PMFBY: రైతులకు గమనిక.. ఫసల్‌ బీమా యోజన వివరాలు వెల్లడించిన కేంద్రం..

| Edited By: TV9 Telugu

May 07, 2024 | 11:56 AM

PMFBY: అకాల వర్షాలు, తుఫానులు, అతివృష్టి, అనావృష్టి వంటి ప్రకృతి వైపరీత్యాల కారణంగా రైతులు పంటలు నష్టపోయే ప్రమాదాన్ని తగ్గించడానికి

PMFBY: రైతులకు గమనిక.. ఫసల్‌ బీమా యోజన వివరాలు వెల్లడించిన కేంద్రం..
Pmfby Scheme
Follow us on

PMFBY: అకాల వర్షాలు, తుఫానులు, అతివృష్టి, అనావృష్టి వంటి ప్రకృతి వైపరీత్యాల కారణంగా రైతులు పంటలు నష్టపోయే ప్రమాదాన్ని తగ్గించడానికి ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన ప్రారంభించారు. అయితే ఈ పథకంలో ప్రైవేట్‌ సంస్థలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో చాలా మంది రైతులు నిరుత్సాహానికి గురవుతున్నారు. ఇదిలా ఉంటే ఫసల్ బీమా పథకానికి (పిఎంఎఫ్‌బివై) రైతులు చెల్లించిన ప్రతి రూ.100కి క్లెయిమ్‌గా రూ.475 అందుకున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పేర్కొన్నారు.

ఈ పథకం 13 జనవరి 2016న ప్రారంభించారు. ఇందులో రైతులు చాలా తక్కువ ప్రీమియం అంటే కేవలం కంట్రిబ్యూషన్ మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని తోమర్ చెప్పారు. ఇప్పటి వరకు రైతులు తమ ప్రీమియం వాటాగా రూ.21,450 కోట్లు చెల్లించారని దానికి ప్రతీకగా ఇప్పటివరకు రూ.101875 కోట్లకు పైగా క్లెయిమ్‌లు చెల్లించామని తెలిపారు. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన విషయానికొస్తే.. రైతులు ఖరీఫ్‌లో ఆహారం, నూనెగింజల పంటలకు మాత్రమే బీమా మొత్తంలో గరిష్టంగా 2 శాతం, రబీలో కూడా ఈ రెండు పంటలకే 1.5 శాతం చెల్లించాలి.

వాణిజ్య, ఉద్యాన పంటలకు మొత్తం ప్రీమియంలో గరిష్టంగా 5 శాతం చెల్లించాలి. ఈశాన్య రాష్ట్రాలు మినహా మిగిలిన ప్రీమియాన్నికేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా పంచుకుంటాయి. రబీ సీజన్ పంటలకు 31 డిసెంబర్ 2021లోపు ప్రధాన మంత్రి పంటల బీమా పథకంలో చేరవచ్చు. ఖరీఫ్ 2020 సీజన్‌లో కేంద్ర ప్రభుత్వం, ఈశాన్య ప్రాంత రాష్ట్రాల మధ్య ప్రీమియం సబ్సిడీ వాటా 50:50 నుంచి 90:10కి మార్చారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం మాత్రమే చెల్లించాలి. మిగిలిన 90 శాతం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. మరోవైపు చిన్న రైతుల వాటా ప్రీమియాన్ని తామే భరిస్తామని హర్యానా ప్రభుత్వం ప్రకటించింది.

పగిలిన మడమలతో ఇబ్బంది పడుతున్నారా..! నొప్పి లేకుండా ఇలా తగ్గించుకోండి..

Australia: ప్రపంచకప్‌ జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా.. 15 మంది ఆటగాళ్ల పేర్లు ఖరారు..