Accident Video: ఇలాంటి యాక్సిడెంట్ వీడియో మీరెప్పుడైనా చూశారా? సీసీటీవీలో రికార్డ్!
Viral Video: ఈ ప్రమాదం చాలా తీవ్రంగా ఉండటంతో బైక్ పై ఉన్న ఇద్దరు వ్యక్తులు రోడ్డుపై పడి తీవ్రంగా గాయపడ్డారు. సమీపంలో ఉన్న వ్యక్తులు వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి గాయపడిన వారికి సహాయం చేశారు. అదే సమయంలో మరో కారు..

తమిళనాడులోని పెరియనాయకన్ పాళయం నుండి ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఒక వృద్ధుడు మద్యం మత్తులో కారు నడుపుతున్నాడు. అతని కారు అతి వేగంగా వెళ్తూ నియంత్రణ కోల్పోయి ఇద్దరు బైక్ రైడర్లను, రోడ్డుపై వెళ్తున్న ఒక కారును ఢీకొట్టింది . ఈ సంఘటన సమీపంలోని CCTV కెమెరాలో రికార్డు అయ్యింది. అంతేకాదు ఈ ఘనటలో ఓ చెట్టు కూడా కూలిపోయింది. అయితే ఇందుకు సంబంధించిన వీడియో ట్వి్ట్టర్‌లో ఇప్పుడు పోస్ట్ చేసినప్పటికీ.. ఈ సంఘటన 2025 ఏప్రిల్ 10న జరిగిందని చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: Sliver: మీరు వెండి ఆభరణాలు కొంటున్నారా? సెప్టెంబర్ నుంచి కొత్త రూల్!
ఈ ప్రమాదం చాలా తీవ్రంగా ఉండటంతో బైక్ పై ఉన్న ఇద్దరు వ్యక్తులు రోడ్డుపై పడి తీవ్రంగా గాయపడ్డారు. సమీపంలో ఉన్న వ్యక్తులు వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి గాయపడిన వారికి సహాయం చేశారు. అదే సమయంలో మరో కారు కూడా స్వల్పంగా దెబ్బతింది. ఈ సంఘటన తర్వాత సంఘటనా స్థలంలో గందరగోళ వాతావరణం నెలకొంది. ఒక వ్యక్తి నిర్లక్ష్యం కారణంగా చాలా మంది ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: PM Modi: ప్రధాని మోదీ రైతులకు బంపర్ గిఫ్ట్.. మరో కొత్త స్కీమ్.. త్వరలో ప్రారంభం..!
ఆ వృద్ధుడు పూర్తిగా మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు ఫోన్ చేసి జరిగిన విషయం తెలియజేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అదే సమయంలో వృద్ధ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. ఈ ప్రమాదం వీడియో సీసీటీవీలో రికార్డయినప్పటి నుండి ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రతిచోటా వైరల్ అవుతోంది.
CCTV footage of an accident in Periyanayakkanpalayam, Tamil Nadu, where an elderly drunken man injured three people. 10/04/2025 pic.twitter.com/G1AMcKcxv5
— Deadly Kalesh (@Deadlykalesh) August 14, 2025
ఇది కూడా చదవండి: New Cyber Fraud: వామ్మో.. సైబర్ మోసాలు ఇలా కూడా ఉంటాయా? బీ కేర్‌ఫుల్!
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




