భారత్‌లో పెరుగుతున్న ఈవీ మార్కెట్‌కు అనుగుణంగా కంపెనీలు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను రిలీజ్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రిక్ స్కూటర్ల రంగంలో తన ప్రత్యేకతను చాటిన ఎప్లూటో తన స్కూటర్‌లో సరికొత్త వెర్షన్ 7 జీను మార్కెట్‌లోకి రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాదు ఇది ఎలక్ట్రిక్ స్కూటర్ల మార్కెట్ రేంజ్‌ను కూడా పెంచుతుందని కంపెనీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. క్లాసిక్ వెర్షన్‌లో మరింత దృఢంగా ఈ బైక్‌ను తయారు చేశారు. ఇండియాలోని కఠినమైన పరిస్థితులను తట్టకునేలా బైక్‌ను రూపొందించారు. అలాగే మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా రూ.లక్షతోనే ఆన్‌రోడ్ ప్రైస్‌తో వినియోగదారులను ఆకట్టుకుంటుంది. స్ట్రిప్లింగ్ ఎల్లో, పెర్లీ వైట్, షాడో బ్లాక్, యాక్టివ్ గ్రే, ఎలక్ట్రాన్ బ్లూ. రూబీ రెడ్ కలర్స్ ఎప్లూటో 7జీ స్కూటర్ అందుబాటులో ఉండనున్నాయి.
ఈ స్కూటర్ 2200 పవర్‌తో బీఎల్‌డీసీ మోటర్‌తో వినియోగదారులను ఆకట్టకుంటుది. అలాగే 2.5 కెడబ్ల్యూహెచ్ బ్యాటరీ కెపాసిటీతో చార్జ్ చేసిన తర్వాత 90-120 కిలో మీటర్ల పరిధిని అందిస్తుంది. అలాగే ఈ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 60 కిలో మీటర్లుగా ఉంది. ఈ స్కూటర్‌ను ఫుల్‌గా చార్జ్ చేయడానికి 4 గంటల సమయం పడుతుంది. ఎల్‌సీడీ డిస్‌ప్లే, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, స్మార్ట్ లాక్‌తో యాంటీ-థెఫ్ట్ ప్రొటెక్షన్, రీజెనరేటివ్ బ్రేకింగ్ వంటివి ఫీచర్లు ఆకట్టుకునేలా ఉన్నాయి. టెలిస్కోపింగ్ ఫోర్కులు, మోనో-షాక్ ద్వారా ఉంచిన పది అంగుళాల అల్లాయ్ వీల్స్, డిస్క్-డ్రమ్ కాంబో బ్రేకింగ్ సిస్టమ్ ఈ స్కూటర్ల ప్రత్యేకత. క్రోమ్ ఫినిషింగ్‌లతో కూడిన మిర్రర్‌లు, సాఫ్ట్ బాడీ ప్యానెల్స్, స్వూపింగ్ లైన్ వంటి అధునాతన ఫీచర్లు ఈ స్కూటర్‌లో ఉన్నాయి. అయితే ఎప్లుటో 7 జీ లుక్ వెస్పా, కొత్త బజాజ్ చేతక్‌ను పోలి ఉన్నాయని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..