసింగ్‌లకు రూ. 3,000 వన్-టైమ్ ఫీజు చెల్లింపు ద్వారా తరచుగా FASTag రీఛార్జ్ చేయవలసిన అవసరం ఉండదు. చెల్లుబాటు అయ్యే FASTag ఉన్న అన్ని వాణిజ్యేతర వాహనాలకు ఇది వర్తిస్తుంది. అలాగే Rajmargyatra యాప్ లేదా NHAI వెబ్‌సైట్ ద్వారా ఫీజు చెల్లించిన రెండు గంటల్లోపు యాక్టివేట్ అవుతుంది.

ఫాస్టాగ్ వార్షిక పాస్ అంటే ఏంటి?

గతంలో వాహనదారులు ప్రతి టోల్ గేట్ వద్ద కూడా ఆగి డబ్బులు చెల్లించాల్సి వచ్చేది. కానీ ఫాస్టాగ్ ఇప్పుడు డిజిటల్‌గా మారింది. అంటే మీరు రూ. 3,000 చెల్లిస్తే ఒక సంవత్సరం పాటు లేదా 200 టోల్ ట్రిప్పుల వరకు టోల్ ఫీజు లేకుండా ఎక్కడ ఆగకుండా ప్రయాణించవచ్చు. ఇది నాన్-కమర్షియల్ వెహికిల్స్‌ కోసం మాత్రమే వర్తిస్తుంది.

వార్షిక పాస్ ఎలా తీసుకోవాలి?

మీ వాహనానికి చెల్లుబాటు అయ్యే ఫాస్టాగ్ ఉండాలి. తర్వాత మీరు Rajmargyatra యాప్‌లో లేదా NHAI అధికారిక వెబ్‌సైట్‌లో రూ. 3,000 చెల్లించి పాస్‌ను కొనుగోలు చేయవచ్చు. పేమెంట్ చేసిన తర్వాత 2 గంటల్లో పాస్ యాక్టివేట్ అవుతుంది.

వార్షిక పాస్‌ ద్వారా బెనిఫిట్స్‌ ఏంటి?

వార్షిక పాస్‌ ద్వారా ప్రతిసారి రీఛార్జ్‌, డబ్బులు చెల్లించే ఇబ్బంది ఉండదు. ఏడాది పాటు సుమారు200 ట్రిప్పులు టోల్‌ వదకద ఆగకుండా వెళ్లవచ్చు. వార్షికంగా తీసుకోవడం వల్ల పెద్ద మొత్తంలో డబ్బులు ఆదా అవుతాయి. ఒకే సారి చెల్లించి ఏడాది పాటు టెన్షన్ లేకుండా ప్రయాణించవచ్చు. ఇండియాలో ప్రస్తుతం 8 కోట్లకు పైగా FASTag యూజర్లు ఉన్నారు. టోల్ గేట్ల వద్ద 98 శాతం వరకు డిజిటల్ ట్రాన్సాక్షన్లు జరుగుతున్నాయి. ఈ విధానం వల్ల టోల్ గేట్ల వద్ద వాహనాలు వేగంగా ముందుకు సాగుతున్నాయి.

ఇది కూడా చదవండి: Whatsapp: మీరు వాట్సాప్‌ వెబ్‌ను ఉపయోగిస్తున్నారా? కేంద్రం హెచ్చరిక

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి